కొత్త జిల్లాల ఏర్పాటుపై హైపవర్ కమిటీ
హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఈ కమిటీకి అధ్యక్షుడిగా ఉంటారు. అలాగే సభ్యులుగా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు జగదీష్రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, జోగు రామన్న ఉన్నారు. కొత్తగా తెరపైకి వచ్చిన నాలుగు జిల్లాలు... గద్వాల్, సిరిసిల్ల, జనగామ, ఆసిఫాబాద్ డిమాండ్లపై ఈ కమిటీ పరిశీలించి.. చర్చించనుంది. అక్టోబర్ 7వ తేదీ మధ్యాహ్నానాని కల్లా నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని సీఎం కేసీఆర్ ఆదేశించారు.