Hypower Committee
-
150 ప్రైవేట్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్..
సాక్షి, న్యూఢిల్లీ : ముంబై-ఢిల్లీ, హౌరా-ఢిల్లీ సెక్టార్లు సహా వంద రూట్లలో దాదాపు 150 ప్రైవేట్ రైళ్లకు హైపవర్ కమిటీ పచ్చజెండా ఊపింది. తేజాస్ ట్రైన్లను ఇప్పటికే ప్రైవేట్ రంగంలో పైలెట్ ప్రాజెక్టు కింద నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ రైళ్లకు హైపవర్ కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వ రంగ రైల్వేలకు గట్టి పోటీకి దారులు తెరుచుకుంటాయని భావిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ వంద రోజుల అజెండాకు అనుగుణంగా రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ ప్రైవేట్ రైళ్లకు ఆమోదముద్ర వేసిన క్రమంలో హైపవర్ కమిటీని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఏర్పాటు చేశారు. ప్రైవేట్ రైళ్ల నిర్వహణకు ఖరారైన మార్గదర్శకాల ప్రకారం రైల్వే, టూరిజం రంగాల్లో అనుభవమున్న భారత, అంతర్జాతీయ కంపెనీలు ప్రైవేట్ రైళ్ల నిర్వహణకు పోటీపడవచ్చు. రూ 450 కోట్ల కనీస నికర విలువ కలిగిన సంస్థలను ఇందుకు అనుమతిస్తారు. ఇక ప్రయాణీకులకు మెరుగైన సేవలు, రైళ్ల రాకపోకల్లో 15 నిమిషాలకు మించని జాప్యం వంటి ఇతర నిబంధనలను ఆయా కంపెనీలు పాటించాల్సి ఉంటుంది. తొలుత ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-కోల్‌కతా రూట్లలో ప్రైవేట్ రైళ్ల నిర్వహణకు అనుమతించనున్నారు. ఈ రూట్లలో రైళ్ల వేగం గంటకు 160 కిమీ ఉండేలా ట్రాక్స్‌ను మెరుగుపరిచేందుకు రైల్వేలు సన్నాహాలు చేస్తున్నాయి. -
మరికాసేపట్లో సీఎంకు 'హైపవర్' నివేదిక
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు కేకే నివాసంలో శుక్రవారం హైపవర్ కమిటీ భేటీ అయింది. కొత్తగా తెరపైకి వచ్చిన నాలుగు జిల్లాలు... గద్వాల్, సిరిసిల్ల, జనగామ, ఆసిఫాబాద్ డిమాండ్లపై ఈ కమిటీ ఇప్పటికే పరిశీలించింది. సదరు జిల్లాల ఏర్పాటుపై ఆయా ప్రాంతాలకు చెందిన నాయకులతో కేకే అధ్యక్షతన హైపవర్ కమిటీ సమావేశం నిర్వహించింది. జిల్లాల ఏర్పాటుపై ప్రజలు నుంచి వినతులు, అభ్యంతరాలను స్వీకరించింది. అనంతరం ఈ అంశంపై కమిటీ తుది నివేదికను సిద్ధం చేస్తుంది. మరి కాసేపట్లో సీఎం కేసీఆర్‌కు ఈ కమిటీ తన నివేదిక ఇవ్వనుంది. తెలంగాణలో దసర రోజున కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతున్న సంగతి తెలిసిందే. అయితే కొత్తగా మరో నాలుగు జిల్లాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మంగళవారం హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఈ కమిటీకి అధ్యక్షుడిగా ఉంటారు. అలాగే సభ్యులుగా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు జగదీష్‌రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, జోగు రామన్న ఉన్నారు. కొత్తగా తెరపైకి వచ్చిన నాలుగు జిల్లాలు... గద్వాల్, సిరిసిల్ల, జనగామ, ఆసిఫాబాద్ డిమాండ్లపై ఈ కమిటీ పరిశీలించి.. చర్చించి.. అక్టోబర్ 7వ తేదీ మధ్యాహ్నాం కల్లా నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. -
ఆ 4 జిల్లాలపై 7న నివేదిక
-
ఆ 4 జిల్లాలపై 7న నివేదిక
* ఎంపీ కేకే నేతృత్వంలో హైపవర్ కమిటీ భేటీ * వివిధ జిల్లాల నేతలతో సుదీర్ఘ చర్చలు * రేపటి వరకు వినతులు, అభ్యంతరాల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: కొత్తగా ప్రతిపాదించిన నాలుగు జిల్లాలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ తొలిసారి భేటీ అయింది. ఎంపీ కేశవరావు నేతృత్వంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఆయన నివాసంలో సుదీర్ఘంగా చర్చలు జరిపింది. కమిటీ సభ్యులు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు జగదీశ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగు రామన్న ఇందులో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు జనగామ, గద్వాల, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటుపై, వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. వారు ఇచ్చిన వినతులు, నివేదికలను స్వీకరించారు. భేటీ అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 6వ తేదీ వరకు ఈ నాలుగు జిల్లాలపై వినతులు, అభ్యంతరాలు, సలహాలు స్వీకరిస్తామన్నారు. వీటన్నింటిని పరిశీలించి 7వ తేదీన ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో ప్రకటించిన 17 జిల్లాలు కాకుండా మరో నాలుగు జిల్లాలకు వచ్చిన డిమాండ్లను పరిశీలించేందుకు సీఎం హైపవర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ నాలుగు జిల్లాల ఏర్పాటు అంశాన్ని అధ్యయనం చేసి 7వ తేదీ మధ్యాహ్నం వరకు నివేదిక ఇవ్వాలని సూచించారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కొత్త జిల్లాల డిమాండ్ల పరిశీలనపై అత్యవసర సమావేశాలు నిర్వహించుకుని వేగంగా ప్రక్రియను ముగించాలని హైపవర్ కమిటీని సీఎం కోరారు. హైదరాబాద్‌ను అలాగే ఉంచండి: నాయిని హైదరాబాద్‌ను ఒకే జిల్లాగా ఉంచాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హైపవర్ కమిటీకి విజ్ఞప్తి చేశారు. చారిత్రక ప్రాధాన్యమున్న దృష్ట్యా ఒకే జిల్లాగా కొనసాగించాలని కోరారు. నల్లగొండ జెడ్పీ చైర్మన్ బాలూనాయక్ దేవరకొండను జిల్లాగా చేయాలని కమిటీని కోరగా.. ఇందుకు నాయిని మద్దతు తెలిపారు. సీఎంకు కృతజ్ఞతలు: డీకే అరుణ గద్వాల ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చినందుకు మాజీ మంత్రి డీకే అరుణ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. గద్వాల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలతో కలసి హైపవర్ కమిటీతో ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దాదాపు అరగంటపాటు కమిటీ సభ్యులతో చర్చించారు. గద్వాలకు ఉన్న చారిత్రక ప్రాధాన్యంతో పాటు భౌగోళికంగా జిల్లాకు ఉండాల్సిన స్వరూపానికి సంబంధించిన వివరాలను కమిటీ సభ్యులతో పంచుకున్నారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మహబూబ్‌నగర్ జెడ్పీ చైర్మన్ కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు. గద్వాల జిల్లా ఏర్పాటుపై చర్చించారు. ఏయే మండలాలతో జిల్లా ఏర్పాటుకు మార్గం సుగమమవుతుందో వివరిస్తూ నివేదికను సమర్పించారు. కల్వకుర్తిని డివిజన్ చేయండి కల్వకుర్తి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత వంశీచంద్‌రెడ్డి కమిటీ సభ్యులను కలసి కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒక నివేదికను సమర్పించారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కూడా కమిటీకి ఇదే విన్నవించారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా బారువత్ గ్రామస్తులు ఎంపీ కేకే నివాసం ఎదుట ఆందోళన చేశారు. తమ గ్రామాన్ని మండలంగా మార్చాలని డిమాండ్ చేశారు. -
కొత్త జిల్లాల ఏర్పాటుపై హైపవర్ కమిటీ
హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఈ కమిటీకి అధ్యక్షుడిగా ఉంటారు. అలాగే సభ్యులుగా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు జగదీష్‌రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, జోగు రామన్న ఉన్నారు. కొత్తగా తెరపైకి వచ్చిన నాలుగు జిల్లాలు... గద్వాల్, సిరిసిల్ల, జనగామ, ఆసిఫాబాద్ డిమాండ్లపై ఈ కమిటీ పరిశీలించి.. చర్చించనుంది. అక్టోబర్ 7వ తేదీ మధ్యాహ్నానాని కల్లా నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని సీఎం కేసీఆర్ ఆదేశించారు.