కొత్తగా ప్రతిపాదించిన నాలుగు జిల్లాలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ తొలిసారి భేటీ అయింది. ఎంపీ కేశవరావు నేతృత్వంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఆయన నివాసంలో సుదీర్ఘంగా చర్చలు జరిపింది. కమిటీ సభ్యులు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు జగదీశ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగు రామన్న ఇందులో పాల్గొన్నారు