వైభవంగా కేసీఆర్ గృహప్రవేశం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, శోభ దంపతులు గురువారం తెల్లవారుజామున 05.22 నిమిషాలకు నూతన నివాసంలోకి గృహప్రవేశం చేశారు. మొత్తం 9 ఎకరాల్లో సీఎం క్యాంపు కార్యాలయం, నివాస భవనం, ప్రత్యేక మీటింగ్ హాల్ ను నిర్మించిన విషయం తెలిసిందే. ఐదు భవనాల సముదాయానికి 'ప్రగతి భవన్', సమావేశ మందిరానికి 'జనహిత' అని నామకరణం చేశారు.
ఈ కార్యక్రమానికి చినజీయర్ స్వామి, పలువురు మంత్రులు హాజరయ్యారు.