
కె.చంద్రశేఖర రావు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు(కెసిఆర్) వందల సంవత్సరాల చరిత్ర గల హుస్సేన్ సాగర్పై దృష్టిసారించారు. ఈ సాగర్ పరిధిలోని భూములను కాపాడేందుకు కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. హైదరాబాద్ గౌరవాన్ని పెంచే విధంగా ఇది ఉండాలన్నారు. ఇది మురికి కూపంలా మారి అవమానకరంగా ఉండకూడదని అన్నారు. 1562లోనే హుస్సేన్ సాగర్ మంచినీరు అందించినట్లు చెప్పారు. ఇప్పుడు మురికి కూపంగా మారడం బాధాకరం అన్నారు. ఎట్టిపరిస్థితులలోనైనా దీనిని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
మురికి నీరు హుస్సేన్ సాగర్లో కలవకుండా అడ్డుకోవాలన్నారు. గణేష్ నిమజ్జనం వల్ల రసాయనాలతో ఇది కలుషితం అవుతుందని చెప్పారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఇందిరా పార్కులో సరస్సు నిర్మించే ప్రతిపాదన ఉన్నట్లు తెలిపారు. సాగర్ ప్రక్షాళనపై హైదరాబాద్ ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళనతో తెలంగాణలో చెరువుల పునరుద్ధరణ ప్రారంభం కావాలన్నారు.
**