సింగరేణి కార్మికులకు మద్దతు: కిషన్‌రెడ్డి | Kishan Reddy comments about singareni workers | Sakshi
Sakshi News home page

సింగరేణి కార్మికులకు మద్దతు: కిషన్‌రెడ్డి

Published Mon, Jun 19 2017 3:03 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

Kishan Reddy comments about singareni workers

సాక్షి, హైదరాబాద్‌: న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సింగరేణి కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు బీజేపీ శాసనసభ పక్ష నేత జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని ఆదివారం ఓ ప్రకటనలో ఆరోపించారు.

వారసత్వ ఉద్యోగాల కల్పన విషయంలో సీఎం కేసీఆర్‌ తొందరపాటు నిర్ణయం, అనాలోచిత విధానాలతో కార్మికుల సమస్యలను మరింత జటిలం చేశారని విమర్శించారు. కార్మిక సంఘాల నేతలపై అక్రమకేసులు పెట్టి అనైతిక చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించారు. ఇది ప్రభుత్వ నియంతృత్వ విధానానానికి, దివాళాకోరుతనానికి నిదర్శనమని, కార్మికుల సమస్యల పరిష్కారంకోసం వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement