కొండపోచమ్మ సామర్థ్యం మళ్లీ పెంపు!
7 టీఎంసీల నుంచి 21 టీఎంసీలకు పెంచాలని సీఎం సూచన
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గజ్వేల్ నియోజకవర్గం పరిధిలో చేపట్టనున్న కొండపోచమ్మ (పాములపర్తి) రిజర్వాయర్ సామర్థ్యంపై ప్రభుత్వం పునరా లోచన చేస్తోంది. ఇంతకుముందు ఈ రిజర్వా యర్ సామర్థ్యాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసు కోగా.. ఇప్పుడా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, సామర్థ్యాన్ని పెంచేదిశగా కసరత్తు చేస్తోంది. ప్రాజెక్టుల పరిధిలో వీలైనంత ఎక్కువ నీటిని నిల్వ చేసేలా ప్రణాళికలు ఉం డాలన్న యోచనతో.. కొండపోచమ్మ సామర్థ్యం పెంపును పరిశీలించాలని సీఎం కేసీఆర్ అధి కారులకు సూచించారు. దీంతో అధికారులు ఇప్పటికే పిలిచిన టెండర్ల ప్రక్రియను పక్కనపెట్టి.. మళ్లీ కొత్త ప్రణాళిక రూపొం దించేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఇప్పటికే ఎన్నో మార్పులు..
తొలుత ప్రతిపాదించిన ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులోని ఎల్లంపల్లి,మిడ్‌మానేరు మినహా మిగతావైన మేడారం ఎత్తిపోతల, మోతె, అనంతగిరి,తిప్పారం రిజర్వాయర్లన్నీ తక్కువ సామర్థ్యం కలిగినవే. దీంతో మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను 1.5 నుంచి 50 టీఎంసీలకు, కొండపోచమ్మ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1టీఎంసీ నుంచి 21 టీఎంసీలకు పెంచాలని నిర్ణయించారు. ఇందులో కొండపోచమ్మ సామర్థ్యం పెంపుతో 5,200 ఎకరాల ముంపు, 1,055 గృహాల తరలింపు ఉంటుందని.. దీనికి రూ.2,899 కోట్లు అవసరమవుతుందని అంచనా వేశారు. అయితే దీని కింద ముంపు గ్రామాల నుంచి వ్యతిరేకత రావడంతోపాటు ఎగువన 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్న సాగర్‌ను నిర్మిస్తున్నందున దిగువన 21 టీఎంసీల రిజర్వాయర్ అవసరం లేదనే భావన వ్యక్తమైంది. దీంతో ప్రభుత్వం ఈ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 7టీఎంసీలకు తగ్గించాలని నిర్ణయించింది.
అందుకు కసరత్తు చేసిన అధికారులు.. రూ.519.7 కోట్లతో అంచనాలు సిద్ధం చేయగా, రెండు రోజుల కిందే టెండర్లు సైతం పిలిచారు. కానీ సోమ వారం కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్షించిన సీఎం... కొండపోచమ్మ సాగర్ సామర్థ్యం పెంపు అంశాన్ని పునఃపరిశీలించాలని సూచిం చారు. గజ్వేల్ నియోజవర్గ పరిధిలోని అన్ని చెరువులను నింపి, వీలైనంత ఎక్కువ ఆయ కట్టుకు నీరిచ్చేందుకు భారీ రిజర్వాయర్ ఉంటేనే బాగుంటుందని సీఎం అభిప్రాయ పడినట్లు తెలిసింది. దీంతో అధికారులు కొండపోచమ్మ టెండర్ల ప్రక్రియ రద్దు చేశారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో రూ.463 కోట్లతో పిలిచిన రంగనాయకసాగర్ టెండర్లు యధావిధిగా కొనసాగనుండగా... గంధ మల, బస్వాపూర్ రిజర్వాయర్లకు మల్లన్నసా గర్‌తో టెండర్లు పిలిచే అవకాశాలున్నాయి.