
దర్శకురాలిగా కొంకణాసేన్‌శర్మ!
కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్న కొంకణాసేన్ శర్మ దర్శకురాలిగా మారే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ‘మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్’, ‘పేజ్ 3’ వంటి చిత్రాలతో విమర్శకుల మన్ననలు పొందిన ఈ నటి తాజాగా ఒక సినిమా కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటోంది. అవకాశం దొరికితే తాను రూపొందించిన కథను తానే తెరకెక్కించాలని ఉందని కొంకణా చెబుతోంది.