సుష్మా స్వరాజ్కు కేటీఆర్ లేఖ
హైదరాబాద్: అమెరికాలో విద్యాభ్యాసం కోసం వెళ్లిన, వెళ్తున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. విద్యార్థులకు వీసా, అనుమతి పత్రాలున్నా, అధికారులు ఇబ్బంది పెడుతున్నారని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.
విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రమంత్రిని కోరారు. విద్యార్థులను వెనక్కి పంపుతుండటం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని కేటీఆర్ తెలిపారు. అమెరికా నుంచి కొందరు విద్యార్థులను, ఆ దేశానికి వెళ్తున్న మరికొందరు విద్యార్థులను పలు విమానాశ్రయాల నుంచి వెనక్కిపంపిన సంగతి తెలిసిందే. వీరిలో తెలుగు విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు.