స్లాబ్ కూలి ఓ వ్యక్తి మృతి | labour sukur died in premnagar, hyderabad | Sakshi
Sakshi News home page

స్లాబ్ కూలి ఓ వ్యక్తి మృతి

Published Fri, Aug 7 2015 4:29 PM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM

labour sukur died in premnagar, hyderabad

హైదరాబాద్(పంజాగుట్ట): ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన నగరంలోని పంజాగుట్ట పరిధిలోని ప్రేమ్ నగర్‌లో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం సుల్తాన్‌పూర్‌కు చెందిన సుకూర్(30) కూలీ పనుల కోసం నగరానికి వచ్చాడు. అయితే ఈ రోజు ప్రేమ్ నగర్‌లోని ఓ పాత ఇంటిని కూలుస్తుండగా స్లాబ్ మీద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement
Advertisement