లడ్డూ వితరణ సేవకు నమోదు చేసుకోండిలా..
తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే ఇష్టపడని వారు ఉండరు. నిత్యం 3 లక్షల లడ్డూలను భక్తులు అందుకుంటుంటారు. ఈ ప్రసాదాన్ని అందుకోవడమే కాదు... అందివ్వడం కూడా అదృష్టమనే భావిస్తారు చాలామంది. అందుకే లడ్డూ ప్రసాద వితరణ సేవకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులకు స్వాగతం పలుకుతున్నారు. ఈ సేవకు ఏ విధంగా ఎన్‌రోల్ చేసుకోవాలి? నియమ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి? తదితర విషయాలు...
ఎలా దరఖాస్తు చేసుకోవాలి..
* ఆసక్తి ఉన్న వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
shttp://112.133.198.195:2202/frmEnrollement.aspx లింక్‌ను క్లిక్ చేయాలి.
* ఇక్కడ మీకు దరఖాస్తు ఫారం కనిపిస్తుంది. వ్యక్తిగత సమాచారం, కమ్యునికేషన్ వివరాలు, సేవ చేయాలనుకునే తేదీ తదితర వివరాలు ఇవ్వాలి.
* 100 కేబీ పరిమాణానికి ఎక్కువ కాకుండా సర్వీసు ఐడీ, ఫొటోలను అప్‌లోడ్ చేయాలి.
* అన్ని పూర్తి చేశాక మీకు ఒక రిఫరెన్స్ నంబరు వస్తుంది.
* మీరు పెట్టుకున్న దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవాలంటే http://112.133.198.195:2202/frmStatusSearch.aspx లింక్‌లో మీ ఎకనాలెడ్జ్ నంబరు ఎంటర్ చేసి, మీ డేట్ ఆఫ్ బర్త్‌ను తెలిపితే దరఖాస్తు స్టేటస్ తెలుస్తుంది.
నియమ నిబంధనలు...
* ఎన్‌రోల్ అయినవారు లడ్డు ప్రసాదం టోకెన్‌లు నిర్ణీత ధరకు భక్తులకు విక్రయించాలి.
* 65 సంవత్సరాలలోపు ఉన్న వారే ఇందుకు అర్హులు.
* హిందువులు అయిన పురుషులను మాత్రమే లడ్డు సేవకు అనుమతిస్తారు.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అందులో రిటైర్ అయిన వారు, బ్యాంక్, ఇన్సూరెన్స్ ఉద్యోగులు ఈ సేవ చేయొచ్చు.
* ఇది స్వచ్ఛందంగా చేసే సేవ. ఎటువంటి రుసుం భక్తులకు చెల్లించరు.
* తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన భక్తులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.
సేవ చేయాల్సిన రోజులు, ప్రదేశాలు...
* రెండు రకాల స్లాట్‌లు ఉంటాయి. వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలి.
* అందులో ఒకటి 4 రోజుల స్లాట్, రెండవది 5 రోజుల స్లాట్.
* 4 రోజుల స్లాట్ గురువారం నుంచి ఆదివారం వరకు ఉంటుంది.
* మొదటి మూడు రోజులు లడ్డు ప్రసాద కౌంటర్‌లలో పనిచేయాలి. చివరి రోజు ప్రధాన ఆలయం లోపల సేవ చేసే అవకాశం కల్పిస్తారు.
* 5 రోజుల స్లాట్ ఆదివారం నుంచి గురువారం వరకు ఉంటుంది. చివరి రోజున మాత్రం ప్రధాన ఆలయం లోపల సేవ చేసే అవకాశం కల్పిస్తారు.
* 4 రోజుల స్లాట్ వారు బుధవారం మధ్యాహ్నం రెండు గంటల లోపు, 5 రోజుల స్లాట్ వారు శనివారం మధ్యాహ్నం రెండు గంటల లోపల తిరుమలలో ఉన్న బస్‌స్టాండ్ వద్దనున్న శ్రీవారి సేవా సదన్‌లో ముందుగా రిపోర్ట్ ఇవ్వాలి.
* అన్ని స్లాట్ సేవకులకు చివరి రోజున శ్రీవారి దర్శనం కల్పిస్తారు.
* నామినల్ రుసుం రూ. 10 తీసుకుని శ్రీవారి లడ్డూను సేవకులకు అందిస్తారు.
రిపోర్ట్ సమయంలో చేయాల్సినవి...
* ఒక రోజు ముందుగానే శ్రీవారి సేవా సదన్‌లో రిపోర్ట్ చేయాలి.
* రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, రెండు ఐడీ ప్రూఫ్‌లు, పెన్షన్ లేక, ఉద్యోగ ఐడెంటిటీ కార్డ్ నఖలు, ఒరిజినల్ సర్వీసు ఐడెంటిటీ కార్డ్ తప్పకుండా తీసుకెళ్లాలి.
నోట్: హిందూ సంప్రదాయం ప్రకారం నడుచుకోవాలి. సేవ చేయాలనుకునే వారిపై ఎలాంటి క్రిమినల్ అభియోగాలు ఉండకూడదు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలి.