
వికటించిన లేజర్ ట్రీట్‌మెంట్
వైద్యులు కటకటాలపాలు
హైదరాబాద్: లేజర్ ట్రీట్‌మెంట్ వికటించడంతో ఓ ఎన్‌ఆర్‌ఐ ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె ఫిర్యాదుతో సంబంధిత డాక్టర్లు కటకటాల పాలయ్యారు. పోలీసులు, బాధితురాలు తెలిపిన ప్రకారం.. చికాగోలో ఉండే చందన (35) ఈ నెల 14న అయ్యప్ప సొసైటీలో ఉండే తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. ఈ నెల 18న హైటెక్‌సిటీలోని రిసేప్ నాన్ సర్జికల్ కాస్మోటిక్స్ క్లినిక్‌కు వెళ్లింది. ముఖంపై లేజర్ హెయిర్ రిమూవర్ ట్రీట్‌మెంట్ చేయాలని కోరింది. డాక్టర్ కొండారెడ్డి జెల్ పెట్టి మిషన్‌తో చందన ముఖంపై వేడి చేశారు. దీంతో ముఖం పూర్తిగా కమిలిపోయింది. వెంటనే బాధితురాలు జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. మర్నాడు ముఖంపై బొబ్బలు ఏర్పడి చర్మం ఊడిపోయింది.
బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు క్లినిక్ యజమాని డాక్టర్ కిరణ్‌కుమార్ , డాక్టర్ కొండారెడ్డిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, తావుు 18న ఫిర్యాదు చేస్తే 20న కేసు నమోదు చేశారని బాధితురాలు ఆరోపించారు. క్లినిక్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.