laser treatment
-
మెరుపులనే దారి మళ్లించారు!
పారిస్: మెరుపంటేనే వేగానికి పెట్టింది పేరు. వేగానికి అత్యుత్తమ ఉపమానం కూడా. మెరుపు వేగం గంటకు ఏకంగా 4.3 లక్షల కిలోమీటర్ల దాకా ఉంటుంది. మెరుపుల ఫలితంగా విను వీధిలో మన కంటికి కనిపించే కాంతులైతే నిజంగా కాంతి వేగంతోనే (సెకను 3 లక్షల కిలోమీటర్లు) దూసుకెళ్తాయి. అలాంటి మెరుపులను దారి మళ్లించగలిగితే? ఫ్రెంచి పరిశోధకులు తాజాగా అలాంటి ఘనతే సాధించారు!! అతి శక్తిమంతమైన లేజర్ కిరణాల ద్వారా వాటి దారిని విజయవంతంగా మార్చగలిగారు. పిడుగుపాటు బారినుంచి రక్షించే వ్యవస్థల్లో ఇది విప్లవాత్మక మార్పులు తేగలదని భావిస్తున్నారు. మెరుపును అనుసరిస్తూ వచ్చి పడే పిడుగుల వల్ల భవనాలు, సమాచార వ్యవస్థ, విద్యుత్ ఉపకరణాలు, సరఫరా లైన్లు దెబ్బ తిని ఏటా వందలాది కోట్ల డాలర్ల మేరకు నష్టం వాటిల్లడమే గాక వేలాది మంది ప్రాణాలు కోల్పోతుండటం తెలిసిందే. ఈ టెక్నాలజీని మరింతగా అభివృద్ధి చేయగలిగితే దీని సాయంతో విమానాశ్రయాలు, భారీ విద్యుత్కేంద్రాలు, ఉపగ్రహాల లాంచింగ్ ప్యాడ్ల వంటి భారీ నిర్మాణాలకు పిడుగుపాట్ల నుంచి పూర్తిస్థాయి రక్షణ కల్పించవచ్చని చెబుతున్నారు. ఫ్రాన్స్‌లోని ఎకోల్ పాలిటెక్నిక్స్ లేబొరేటరీ ఆఫ్ అప్లైడ్ ఆప్టిక్స్కు చెందిన పరిశోధకులు అత్యంత శక్తిమంతమైన లేజర్ పరికరాల సాయంతో ఈ ప్రయోగానికి పూనుకున్నారు. ఇందుకోసం ఏకంగా మూడు టన్నుల బరువు, కారు పరిమాణమున్న లేజర్ పరికరాన్ని ఈశాన్య స్విట్జర్లాండ్‌లోని శాంటిస్ పర్వత శిఖరంపై 2,500 మీటర్ల ఎత్తున ఏర్పాటు చేశారు. దానిద్వారా సెకనుకు ఏకంగా 1,000కి పైగా అతి శక్తిమంతమైన కిరణాలను ఆకాశంలో మెరుపులకేసి పంపించారు. తొలి ప్రయత్నంలోనే వాటి దారిని 160 అడుగుల దాకా మళ్లించగలిగారు. రెండు హైస్పీడ్ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ద్వారా దీన్ని గుర్తించారు. ‘‘అతి శక్తిమంతమైన లేజర్ కిరణాలను ఆకాశంలోకి పంపినప్పుడు శక్తిమంతమైన కాంతితో కూడిన ఫిలమెంట్లు ఏర్పడతాయి. అవి గాలిలోని నైట్రోజన్, ఆక్సిజన్ అణువులను అయానీకరిస్తాయి. ఈ చర్య ఫలితంగా స్వేచ్ఛగా కదలాగే ఎలక్ట్రాన్లు విడుదలవుతాయి. ప్లాస్మాగా పిలిచే ఈ అయానీకరణ చెందిన గాలి ఎలక్ట్రాన్ల వాహకంగా పని చేస్తుంది’’ అంటూ ఈ టెక్నాలజీ పని చేసే తీరును డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్ జీన్ పియరీ వూల్ఫ్ వివరించారు. నిజానికి ఈ కాన్సెప్టును తొలుత 1970ల్లోనే ప్రతిపాదించినా ఇప్పటిదాకా ల్యాబుల్లోనే ప్రయోగించి చూశారు. బయటి వాతావరణంలో ప్రయోగం జరపడం ఇదే తొలిసారి. ఈ పరిశోధన ఫలితాలు జర్నల్ నేచర్ ఫోటానిక్స్‌లో పబ్లిషయ్యాయి. వీటి సాయంతో పిడుగుపాటు నుంచి కాపాడే వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు తేగల హై పవర్ లేజర్ టెక్నాలజీని అభివృద్ధి చేసే పనిలో సైంటిస్టులు బిజీగా ఉన్నారు! -
పై పెదవి, గడ్డం మీద సన్నని రోమాలు.. శాశ్వతంగా తొలగించుకోవచ్చు!
How To Remove Unwanted Hair : వాతావరణ కాలుష్యం కారణంగా మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత ఎక్కువైంది. ఫలితంగా పై పెదవి, గడ్డం మీద సన్నని రోమాలు కనిపిస్తున్నాయి. వీటిని శాశ్వతంగా తొలగించడానికి నిపుణులైన ట్రైకాలజిస్టు సహాయం తీసుకోవాలి. కోల్‌కతా ట్రైకాలజిస్ట్ డాక్టర్ అతుల్ తనేజా సూచన ఇది. లేజర్ కిరణాలతో చేసే ఈ చికిత్సను ‘లేజర్ హెయిర్ రిడక్షన్’ అంటారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ వైద్య నిపుణులు అభివృద్ధి చేసిన ‘సెలెక్టివ్ ఫొటో థర్మోలిసిస్ విధానం’ ద్వారా ఈ చికిత్స చేస్తారు. లేజర్ కిరణాలు నేరుగా రోమమూలాన్ని మాత్రమే తాకుతాయి. పక్క టిష్యూకి, చర్మానికి ఎటువంటి హాని ఉండదు. లేజర్ పల్స్డ్ లైట్ ఒకేసారి అనేక ఫాలికల్స్‌ను పట్టుకుంటుంది. కాబట్టి చికిత్సకు ఎక్కువ సమయం పట్టదు. ఈ ట్రీట్మెంట్తోపాటుగా గైనకాలజిస్టు, ఎండోక్రైనాలజిస్టు సూచనలు కూడా తీసుకోవాలి. చదవండి: Health Tips: నీటితో పోయేది రాయి దాకా వస్తే... -
లేజర్ ట్రీట్మెంట్: 'అమ్మాయిగా అనిపించట్లేదు'
లండన్: మరింత అందంగా కనిపించాలని, తన నిగారింపును రెట్టింపు చేసుకోవాలని తహతహలాడిందో బ్యూటీషియన్. ఈ క్రమంలో ఒంటి మీద ఉన్న అవాంచిత రోమాలను శాశ్వతంగా తొలగించుకోవాలనుకుంది. ఇందుకోసం లేజర్ ట్రీట్మెంట్లు తీసుకుంటూ కాస్మొటిక్ సర్జరీలు చేయించుకుంది. మొత్తంగా రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎనిమిది సార్లు హెయిర్ రిమూవల్ చికిత్స తీసుకుంది. కానీ ఆమె ఆశించినదానికి భిన్నంగా ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని అర్థమై అర్ధాంతరంగా చికిత్సను ఆపేసింది. ఇప్పుడు తనకు తాను అమ్మాయిగా అనిపించడం లేదంటూ చింతిస్తోంది. 2018లో ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్‌కు చెందిన సన్నా సోహైల్ అనే బ్యూటీషియన్ అవాంచిత రోమాలను తొలగించేందుకు చికిత్స తీసుకుంది. ఈ క్రమంలో ఓసారి క్లినిక్‌కు వెళ్లినప్పుడు తనను తాను చూసుకుని తీవ్ర నిరాశ చెందింది. తను ఊహించినట్లుగా అందంగా కనిపించడానికి బదులుగా ఏదో హార్మోన్ల సమస్యలు ఉన్నట్లు నిర్జీవంగా కనిపించింది. దీంతో ట్రీట్మెంట్ మధ్యలోనే ఆపేసింది. పైగా చికిత్స తీసుకున్నచోట ఓ గడ్డ(కణతి) ఏర్పడింది. దీని గురించి సన్నా మాట్లాడుతూ.. నా చర్మంపైన కణతి ఏర్పడగానే వారు వైద్యుడికి చూపిస్తామన్నారు. ఓ ప్రైవేటు డాక్టర్‌ను సంప్రదించి దాన్ని తీసేయిస్తామన్నారు. కానీ ఇప్పటివరకు అది జరగలేదు అని సన్నా వాపోయింది. ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి మార్పులొస్తాయనే కనీస విషయాలేవీ వాళ్లు నాకు చెప్పలేదు. కణతి ఉన్నప్పుడు లెగ్గిన్లు, అండర్‌వేర్‌తో పాటు టైట్ దుస్తులు వేసుకోవద్దని చెప్పలేదు. ఇప్పుడు వాటిని ధరించాలన్నా ఎక్కడ మళ్లీ ఆ కణతి ఏర్పడుతుందోనని భయంగా ఉంది. వీటన్నింటి మధ్య నేను అమ్మాయినే అన్న భావన కలగడం లేదు. ఈ సమస్య వల్ల నేనెప్పటికీ జీన్స్ ధరించలేను అని చెప్పుకొచ్చింది. తనను మానసికంగా ఎంతో బాధించిన ఈ సమస్యను సన్నా అంత ఈజీగా వదల్లేదు. లేజర్ ట్రీట్మెంట్ మీద ఆమె పరిశోధనలు చేపట్టింది. ఓ యంత్రాన్ని సైతం కనిపెట్టింది. తను సొంతంగా ఏర్పాటు చేసిన క్లినిక్‌లో ఈ యంత్రాన్ని లాంచ్ చేసింది. చదవండి: ఆటోపై లగ్జరీ హౌజ్.. ఆనంద్ మహీంద్ర ఫిదా పట్టుమని పది సెకన్లు ఉన్న వీడియోకు రూ.48 కోట్లు గుమ్మరించారు -
అవాంఛిత రోమాల లేజర్ చికిత్సతో చర్మంపై దుష్ప్రభావం ఉంటుందా?
నా వయసు 20 ఏళ్లు. నాకు ముఖంపైన కొన్నిచోట్ల రోమాలు ఉండి అసహ్యంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి అవాంఛిత రోమాలకు లేజర్ చికిత్స గురించి విన్నాను. నేను ఒకవేళ లేజర్ చికిత్స తీసుకుంటే అది నా చర్మంపై ఏదైనా ప్రతికూల ప్రభావం చూపుతుందా? లేజర్ చికిత్స వల్ల ఇతరత్రా ఏమైనా సైడ్ఎఫెక్ట్స్ అంటే శాశ్వతమైన దుష్ప్రభావాలు ఏవైనా ఉంటాయా? నాకు కాస్తంత వివరించండి. అవాంఛిత రోమాలను తొలగించడానికి వాడే లేజర్ చికిత్సలో అందుకు నిర్దేశించిన ఒక నిర్దిష్టమైన వేవ్‌లెంగ్త్‌లో వాటిని వాడటం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల కేవలం రోమాల్లోని కణాలు, చర్మంలోని కొన్ని నిర్దిష్టమైన కణాలు మాత్రమే ప్రభావితమవుతాయి. మరే ఇతర భాగాలూ దీనివల్ల ప్రభావితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనకు అవసరం లేని రోమాలకు మాత్రమే లేజర్ ప్రభావం పరిమితమవుతుంది. కాబట్టి ఒకవేళ మీరు లేజర్ చికిత్స తీసుకోదలిస్తే దీని గురించి ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నిర్భయంగా తీసుకోవచ్చు. -
దానికి లేజర్ ట్రీట్మెంట్ ఉందా?
నా వయసు 35 సంవత్సరాలు. రెండు సాధారణ కాన్పులు. ఇప్పుడు నాకు యోని వదులుగా అనిపిస్తుంది. దగ్గినా, తుమ్మినా కొద్దిగా మూత్రం కారిపోతోంది. యోని లూజుగా ఉండటం వల్ల కలయికలో నాకు, మా ఆయనకు తృప్తి అనిపించడం లేదు. యోని బిగుతుగా అవడానికి ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ ఉందని విన్నాను. దాని గురించి చెప్పగలరు. – ప్రజ్ఞ, హైదరాబాద్ కొంతమందిలో సాధారణ కాన్పుల వల్ల, ఆ సమయంలో తలెత్తే ఇబ్బందుల వల్ల యోనిలోని కండరాలు, టిష్యూ బాగా సాగిపోయి మళ్లీ పూర్వ స్థితి రాకపోవచ్చు. అలాగే కొందరిలో రక్తహీనత, ప్రొటీన్స్ తక్కువగా ఉండటం వంటి అనేక కారణాల వల్ల యోని వదులుగా అయిపోయి, మూత్రాశయానికి సపోర్ట్ లేకపోవడం వల్ల దగ్గినా, తుమ్మినా మూత్రం కారడం, కలయికలో ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. దీనికి చికిత్సలో భాగంగా పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు, పౌష్టికాహారం, వెజైనోప్లాస్టీ ఆపరేషన్, వెజైనల్ టేపులు వంటి ఆపరేషన్ల ద్వారా యోని భాగాన్ని బిగుతు చేయడం జరిగేది. ఇప్పుడు వీటికి పీఆర్పీ చికిత్స, లేజర్ చికిత్స కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. పీఆర్పీ అంటే ప్లాస్మా రిబ్ ప్లేట్లెట్స్. సమస్య ఉన్నవారి రక్తంలోని ప్లాస్మా, ప్లేట్లెట్స్ కణాలను వేరు చేసి, వారి యోని భాగంలోకి ఇంజెక్షన్ ద్వారా పంపడం వల్ల అక్కడి కణాలు వృద్ధి చెంది యోనిభాగం బిగుతుగా అవుతుంది. అలాగే లేజర్ ద్వారా యోనిలోకి పంపించే కిరణాలకు యోని కణజాలం వేడి చెంది, తద్వారా అందులోని గ్రోత్ ఫ్యాక్టర్స్, ఫైబ్రోబ్లాస్ట్ వంటి అనేక కణాలు ప్రేరేపణ చెంది, రక్తప్రసరణ వృద్ధి చెంది యోని బిగుతుగా అవుతుంది. దీనివల్ల చాలా వరకు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎండాకాలంలో చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటాను. ఏ.సి రూమ్ నుంచి బయటికి రాను. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్. ఈ టైమ్‌లో అదేపనిగా ఏసీ రూమ్‌లో ఉండడం మంచిదేనా? రాబోయే ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ద్రవాలు తీసుకోవాలనేది తెలియజేయగలరు. – కె.సంగీత, కాకినాడ ఎండాకాలంలో ఎక్కువ వేడి వాతావరణం కారణంగా గర్భిణులలో చెమటలు పట్టడం, డీహైడ్రేషన్ ఎక్కువగా ఉండటం, వడదెబ్బ తగలడం, బీపీ తగ్గడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, తొందరగా అలసట చెందడం, కాళ్ల వాపు వంటి సమస్యలు ఉండవచ్చు. కాబట్టి ఎండాకాలం వీలైనంత వరకు మధ్యాహ్నం పూట బయటకు వెళ్లకపోవడం మంచిది. బయటి పనులు పొద్దున్నే లేదా సాయంత్రం ఎండ చల్లబడిన తర్వాత చేసుకోవడం మంచిది. మరీ ఎక్కువగా వేడి ఉంటే ఫ్యాను దగ్గర లేదా ఏసీలో ఉండవచ్చు. దీనివల్ల కడుపులోని బిడ్డకు జలుబు చేయడం వంటివేమీ ఉండవు. ఎండాకాలంలో ద్రవపదార్థాలు– మంచినీళ్లు, మజ్జిగ, పండ్లరసాలు, ఎలక్ట్రాల్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవచ్చు. గొడుగు పట్టుకు వెళ్లాలి. మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఉండాలి. ముఖం మీద నీళ్లు చల్లుకుంటూ ఉండాలి. రోజూ రెండుసార్లు మంచినీళ్లతో స్నానం చేయడం మంచిది. కాఫీ, టీ, పచ్చళ్లు, కారాలు, మసాలాలు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఆహారం కొద్ది కొద్దిగా తీసుకోవడం మంచిది. చర్మం పొడారిపోతుంది కాబట్టి మాయిశ్చరైజర్లు, యాంటీ ఫంగల్ పౌడర్లు వాడుకోవచ్చు. లైట్ కలర్ దుస్తులు వదులుగా ఉండేలా వేసుకోవడం మంచిది. ఈ సమయంలో మరీ ఎక్కువగా వ్యాయామాలు చేయకూడదు. పనులు కూడా వెంట వెంటనే కాకుండా మెల్లగా చేసుకోవడం మంచిది. మరీ అధికంగా ఎండకు ఎక్స్పోజ్ అయినట్లయితే మొదటి మూడు నెలల్లో అబార్షన్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే బిడ్డ వెన్నుపూసలో లోపాలు ఏర్పడవచ్చు. తర్వాతి నెలల్లో జాగ్రత్తలు తీసుకోకుంటే ఉమ్మనీరు తగ్గడం, నెలలు నిండకుండానే కాన్పులు జరిగే అవకాశాలు కొంతవరకు ఉంటాయి. ప్రెగ్నెన్సీకి ముందు, ప్రెగ్నెన్సి సమయంలో iodine సప్లిమెంట్స్ తీసుకుంటే మంచిది అని చదివాను. దీనివల్ల కలిగే ఉపయోగాలు తెలియజేయగలరు.– శ్రీ, వేటపాలెం అయోడిన్ అనే ఖనిజలవణం గర్భంలో ఉన్న శిశువు మెదడు ఆరోగ్యకరంగా ఎదగడానికి, పుట్టిన తర్వాత కూడా బిడ్డ మెదడు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. థైరాయిడ్ హార్మోన్ తయారీకి అయోడిన్ ఉపయోగపడుతుంది. తద్వారా శరీరంలో అనేక రసాయనిక చర్యలకు దోహదపడుతుంది. తల్లిలో థైరాయిడ్ హార్మోన్ సక్రమంగా విడుదల అయితేనే అది శిశువుకు చేరి, శిశువు ఆరోగ్యంగా పుట్టడానికి దోహదపడుతుంది. తల్లిలో అయోడిన్ సరిగా లేకపోతే, బిడ్డలో థైరాయిడ్ హార్మోన్ సరిగా ఉత్పత్తి కాకపోవడం, § éనివల్ల శిశువులో మానసిక, శారీరక లోపాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాన్పు తర్వాత కూడా తల్లి పాల ద్వారా అయోడిన్ బిడ్డకు చేరి బిడ్డ మెదడు పనితీరుకు, శారీరక పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అయోడిన్ ఎక్కువగా పాల ఉత్పత్తులు, గుడ్లు, కూరగాయలు, అయోడైజ్డ్ ఉప్పు, సముద్రపు ఆహారం వంటి వాటిలో ఉంటుంది. పైన చెప్పిన ఆహారం సరిగా తీసుకుంటే అయోడిన్ సప్లిమెంట్స్ తప్పనిసరిగా తీసుకోవాలనేమీ లేదు. డా‘‘ వేనాటి శోభబర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
గెడ్డం గీయించుకున్న హీరోయిన్!
-
1972 నాటి గాయాలకు నేడు చికిత్స
న్యూయార్క్: యుద్ధం వల్ల బాల్యం ఎంత ఛిద్రమవుతుందో ప్రపంచానికి చాటిచెప్పిన ఈ చిత్రం నాడు ప్రపంచాన్నే కుదిపేసింది. చిత్రంలో బట్టలు లేకుండా పరుగెడుతూ కనిపిస్తున్న తొమ్మిదేళ్ల వియత్నాం పాప కిమ్ ఫూనకు నేడు సరిగ్గా 52 ఏళ్లు. నాడు దక్షిణ వియత్నాంలోని ట్రాంగ్ బ్యాంగ్ గ్రామంపై యుద్ధ సేనలు ప్రయోగించిన నాపమ్ బాంబు వల్ల వంటిపై బట్టలు మంట పుట్టడంతో ఆ పాప ఆ బట్టలను ఊడదీసి వీధిలో పరుగెత్తింది. అప్పుడు కాలిన గాయాలు ఇప్పటికీ సల్పుతుంటే బాధను మౌనంగా భరిస్తూ వచ్చింది. ఇక ఆ బాధను భరించలేనంటూ కెనడాలోని టొరాంటోలో నివసిస్తున్న కిమ్ ఫూ ఇటీవల అమెరికాలోని మయామి ఆస్పత్రికి వెళ్లి నాటి గాయాలకు చికిత్స చేయించుకుంటోంది. ఆమెకు భర్త బీ యూ తొయాన్, ఇద్దరు పిల్లలు, 1972, జూన్ 7వ తేదీన బాంబు దాడి నుంచి తప్పించుకొని వీధిలో పరుగెడుతున్నప్పుడు, కిమ్ ఫూ, ఆమె సోదరుల ఫొటోను తీసిన నాటి లాస్ ఏంజలిస్ ఏపీ ఫొటోగ్రాఫర్ నిక్ ఉట్లు తోడుగా ఉన్నారు. అప్పడు, ఆ పాపను వాళ్ల సోదరులను ఏపీ మీడియా వాహనంలోనే సకాలంలో ఆస్పత్రిలో చేర్పించి వారి ప్రాణాలను రక్షించింది కూడా ఫొటోగ్రాఫర్ నిక్ ఉట్యే. ఈ ఫొటోను తీసిన నిక్ ఉట్కు పులిట్జర్ అవార్డు లభించింది. ఇప్పడు ఆయనకు 65 ఏళ్లు ఉన్నాయి. ఆయనను కిమ్ ఫూ ‘మామ’ అంటూ ఆప్యాయంగా పిలుస్తారు. నాటి బాంబు దాడిలో ఎడమ చేయి, ఎడమ భుజానికి తీవ్ర కాలిన గాయాలయ్యాయని, చికిత్స కోసం పెద్దయ్యాక ఎన్నో ఆస్పత్రులు తిరిగానని, ఎక్కడికెళ్లినా సరైన వ్యాయామం చేయడం ఒక్కటే మార్గమని చెబుతూ వచ్చారని, నేటికి వ్యాయామం చేస్తున్నా గాయాల బాధ తగ్గడం లేదని, ఎడమ చేయి పూర్తిగా ఇప్పటికీ లేవడం లేదని కిమ్ ఫూ తెలిపారు. అమెరికాలోని ‘మయామి డెర్మటాలజీ లేజర్ ఇనిస్టిట్యూట్’లో సరైన చికిత్స ఉందని తెలిసి, తన భర్త, అంకుల్ ఫొటోగ్రాఫర్ సహాయంతో ఇక్కడికి వచ్చి చికిత్స చేయించుకుంటున్నానని, ఒక్కో సెషన్‌కు దాదాపు రెండు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని చెప్పారు. చావుతోనే తన గాయాల బాధ తీరుతుందని నిన్నటిదాకా భావిస్తూ వచ్చానని, ఏడాదిలోగా ఆ బాధ నుంచి కోలుకుంటాననే ఆశాభావం ఇప్పుడు కలుగుతోందని ఆమె అన్నారు. -
వికటించిన లేజర్ ట్రీట్మెంట్
-
వికటించిన లేజర్ ట్రీట్మెంట్
వైద్యులు కటకటాలపాలు హైదరాబాద్: లేజర్ ట్రీట్మెంట్ వికటించడంతో ఓ ఎన్ఆర్ఐ ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె ఫిర్యాదుతో సంబంధిత డాక్టర్లు కటకటాల పాలయ్యారు. పోలీసులు, బాధితురాలు తెలిపిన ప్రకారం.. చికాగోలో ఉండే చందన (35) ఈ నెల 14న అయ్యప్ప సొసైటీలో ఉండే తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. ఈ నెల 18న హైటెక్‌సిటీలోని రిసేప్ నాన్ సర్జికల్ కాస్మోటిక్స్ క్లినిక్‌కు వెళ్లింది. ముఖంపై లేజర్ హెయిర్ రిమూవర్ ట్రీట్మెంట్ చేయాలని కోరింది. డాక్టర్ కొండారెడ్డి జెల్ పెట్టి మిషన్‌తో చందన ముఖంపై వేడి చేశారు. దీంతో ముఖం పూర్తిగా కమిలిపోయింది. వెంటనే బాధితురాలు జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. మర్నాడు ముఖంపై బొబ్బలు ఏర్పడి చర్మం ఊడిపోయింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు క్లినిక్ యజమాని డాక్టర్ కిరణ్‌కుమార్ , డాక్టర్ కొండారెడ్డిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, తావుు 18న ఫిర్యాదు చేస్తే 20న కేసు నమోదు చేశారని బాధితురాలు ఆరోపించారు. క్లినిక్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
నొప్పి లేని దంత వైద్యం లేజర్ ద్వారా సాధ్యం
దంత అనారోగ్యమే కాదు... వాటి చికిత్స కూడా బాధాకరం అనే అభిప్రాయం మనలోని చాలామందిలో ఉంటుంది. దంతాలకు సంబంధించిన దాదాపు అన్ని సమస్యలకూ, లేజర్ చక్కటి పరిష్కారం. నొప్పిలేకుండా చాలా త్వరగా ఉపశమనం కలిగించే ఆధునాతన చికిత్స లేజర్. లేజర్: లేజర్ అనే కాంతి తక్కువ సమయంలో శరీరంలోని ఏ భాగానికైనా ఎటువంచి నొప్పిని కలిగించకుండా, ఇన్ఫెక్షన్ను తగ్గించి, చాలా తొందరగా ఉపశమనం కలిగిస్తుంది. దంత చికిత్సలో లేజర్ వల్ల ఉపయోగాలు: నొప్పి కలగకుండా చికిత్స ఎటువంటి మత్తు అవసరం ఉండదు చికిత్స సమయంలో ఎటువంటి రక్తస్రావమూ ఉండదు. వైద్యులకు, రోగికి కూడా అనుకూలం ఇన్ఫెక్షన్ వ్యాపించదు తక్కువ సమయంలో నొప్పిని, వ్యాధిని ఉపసంహరిస్తుంది చక్కెర వ్యాధి, రక్తపోటు, గుండె జబ్బులతో పాటు ఇతర వ్యాధి గ్రస్తులకు చాలా అనుకూలం లేజర్ చికిత్స తర్వాత, ఉపయోగించే మందులు కూడా తక్కువ. దంత చికిత్సలో లేజర్ : చిగుళ్ళ చికిత్స : చిగుళ్ళ వాపులు, చిగుళ్ళ నుండి రక్తం కారడం వంటి వ్యాధుల్లో (జింజెవైటిస్, పెరియోడాంటైటిస్) లేజర్‌తో చికిత్స చేయడం చాలా సులువు. డయాబెటిక్ వ్యాధి గ్రస్తులలో ఇది చాలా ఉపయోగం రూట్ కెనాల్ చికిత్స: లేజర్ కాంతిని కెనాల్లో ప్రవేశపెట్టడం ద్వారా, బ్యాక్టీరియా పూర్తిగా నాశనం అయి, sterils ఎన్విరాన్మెంట్ ఏర్పడి మరలా రీఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉంటుంది. పిప్పిపళ్ళ చికిత్స: పంటిని డ్రిల్ చేసేటప్పుడు, పేషెంట్ అనవసరమైన ఆందోళనకు గురికాకుండా, సెన్సిటివిటీ లేకుండా ఉండేందుకు లేజర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నోటిలోని అల్సర్లను, గడ్డలను తగ్గించుటకు నోటి కేన్సర్‌ను గుర్తించడానికి దంతాలు తెల్లగా కనిపించడానికి ఇతర సర్జికల్ పద్ధతులలో కూడా లేజర్ ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు లేజర్ టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉంది. మీ దంత సంరక్షణ మీ చేతుల్లోనే ఉంది. దంతాల మెరుగైన చికిత్స కోసం, లేజర్ ప్రక్రియ ఒక మెరుగైన పరిష్కారం. -
అద్దాలకు సెలవు
పదునైన అస్త్రం లేసిక్ లేసిక్... స్థూలంగా చెప్పుకోవాలంటే తీక్షణమైన లేజర్ కిరణాల సాయంతో మన కంటిలోని కార్నియా వంపును సరిదిద్దే సమర్థమైన ప్రక్రియ! అద్దాల బెడద లేకుండా.. దృష్టి దోషాన్ని అధిగమించేందుకు అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక విధానం. అయితే ఈ సర్జరీ చేసే ముందు కొన్ని కీలకమైన అంశాలను పరీక్షించటం అవసరం. వయసు : 18 పైబడితేనే! దృష్టి దోషాల్లో తరచుగా కనబడేది హ్రస్వదృష్టి. దీన్నే వైద్యపరిభాషలో ‘మయోపియా’ అంటారు. ఇది చాలావరకు ఎదుగుదలలో భాగంగానే వచ్చే సమస్య. కంటి ఎదుగుదల, శరీరం ఎదుగుదల ఒకే తీరులో లేకపోవటం వల్ల వీరిలో కాంతి కిరణాలు రెటీనా మీద సరిగా కేంద్రీకృతం కావు. దీనివలన సాధారణంగా వీరు 11-12 ఏళ్ల వయసులోనే అద్దాలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ దృష్టిదోషం 11-15 ఏళ్ల మధ్య వేగంగా పెరుగుతూ.. చాలావరకు 18-20 ఏళ్లు వచ్చేసరికి స్థిరపడుతుంది. అందుకే మయోపియాకు లేసిక్ సర్జరీని 18 ఏళ్లలోపు వారికి చేయరు. ఆ తర్వాత కూడా కనీసం ఏడాది పాటు పవర్ మారకుండా, స్థిరంగా ఉందని నిర్ధారించుకున్నాకే చేస్తారు. కార్నియా మందం, వంపు రెండూ ముఖ్యం లేజర్ చికిత్సకు ముందు కార్నియా మందం, కార్నియా వంపులను గుర్తించే పరీక్షలు తప్పనిసరి. ఈ సర్జరీ ఎవరికి చెయ్యవచ్చు, ఎవరికి చెయ్యకూడదన్నది వీటిని బట్టి స్పష్టంగా తెలుస్తుంది. మొదటి కీలక పరీక్ష : కార్నియా మందం (పేకోమెట్రీ) కార్నియా అనేది మన కనుగుడ్డు మీద ఉండే తెల్లటి పారదర్శకమైన పొర. లేసిక్ సర్జరీ గురించి నిర్ణయం తీసుకునే ముందు... ఈ కార్నియా పొర మందం ఎంత ఉందో చూడటం తప్పనిసరి. దీన్ని ‘పేకోమీటర్’ సాయంతో కొలుస్తారు. కార్నియా మందం మనిషిమనిషికీ మారుతుంటుంది. మన భారతీయుల్లో సగటున ఈ మందం 510-520 మైక్రాన్ల వరకూ ఉంటుంది. దీని మందం కనీసం 500 మైక్రాన్లు ఉంటేనే లేసిక్ సమయంలో దీని నుంచి పైపొర (ఫ్లాప్) లేపటానికి వీలుంటుంది. ఫ్లాప్ తీసిన తర్వాత కూడా కింద కార్నియా కనీసం 250-280 మైక్రాన్ల మందం ఉండటం అవసరం. అంతకన్నా తక్కువ మందం ఉంటే మున్ముందు కార్నియా పల్చబడి, ముందుకు తోసుకురావచ్చు. దీంతో లేసిక్ వల్ల తగ్గాల్సిన పవర్ కాస్తా... అంతకుముందుకన్నా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. పైగా వీరు అద్దాలు, కాంటాక్ట్ లెన్స్‌లు వాడినా కూడా దృష్టిలో స్పష్టత ఉండదు. దీన్నే ‘కెరటక్టేసియా’ అంటారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే మందం చూడాలి. రెండో పరీక్ష : కార్నియా వంపు (టోపోగ్రఫీ) కార్నియా పొర వంపు (కర్వేచర్) ఎంత ఉందో చెప్పేది టోపోగ్రఫీ. సగటున ఇది 43-44 డయాప్టర్లు ఉంటుంది. ఒకవేళ ఇది మరీ చదునుగా (40 కన్నా తక్కువగా) ఉంటే.. పైపొర ఫ్లాప్ తియ్యటం కొంత కష్టం. ఇలా ఫ్లాప్ తీసేటప్పుడు అది పూర్తిగా ఊడివచ్చేయచ్చు. తర్వాత దాన్ని స్థిరపరిచేందుకు కాంటాక్ట్ లెన్స్ గానీ, కుట్లు గానీ వేయాల్సి వస్తుంది. అలాగే కార్నియా మరీ వంపుగా ఉబ్బెత్తుగా (47 కన్నా ఎక్కువగా) ఉంటే, వీరికి ఫ్లాప్ తీసేటప్పుడు ఒక్కోసారి దానిలో రంధ్రాలు పడే అవకాశం ఉంటుంది. వీరికి కూడా సర్జరీ కష్టమవుతుంది. లేజర్ చేసినా చూపు మసకగా ఉండే ప్రమాదముంది. అందుకే వంపు పరీక్ష కీలకం. వంపునకు సంబంధించి మరో కీలక అంశం ఎంత చక్కదిద్డగలమనేది! పవర్‌ను చక్కదిద్దటానికి కార్నియా వంపు తగ్గించటం కీలకం. ఈ కార్నియా వంపు సుమారు 0.7 డయాప్టర్లు తగ్గిస్తే... పవర్ సుమారుగా 1 తగ్గుతుంది అనుకోవచ్చు. ఉదాహరణకు కార్నియా వంపు 43 డయాప్టర్లు ఉన్న వ్యక్తికి - 10 డయాప్టర్లు తగ్గిస్తే అంతిమంగా వంపు 36 డయాప్టర్లకు వస్తుంది. ఇది ఎవరికైనా సరే.. 35 డయాప్టర్లు కంటే తక్కువ ఉంటే దృష్టి బాగుండదు. కాబట్టి వంపు తక్కువగా ఉన్నవాళ్లకు లేసిక్ చెయ్యటం వల్ల ఇబ్బందులు వస్తాయి. అయితే ఇలాంటి వారికి కంటిలోనే అమర్చే కాంటాక్స్ లెన్సులు (ఇంప్లాంటబుల్ కాంటాక్ట్ లెన్స్‌లు - ఐసీఎల్) వంటి ఇతరత్రా మార్గాలు బాగా పనికొస్తాయి. మరీ పల్చబడిందా? అదీ చూడాలి! గట్టిగా కళ్లను రుద్దే అలవాటు నుంచి రకరకాల కారణాల రీత్యా కొందరిలో కార్నియా పొర పల్చగా అయిపోయే అవకాశం ఉంటుంది. దీన్నే ‘కెరటోకోనస్’ అంటారు. లేసిక్ సర్జరీ చేసే ముందు ఈ సమస్య లేదని కచ్చితంగా నిర్ధారించుకోవటం చాలా అవసరం. ఇది టోపోగ్రఫీ పరీక్షలోనే తెలుస్తుంది. ఒకవేళ ఈ సమస్య ఉందని అనుమానంగా ఉంటే.. కొంతకాలం తర్వాత మళ్లీ పరీక్షించి చూస్తారు. అన్నీ కలిపి... ఆర్బ్స్కాన్ ! అన్నింటినీ కలిపి... ఇప్పుడు ‘ఆర్బ్స్కాన్’ అనే పరీక్ష చేస్తారు. దీనిలో కార్నియా మందం, వంపులే కాకుండా.. కార్నియాకు ముందువైపు ఉపరితలం, వెనకవైపు ఉపరితలం ఎలా ఉంది? అన్నదీ తెలుస్తుంది. ఎవరికైనా కంట్లో కార్నియా పల్చబడే ‘కెరటోకోనస్’ మార్పులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నా దీనిలో తెలుస్తుంది. ఇంకా ఏమేం పరీక్షలు ? కంట్లో నీటి ఉత్పత్తి ఎలా ఉందన్నదీ కీలకమే. దీనికి ‘షిర్మర్స్ టెస్ట్’ చేస్తారు. ఎటువంటి మత్తు చుక్కలూ వెయ్యకుండా కంట్లో 5 నిమిషాల పాటు ప్రత్యేకమైన పేపర్ స్ట్రిప్పులు పెడితే అది కనీసం 15 ఎం.ఎం వరకూ నీటిని పీల్చుకోవాలి. ఇది తక్కువ ఉంటే కళ్లు పొడిబారే (డ్రై ఐస్) సమస్య ఉందని అనుమానించాలి. ఇదెందుకు కీలకమంటే కార్నియా నుంచి పైపొర (ఫ్లాప్) లేపినప్పుడు, లేజర్ చేసినప్పుడు అక్కడ నాడులు దెబ్బతింటారుు. ఇవి పునరుత్తేజమయ్యేందుకు 36 నెలలు పడుతుంది. అంతకాలం కంట్లో కొంత పొడిదనం (డ్రెనైస్) ఉంటుంది. తీవ్రమైన డ్రైఐస్ సమస్య ఉంటే (23 ఎంఎం ఉంటే) పొడిదనం ఎక్కువై దృష్టి మరీ ఇబ్బందిగా ఉండే ప్రమాదం ఉంది. అందుకని కంట్లో నీటి ఉత్పత్తి చూసి, అది మరీ తక్కువగా ఉంటే కొంతకాలం మందులు వాడి, కన్నీటి ఉత్పత్తిని పెంచి... అప్పుడు లేసిక్ చేస్తారు. దీర్ఘకాలంగా కాంటాక్స్ లెన్సులు వాడేవారికి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, షోగ్రెన్స్ వంటి సమస్యలున్న వారికి కళ్లు పొడిబారే సమస్య ఉండొచ్చు. కాబట్టి వీరి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అలాగే నిద్రలో కనురెప్పలు పూర్తిగా మూయకుండా ఉండిపోయే (లెగాప్థాల్మాస్) వారికి... పొడిగా ఉండటమే కాదు.. వీరిలో ఫ్లాప్ మానకుండా దెబ్బతిని పోయే ముప్పూ ఉంటుంది. కాబట్టి నీటి ఉత్పత్తి పరీక్ష తప్పనిసరి. తర్వాతి పరీక్ష... ఆబరోమెట్రీ కంట్లో కిరణాలన్నీ ఒకేచోట కేంద్రీకృతం కాకపోవటాన్ని ‘ఆబరేషన్స్’ అంటారు. ఇవి రకరకాల స్థాయిల్లో ఉంటాయి. లేసిక్ సర్జరీలో కార్నియాను బల్లపరుపుగా చేస్తే ఇవి మరింతగా పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే చాలా ఎక్కువ పవర్ ఉండి, ఈ ఆబరేషన్స్ కూడా ఎక్కువగా ఉండేవారికి లేసిక్ చేస్తే రాత్రిపూట చూపులో స్పష్టత, ముఖ్యంగా ‘కాంట్రాస్ట్’ సరిగా ఉండకపోవచ్చు. (గ్లేర్, హేలోస్) అందుకని ముందే ఈ ఆబరేషన్స్ను కొలుస్తారు. దీని ప్రకారం లేసిక్ సమయంలో పవర్ తగ్గించటంతో పాటు వీటిని కూడా చక్కదిద్దుతారు. దీన్నే ‘కస్టమైజ్డ్ ట్రీట్మెంట్’ అంటారు. కంట్లో ఒత్తిడి... అదీ చూడాలి ఇప్పటికే నీటికాసుల (గ్లకోమా) సమస్య ఉన్నవారికి కంట్లో పీడనం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివారికి ‘లేసిక్’ చెయ్యటం వల్ల ఇబ్బందులు ఉండొచ్చు. ఫ్లాప్ తీసే సమయంలో కంట్లో పీడనం మరింత పెరగొచ్చు. ఈ పీడనం మూలంగా అప్పటికే దృష్టినాడి దెబ్బతిని ఉంటే... సర్జరీ తర్వాత పీడనం పెరిగి సమస్య ముదరొచ్చు. అందుకని సర్జరీకి ముందు కంట్లో పీడనం ఎంత ఉందన్నది కూడా కొలుస్తారు. (ఇలాంటి వారికి లేసిక్ కంటే పీఆర్కే మేలు కావచ్చు) ఎవరికి ఏది ? కార్నియా మందం 500 కంటే ఎక్కువ ఉంటే లేసిక్ చెయ్యచ్చు. ఇలా మయోపియా 8, 9 వరకూ సరిచెయ్యచ్చు. అదే ప్లస్ పవర్ అరుుతే +4, +5 వరకు కూడా సరిచేస్తారు. కార్నియా మందం కొద్దిగా తక్కువున్నా.. 460-500 మధ్య ఉండి, -4, -5 పవర్ వరకు కూడా ‘పీఆర్కే’ చెయ్చచ్చు. గర్భిణులు, పాలిచ్చే తల్లుల్లో హార్మోన్ల మార్పుల వల్ల కార్నియా మందం, వంపు మారుతుంటాయి. అందుకే పాలివ్వటం ఆపేసిన మూడు నెలల వరకూ కూడా లేసిక్ చెయ్యరు. లేసిక్ ఎలా చేస్తారు? ముందుగా మత్తు కోసం కంట్లో చుక్కల మందు వేస్తారు. దీంతో నొప్పి తెలియదు. అనంతరం మైక్రోకెరటోమ్ అనే పరికరంతో కార్నియా పైపొరను గుండ్రంగా కత్తిరించి... ఆ ఫ్లాప్‌ను కాస్త పైకి లేపి... పక్కకు తీసి జరుపుతారు. ఇటీవలి కాలంలో ఈ పొర కత్తిరించి ఫ్లాప్ తియ్యటానికి ఈ పరికరాలు, బ్లేడ్ వాడాల్సిన అవసరం లేకుండా ‘ఫెమటో సెకండ్ లేజర్’ అనేది అందుబాటులోకి వచ్చింది. ఈ లేజర్ సహాయంతో ఫ్లాప్ లేపుతారు. లేజర్‌తో మరింత కచ్చితత్వంతో ఫ్లాప్ తియ్యటం సాధ్యపడుతుంది కాబట్టి కార్నియా వంపు ఎక్కువ తక్కువలున్న వారికి దీనితో మరింత ప్రయోజనకరం. పొర తీసి పక్కకు జరిపిన తర్వాత ఆ కింది భాగం వంపును అవసరమైన మేరకు లేజర్‌తో బల్లబరుపుగా సరిచేసి, ఆ తర్వాత పక్కకు జరిపిన పొరను యథాస్థానంలో వెనక్కి జరిపేస్తారు. దాన్ని పొడిగా చేసి, యాంటీబయాటిక్ చుక్కల మందులు ఇస్తారు. ఒకటి రెండు రోజులు విశ్రాంతి, నిద్ర అవసరం. ఈ సర్జరీ చేసిన 2, 3 గంటల్లోనే పైపొర సర్దుకుంటుంది. ఒకటి రెండు గంటల పాటు కంట్లో చికాకుగా ఉండొచ్చు. ఆ తర్వాత తగ్గిపోతుంది. దాదాపు మర్నాటికే చూపు సాధారణ స్థితికి వచ్చేస్తుంది. కన్ను రుద్దకుండా ఉండేందుకు పైన రక్షణగా ‘షీల్డ్’ పెడతారు. మర్నాటి నుంచి యాంటీ బయాటిక్స్, స్టిరాయిడ్స్, కృత్రిమ కన్నీటి చుక్కల మందులు ఇస్తారు. కంటికి ఒత్తిడి తగలకుండా ఒక వారం పది రోజులు జాగ్రత్త తీసుకోవటం, ముఖం కడుక్కునేటప్పుడు కంట్లో నీరు పోకుండా చూసుకోవటం ముఖ్యం. ఇలా రెండు కళ్లకూ ఒకేసారి లేసిక్ చేస్తారు. పీఆర్కే ... పీఆర్కే అంటే ‘ఫోటో రిఫ్రాక్టివ్ కెరటెక్టమీ (పీఆర్కే)’. కార్నియాలో ఐదు పొరలుంటాయి. పైపొరను ఎపిథీలియం అంటారు. దీని మందం అంతా ఒకే తీరులో ఉండదు. అసమంగా ఉండే ఈ పైపొరను తొలగించి, మిగతా భాగానికి లేజర్ చేసి, జీరో పవర్ కాంటాక్ట్ లెన్స్ అమరుస్తారు. 3-4 రోజుల్లో అంతా సర్దుకుంటుంది. అప్పుడు కాంటాక్ట్ లెన్సు తీసేస్తారు. 7-8 రోజుల్లో చూపు స్పష్టత వస్తుంది. ఇలా -4 నుండి -6 వరకూ పవర్ ఉన్నవారికి పీఆర్కే బాగా ఉపయోగపడుతుంది. అంతకన్నా ఎక్కువ పవర్ ఉన్నప్పుడు పీఆర్కే చేస్తే పవర్ తిరిగి రావొచ్చు. కొందరిలో చూపు మసకబారొచ్చు (హేజ్). కాబట్టి ఎవరికి ఏది బాగా ఉపయోగపడుతుందన్నది నిర్ధారించటం ముఖ్యం. ఫలితాలు పవర్ ఏమాత్రం లేకుండా, అద్దాల అవసరం లేకుండా చెయ్యటం లక్ష్యం. చాలామంది విషయంలో దీన్ని సాధించొచ్చు. కొన్నిసార్లు మాత్రం కొద్దిగా పవర్ మిగలొచ్చు. ముఖ్యంగా -1 నుంచి -6 వరకు ఫలితాలు ఆశించినట్టే ఉంటాయిగానీ అంతకుమించి ఎక్కువ పవర్ సరిదిద్దాలని చూసినప్పుడు కొద్దిగా పవర్ మిగలొచ్చు. అవసరమైతే మూడు వారాల తర్వాత మరోసారి లేసిక్తో సరిచెయ్యెచ్చు. కన్ను పొడిబారే (డ్రైనెస్) సమస్య రావచ్చు. దీన్ని ముందే అంచనా వేస్తారు. కాబట్టి కృత్రిమ కన్నీటి చుక్కల వంటివి 2,3 నెలల పాటు ఇస్తారు. పవర్ తిరిగి వచ్చేస్తుందా? అన్నది పెద్ద అనుమానం. కార్నియా మందం బాగుంటే సాధారణంగా పవర్ తిరిగి రావటమన్నది ఉండదు. పల్చటి కార్నియాలు, కెరటోకోనస్ వంటి సమస్యలున్న వారికి పవర్ తిరిగి వచ్చే అవకాశం ఎక్కువ, అందుకే ముందుగానే స్క్రీనింగ్ కచ్చితంగా చెయ్యటం అవసరం. మొత్తానికి... కార్నియా పొరమీద ఫ్లాప్ తీసేందుకు మైక్రోకెరటోమ్, ఫెమటోసెకండ్ లేజర్ వంటివి మరింత కచ్చితత్వాన్ని సంతరించుకోవటం, కార్నియా పట్ల అవగాహన పెరగటం, రాబోయే దుష్ర్పభావాలను ముందుగానే ఊహించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం... ఏది ఎవరికి సరైనదో నిర్ధారించటం.. వీటన్నింటి కారణంగా ఇప్పుడు లేసిక్ సర్జరీ చాలా సురక్షితమైనదిగా ఆవిర్భవించిందని చెప్పొచ్చు.