సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండకూడదనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్ కుట్రపూరిత రాజకీయాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్లు, మెదక్ జిల్లా నేతలు హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్‌ను మంగళవారం కలిశారు.
ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో గెలుపొందిన ఇతర పార్టీల వారిని బెదిరించి, ప్రలోభపెట్టి టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడానికి సీఎం, మంత్రులు నైతిక విలువలకు తిలోదకాలు ఇస్తున్నారన్నారు. ఇదేనా కోరుకున్న తెలంగాణ.. అని తెలంగాణ వాదులు బాధపడే పరిస్థితులు చోటు చేసుకున్నాయన్నారు. రాష్ట్రంలో బీజేపీకి చెందిన ముగ్గురు మున్సిపల్ చైర్మన్లలో ఇద్దరిని బెదిరించి టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారన్నారు.
ప్రతిపక్షాలు ఉండొద్దని టీఆర్‌ఎస్ కుట్ర : లక్ష్మణ్
Published Wed, Apr 13 2016 3:17 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement