హైదరాబాద్: ఓటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా ఎల్‌ఈడీ దీపాలను ఏర్పాటు చేయనున్నట్లు హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వరకు 24 కిలోమీటర్ల మేర రూ.56 కోట్లతో ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఓఆర్‌ఆర్‌ను గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు అనుగుణంగా నిర్మించారని, ప్రమాదాల నేపథ్యంలో ఈ వేగాన్ని నియంత్రించాల్సి ఉందని చెప్పారు.
అదేవిధంగా హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన కార్యక్రమం కొనసాగుతుందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే, వెలికి తీసిన పూడికను ఎక్కడ వేయాలన్న ప్రధాన అడ్డంకి కారణంగా పూడికతీతను నిలిపివేస్తున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలోనే బయోరిమెడియేషన్ విధానం ద్వారా సాగర్‌ను శుద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఔటర్లో ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు
Published Wed, May 18 2016 3:10 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement