హైదరాబాద్ : సరూర్‌నగర్ సబ్‌స్టేషన్ పరిధిలో కమలానగర్‌లో లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీశైలం (38) ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. కాలనీలోని ఓ ట్రాన్స్‌ఫార్మర్ మీద ఫీజు సరి చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాలనీవాసులు వెంటనే స్పందించి... పోలీసులతోపాటు విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు.
వారు వెంటనే కాలనీకి చేరుకుని... శ్రీశైలం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శ్రీశైలం స్వగ్రామం హయత్నగర్ మండలం కుంట్లూరు అని పోలీసులు వెల్లడించారు. శ్రీశైలం మృతితో అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.