మహా గణపతి లడ్డూ పంపిణీ | Maha Ganapati laddu distribution | Sakshi
Sakshi News home page

మహా గణపతి లడ్డూ పంపిణీ

Published Tue, Sep 13 2016 11:02 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM

మహా గణపతి లడ్డూ పంపిణీ

మహా గణపతి లడ్డూ పంపిణీ

ఖైరతాబాద్‌:  ఖైరతాబాద్‌ మహా గణపతి లడ్డూను మంగళవారం పంపిణీ చేశారు. తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్‌ నిర్వాహకుడు మల్లిబాబు 2010లో 500 కిలోల లడ్డూను స్వామికి ప్రసాదంగా సమర్పించారు. 2011లో 2400 కిలోలు, 2012లో 3500, 2013లో 4200, 2014లో 5200, 2015లో 6000కిలోల మహాలడ్డూను ఖైరతాబాద్‌ మహాగణపతికి సమర్పించారు. ఈ ఏడాది అందజేసిన 500 కిలోల లడ్డూను ఉత్సవ కమిటీ సభ్యులు మంగళవారం ఉదయం 5 నుంచి 11 గంటల వరకూ క్యూలో వచ్చిన భక్తులకు పంపిణీ చేశారు. దాదాపు ఆరువేల మంది భక్తులకు ప్రసాదం అందజేసినట్టు కమిటీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ రాజ్‌ కుమార్‌ తెలిపారు.
సంతోషంగా ఉంది..
‘ఏటా లడ్డూ పంపిణీ ఉత్సవ కమిటీ సభ్యులకు సవాలుగా మారేది. ఈ సంవత్సరం క్యూలో వచ్చే భక్తులకు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని శిల్పి రాజేంద్రన్ సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement