Maha Ganapati
-
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఎన్ని గంటలకంటే..
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్రకు ఉత్సవ సమితి ఏర్పాట్లు చేస్తోంది. ఈ రోజు అర్థరాత్రి చివరి పూజ అనంతరం నిమజ్జనానికి సిద్ధమయ్యారు. చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. అటు.. రేపు జరగబోయే శోభాయాత్రలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొననున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను ఉత్సవ సమితి చేసింది. ఖైరతాబాద్ వినాయకునికి ఎంతో ప్రాధాన్యత ఉంది. నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. తొమ్మిది రోజులుగా పూజలు నిర్వహించిన ఉత్సవ సమితి నేడు అర్ధరాత్రి ఇక చివరి పూజను నిర్వహించనుంది. అర్ధరాత్రి 1 గంట తర్వాత మహాగణపతిని ఉత్సవ సమితీ కదిలించనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలలోపు మహాగణపతి నిమజ్జనం పూర్తి అయ్యేలా ఏర్పాట్లు చేశారు. శోభాయాత్ర సాగుతుంది ఇలా.. ►ఈ రోజు అర్థరాత్రి 12 గంటలకు మహా గణపతికి చివరి పూజ ►అర్దరాత్రి 1 గంట తర్వాత మహాగణపతిని కదిలించనున్న ఉత్సవ కమిటీ ►రాత్రి 2 నుంచి తెల్లవారుజామున 4 వరకు విగ్రహాలను భారీ టస్కర్ లోకి ఎక్కించనున్న కమిటీ ►ఉదయం 4 నుంచి 7 వరకు మహాగణపతిని భారీ వాహనంపై ఎక్కించి వెల్డింగ్ వర్క్ ►ఉదయం ఎనిమిది గంటల లోపు ప్రారంభం కానున్న మహా గణపతి శోభాయాత్ర ►టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ చేరుకోనున్న మహా గణపతి ►ఉదయం 10 గంటల సమయంలో క్రేన్ నెంబర్ 4 వద్ద కు చేరుకునే అవకాశం ►తర్వాత భారీ వాహనంపై మహాగణపతి తొలగింపు కార్యక్రమం ►క్రేన్ నెంబర్ ఫోర్ వద్ద ఉదయం 11 నుంచి 12 గంటల లోపు పూజా కార్యక్రమం ►12 నుంచి హుస్సేన్ సాగర్ లో మహాగణపతి నిమజ్జన కార్యక్రమం షురూ ►మ. 2 గంటల లోపు మహా గణపతి నిమజ్జనం పూర్తి అయ్యేలా ఏర్పాట్లు నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. మహాగణపతి నిమజ్జనానికి హైదరాబాద్ సిద్ధమైంది. హుస్సేన్‌సాగర్‌తోపాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 100 చోట్ల నిమజ్జనాలు జరగనున్నాయి. ఇందుకోసం జీహెచ్ఎంసీ క్రేన్లు, జేసీబీలు, టిప్పర్లతోపాటు వేలాదిమంది సిబ్బందిని ఏర్పాటు చేసింది. నిమజ్జనం సందర్భంగా ప్రమాదవశాత్తు ఎవరైనా నీళ్లలో పడిపోతే రక్షించేందుకు 200 మంది గజ ఈతగాళ్లను కూడా సిద్ధం చేసింది. అలాగే, శోభాయాత్ర జరిగే రహదారులపై వైద్య శిబిరాలు, 79 అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచింది. నిమజ్జనానికి తరలివచ్చే వారి కోసం జలమండలి 10 లక్షల నీళ్ల ప్యాకెట్లను రెడీ చేసింది. నిమజ్జనం రోజున ప్రజల సౌకర్యార్థం హుస్సేన్ సాగర్‌కు నగరం నలుమూలల నుంచి 535 బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. అలాగే 29 తెల్లవారుజాము వరకు ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. మెట్రో రైళ్లు కూడా రేపు అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు నడవనున్నాయి. ఇదీ చదవండి: ప్రతి గణేష్ విగ్రహానికీ క్యూఆర్ కోడ్ -
మహా గణపతి దర్శనానికి భక్తజనం
ఖైరతాబాద్: మహా గణపతి దర్శనానికి భక్తజనం పోటెత్తారు. ఆదివారం నగరం నలు దిక్కుల నుంచి భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో ఖైరతాబాద్ రైల్వేగేట్, సెన్సేషన్ థియేటర్, మింట్ కాంపౌండ్, ఐమాక్స్ పరిసర ప్రాంతాలన్నీ జనసంద్రాన్ని తలపించాయి. అడుగు తీసి అడుగు వేయలేనంతగా రద్దీతో వీధులన్నీ నిండిపోయాయి. ఖైరతాబాద్ రైల్వేగేట్ నుంచి పట్టాలపై భక్తులు ఎటూ కదలేని పరిస్థితి నెలకొంది. జనం ముందుకు, వెనక్కు కదలేని పరిస్థితిలో రైళ్ల రాకపోకలనే నిలపాల్సిన పరిస్థితి నెలకొంది. ఏర్పాట్లు సక్రమంగా చేయకపోవడంతో ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చిందని పలువురు ఆవేదన వ్యక్తంచేశారు. కొంతమంది చిన్నారులు తప్పిపోవడంతో తల్లిదండ్రుల నానా ఇబ్బందులకు గురయ్యారు. – -
Khairtabad: మహాగణపతికి తొలిపూజ నిర్వహించిన మంత్రి తలసాని
-
మహా గణపతి లడ్డూ పంపిణీ
ఖైరతాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి లడ్డూను మంగళవారం పంపిణీ చేశారు. తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ నిర్వాహకుడు మల్లిబాబు 2010లో 500 కిలోల లడ్డూను స్వామికి ప్రసాదంగా సమర్పించారు. 2011లో 2400 కిలోలు, 2012లో 3500, 2013లో 4200, 2014లో 5200, 2015లో 6000కిలోల మహాలడ్డూను ఖైరతాబాద్ మహాగణపతికి సమర్పించారు. ఈ ఏడాది అందజేసిన 500 కిలోల లడ్డూను ఉత్సవ కమిటీ సభ్యులు మంగళవారం ఉదయం 5 నుంచి 11 గంటల వరకూ క్యూలో వచ్చిన భక్తులకు పంపిణీ చేశారు. దాదాపు ఆరువేల మంది భక్తులకు ప్రసాదం అందజేసినట్టు కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజ్ కుమార్ తెలిపారు. సంతోషంగా ఉంది.. ‘ఏటా లడ్డూ పంపిణీ ఉత్సవ కమిటీ సభ్యులకు సవాలుగా మారేది. ఈ సంవత్సరం క్యూలో వచ్చే భక్తులకు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని శిల్పి రాజేంద్రన్ సంతోషం వ్యక్తం చేశారు. -
‘మహా’ పోటీ
గణేశుని లడ్డూ కోసం పోటెత్తిన భక్తులు గంటల తరబడి బారులు ఖైరతాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి చేతిలో పూజలందుకున్న మహా లడ్డూ (5వేల కిలోలు) ప్రసాదం కోసం భక్తులు పోటెత్తారు. నగర నలు మూలల నుంచే కాకుండా నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కొంతమంది బుధవారం అర్థరాత్రి నుంచే పడిగాపులు కాశారు. గురువారం ఉదయం పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లలో ఖైరతాబాద్ రైల్వేగేటు వైపు పురుషులు, మింట్ కాంపౌండ్ వైపు మహిళలు బారులు తీరారు. అంతకుముందు సైఫాబాద్ ఏసీపీ ఇస్మాయిల్, ఇన్స్పెక్టర్ పి.అశోక్, ఉత్సవ కమిటీఅధ్యక్షుడు సింగరి సుదర్శన్, లడ్డూ దాత మల్లిబాబు, శిల్పి రాజేంద్రన్‌తో పాటు కమిటీ సభ్యులు, నాయకులు పూజలు చేసి, ప్రసాద పంపిణీని ప్రారంభించారు. 5వేల కిలోలలో దాత మల్లిబాబుకు రెండు టన్ను లడ్డూను ఇచ్చారు. క్రేన్‌తో వాహనంలోకి లడ్డూను చేర్చారు. ప్రత్యేక వాహనంలో మల్లిబాబు తన స్వగ్రామం తాపేశ్వరానికి ప్రసాదాన్ని తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది మహాగణపతికి ప్రసాదం సమర్పించినా, దక్కించుకోలేకపోయామని, ఈ సంవత్సరం తిరిగి తనకు దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రసాదాన్ని తమ చుట్టు పక్కల గ్రామాల వారికి ఉచితంగా అందజేస్తానని మల్లిబాబు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ప్రసాదం పంపిణీ కార్యక్రమం రెండు గంటలకు ముగిసింది. రసాబాసగా మారిన పంపిణీ మహాప్రసాదం కోసం భారీగా జనం తరలి రావడంతో అదుపు చేయడం నిర్వాహకులు, పోలీసులకు కష్టంగా మారింది. ఖైరతాబాద్ రైల్వేగేటు వైపు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ భక్తులు ముందుకు రావడంతో కొద్ది సేపు తోపులాట జరిగింది. పోలీసులు మళ్లీ బారికేడ్లు సరిచేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రైల్వే గేటు నుంచి శ్రీనివాస్‌నగర్ వరకు భక్తులు దాదాపు కిలోమీటర్ మేర క్యూలైన్లో వేచి ఉన్నారు. భక్తుల నిరాశ ప్రసాదం కోసం గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉన్నప్పటికీ లభించకపోవడంతో భక్తులు నిరాశకు గురయ్యారు. మహిళలు చంటి పిల్లలను ఎత్తుకొని బారులు తీరారు. తీరా రెండు గంటలకే ప్రసాదం అయిపోయిందని చెప్పడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. అప్పటికీ భారీగా తరలివచ్చిన విద్యార్థులు ‘ఉయ్ వాంట్ లడ్డూ...’ అని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దీంతో వారిని పోలీసులు చెదరగొట్టారు. -
నేడు మహాగణపతి ప్రసాదం పంపిణీ
ఖైరతాబాద్: శ్రీ కైలాస విశ్వరూప మహా గణపతి చేతిలో 11 రోజుల పాటు నిత్యపూజలందుకున్న 5 టన్నుల మహాప్రసాదం (లడ్డు) గురువారం పంపిణీ చేయనున్నారు.లడ్దూ దాత మల్లిబాబుకు రెండు టన్నుల ప్రసాదాన్ని ఇవ్వగా, మిగిలిన ప్రసాదాన్ని గురువారం ఉదయం 11.45 గంటల నుంచి భక్తులకు పంపిణీ చేయనున్నట్లు ఉత్సవ కమిటీసభ్యులు తెలిపారు. ఈ ప్రసాద పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మూడు ప్లటూన్ల పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు సైఫాబాద్ ఇన్స్పెక్టర్ పి.అశోక్ తెలిపారు. ప్రతి ఒక్కరూ వరుసలో వచ్చి ప్రసాదం తీసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. -
ఖైరతాబాద్ మహాగణపతికి 5 వేల కిలోల లడ్డూ
ఖైరతాబాద్: ఖైరతాబాద్ మహాగణపతికి సురుచి ఫుడ్స్ నిర్వాహకుడు మల్లిబాబు ఈ ఏడాది 5 వేల కిలోల లడ్డూను ప్రసాదంగా అంజేయనున్నారు. ఏటా ఈయన లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తున్న విషయం తెలిసిందే. గతేడాది మహాగణపతికి సమర్పించిన 4200 కిలోల లడ్డూ వర్షంలో తడిసి పోవడంతో హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు. దీంతో ఈ సంవత్సరం మహాప్రసాదాన్ని భక్తులకు అందేలా చర్యలు తీసుకోవాలని, అందుకోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయాలని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీని మల్లిబాబు కోరారు. కమిటీ అందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో మల్లిబాబు సోమవారం ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్, సందీప్‌లతో కలిసి సైఫాబాద్ ఇన్స్పెక్టర్ నారాయణను కలిశారు. ఈ సంవత్సరం 5 వేల కిలోల లడ్డూను ప్రసాదంగా ఇవ్వనున్నట్లు మల్లిబాబు తెలిపారు. ప్రసాదంలో 2500 కిలోల మేరకు ప్రసాదాన్ని 50, 100 గ్రాముల ప్యాకెట్లుగా చేసి భక్తులకు పంపిణీ చేస్తామన్నారు. మరో 1250 కిలోల ప్రసాదాన్ని కేజీ రూ. 200 చొప్పున విక్రయిస్తామని తెలిపారు. మిగిలిన 1250 కిలోలు తాను తీసుకువెళ్తానని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని సైఫాబాద్ ఇన్స్పెక్టర్ను ఆయన కోరారు. ఇందుకు సీఐ సుముఖత వ్యక్తం చేశారు. -
గంగ ఒడికి మహా గణపతి
బుధవారం ఉదయం ప్రారంభమైన గణేష్ నిమజ్జన ఘట్టం గురువారం సాయంత్రానికి పూర్తయింది. బుధవారం అర్ధరాత్రి దాటాక ప్రారంభమైన ఖైరతాబాద్ మహా గణనాథుని శోభాయాత్ర గురువారం మధ్యాహ్నానికి ట్యాంక్‌బండ్‌కి చేరుకుంది. 1.53 నిమిషాల ప్రాంతంలో గోనాగ చతుర్ముఖ గణపతి సాగర గర్భంలోకి చేరాడు. -
గంగ ఒడికి మహా గణపతి
బుధవారం ఉదయం ప్రారంభమైన గణేష్ నిమజ్జన ఘట్టం గురువారం సాయంత్రానికి పూర్తయింది. బుధవారం అర్ధరాత్రి దాటాక ప్రారంభమైన ఖైరతాబాద్ మహా గణనాథుని శోభాయాత్ర గురువారం మధ్యాహ్నానికి ట్యాంక్‌బండ్‌కి చేరుకుంది. 1.53 నిమిషాల ప్రాంతంలో గోనాగ చతుర్ముఖ గణపతి సాగర గర్భంలోకి చేరాడు. మరోపక్క హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో గురువారం భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ఖైరతాబాద్, న్యూస్‌లైన్: గోనాగ చతుర్ముఖ గణపయ్య గంగమ్మ ఒడికి చేరాడు. బుధవారం అర్ధరాత్రి 2.30 గంటలకు నిమజ్జనానికి బయల్దేరిన భారీకాయుడు దాదాపు పన్నెండు గంటల పాటు ప్రయాణించి గురువారం మధ్యాహ్నం 1.53 గంటలకు సాగర గర్భంలోకి ప్రవేశించాడు. మహా గణపతి నిమజ్జనాన్ని వీక్షించేందుకు అశేష భక్తజనులు తరలివచ్చారు. అర్ధరాత్రి 2.30: మంటపం నుంచి బయల్దేరిన మహా గణపతి తెల్లవారుజామున 4: సెన్సేషన్ థియేటర్ వద్దకు చేరిక 6.40: రాజ్‌దూత్ చౌరస్తాకు రాక 7.45: టెలిఫోన్ భవన్ వద్దకు చేరిన లంబోదరుడు 8.05: సచివాలయం పాతగేటు వద్దకు చేరుకోగా.. భారీగా తరలివ స్తున్న విగ్రహాల కారణంగా అరగంట పాటు అక్కడే నిలిపివేశారు 8.25: తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్దకు రాక 9.25: సచివాలయం వద్దకు చేరిన మహా గణపతి 11.00: 6వ నెంబర్ క్రేన్ వద్దకు చేరిక మధ్యాహ్నం 1.00: తుది పూజలు.. చివరిసారి దర్శనం కోసం భక్తులు దూసుకురావడంతో తోపులాట 1.53: సాగర గర్భంలోకి చేరిన గణపయ్య లడ్డూ బాగుంటే.. నేడు పంపిణీ ఖైరతాబాద్, న్యూస్‌లైన్: వర్షంలో తడిసిన ఖైరతాబాద్ వినాయకుడి లడ్డూ ఏమాత్రం బాగున్నా.. భక్తులకు పంపిణీ చేస్తామని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పేరొందిన ఖైరతాబాద్ లంబోదరుడి చేతిలో ఏర్పాటు చేసిన 4200 కిలోల లడ్డూ బుధవారం సాయంత్రం ఏకధాటిగా కురిసిన వర్షానికి తడిసింది. దాదాపు మూడు గంటల పాటు వర్షంలో తడవడంతో అది చక్కెర పానకంలా తయారైంది. లడ్డూను దించిన తర్వాత కవర్లతో కప్పి ఉంచడం వల్ల గాలి ఆడక కూడా అది చెడిపోయే అవకాశముందని సురుచి ఫుడ్స్ యజమాని మల్లిబాబు తెలిపారు. ఒకవేళ లోపలి భాగం పాడవకుండా ఉంటే శుక్రవారం పంపిణీ చేస్తామని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ చెప్పారు.