
ఖైరతాబాద్: మహా గణపతి దర్శనానికి భక్తజనం పోటెత్తారు. ఆదివారం నగరం నలు దిక్కుల నుంచి భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో ఖైరతాబాద్ రైల్వేగేట్, సెన్సేషన్ థియేటర్, మింట్ కాంపౌండ్, ఐమాక్స్ పరిసర ప్రాంతాలన్నీ జనసంద్రాన్ని తలపించాయి. అడుగు తీసి అడుగు వేయలేనంతగా రద్దీతో వీధులన్నీ నిండిపోయాయి. ఖైరతాబాద్ రైల్వేగేట్ నుంచి పట్టాలపై భక్తులు ఎటూ కదలేని పరిస్థితి నెలకొంది.
జనం ముందుకు, వెనక్కు కదలేని పరిస్థితిలో రైళ్ల రాకపోకలనే నిలపాల్సిన పరిస్థితి నెలకొంది. ఏర్పాట్లు సక్రమంగా చేయకపోవడంతో ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చిందని పలువురు ఆవేదన వ్యక్తంచేశారు. కొంతమంది చిన్నారులు తప్పిపోవడంతో తల్లిదండ్రుల నానా ఇబ్బందులకు గురయ్యారు. –