సాగర్ ప్రాజెక్టును నీవు తవ్వించావా?
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క
మధిర: ఖమ్మం జిల్లాలో భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి నీరందించే నాగా ర్జునసాగర్ ప్రాజెక్టును నీవు తవ్వించావా? నీ అయ్య తవ్వించాడా? అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. మధిర మండలం సిరిపురంలో మంగళవారం ఆయన విలేక రులతో మాట్లాడారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఇందిరా సాగర్ ప్రాజెక్టు మొదలుపెట్టి... 75 శాతం పనులు పూర్తి చేశారన్నారు. మిగిలిన పనులు పూర్తి చేయకుండా అక్కడి మోటార్లను తీసు కొచ్చి నీటిని కాలువలో పోస్తే మీరు చేసినట్లు అవుతుందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి నీటిని ఎక్కడి నుంచి తీసుకొస్తారని, ప్రాజెక్టుకు అవసరమయ్యే 5.5టీఎంసీల నీటిని అలాట్ మెంట్ చేయకుండా, సాగునీటిని రైతులకు ఏ విధంగా అందిస్తారని ప్రశ్నించారు.
నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా పాలేరుకు వచ్చే జలాలనే రెండు మోటార్ల తో భక్తరామదాసు ప్రాజెకు ్టకు పంపింగ్ ద్వారా మాత్రమే సాగునీటిని అందిస్తున్నారని తెలిపారు. ఈ పథకానికి వెళ్లే నీటిని కృష్ణానదిపై ఆనకట్ట కట్టి తీసుకొస్తున్నారా, కొత్తగా నాగార్జునసాగర్‌కు కాలువలు నిర్మించి తీసుకొస్తున్నారా లేక పాలేరు చెరువును నూతనంగా నిర్మించి తీసుకొస్తున్నారా అని సీఎంనుద్దేశించి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన దేవాదుల ప్రాజెక్టును పూర్తిచేస్తే పాలేరు నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో సాగునీటిని అందించ వచ్చన్నారు. రూ.90కోట్లతో పూర్తిచేయాల్సిన భక్తరామ దాసు ఎత్తిపోతల పథకానికి రూ.350కోట్లు వెచ్చించడం వెనుక ఎవరికి లబ్ధి చేకూరు తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.