హైదరాబాద్: మద్యం మత్తులో ఓ వ్యక్తి కిందపడి తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన కర్మన్‌ఘాట్ క్రాస్ రోడ్డులోని అమరావతి బార్ వద్ద గురువారం చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు బైరామాలగూడకు చెందిన వినోద్గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.