Vinodh
-
రాజకీయాలకు నో!
సినీరంగంలోనూ, వ్యక్తిగతంగానూ వివాదాలకు దూరంగా ఉండే నటుడు అజిత్. ఇక రాజకీయాల దరిదాపులకే వెళ్లని వ్యక్తి. ఇటీవల బీజేపీ నటుడు అజిత్‌ను రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేసి విఫలమైన విషయం పెద్ద దుమారాన్నే రేపింది.కాగా సినిమాల్లోనూ రాజకీయాలకు ఇష్టపడని నటుడు అజిత్. తన తాజా చిత్ర కథ రాజకీయ నేపథ్యంతో కూడి ఉండడంతో ఆ కథను పక్కన పెట్టేశారన్న విషయం తెలిసింది. అజిత్ ప్రస్తుతం నేర్కొండ పార్వై చిత్రాన్ని పూర్తి చేశారు. ఇది హిందీ చిత్రం పింక్‌కు రీమేక్ అన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నిర్మాత, దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మిస్తున్న చిత్రం ఇది. నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న నేర్కొండ పార్వై చిత్రానికి హెచ్.వినోద్ దర్శకుడు. దీన్ని ఆగస్ట్ 10న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో అజిత్ తన 60వ చిత్రానికి రెడీ అవుతున్నారు. మరోసారి దర్శకుడు హెచ్.వినోద్‌కే అవకాశం ఇచ్చారు. దీంతో ఆయన అజిత్‌కు రెండు కథలను వినిపించారట. అందులో ఒకటి రాజకీయ నేపథ్యంతో కూడిన కథ కాగా, మరొకటి సామాజిక సమస్యతో కూడిన యాక్షన్ కథా చిత్రం అని తెలిసింది. కాగా అజిత్ రాజకీయ నేపథ్యంతో కూడిన కథను పక్కన పెట్టి సామాజిక సమస్యతో కూడిన యాక్షన్ కథా చిత్రానికి ఓకే చెప్పారట. సామాజిక సమస్యకు చక్కని పరిష్కారం చూసే కథ అజిత్‌కు బాగా నచ్చేసిందట. మరో విశేషం ఏమిటంటే ఇందులో అజిత్ పోలీస్ అధికారిగా నటించబోతున్నారట. ఈయన పోలీస్ అధికారిగా నటించి చాలా కాలమైంది. కాబట్టి వినోద్ దర్శకత్వంలో నటించనున్న తాజా చిత్రంతో అజిత్ అభిమానులకు ఖుషీనే. కాగా ఈ పాత్ర కోసం అజిత్ స్లిమ్‌గా తయారవడానికి వర్కౌట్ చేస్తున్నారట. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందించనున్నారు. నిర్మాత బోనీకపూర్‌నే ఈ క్రేజీ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
హర్షధ్వానాల మధ్య ఆరు తీర్మానాలు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ 17వ ప్లీనరీలో మొత్తం ఆరు తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఎంపీ కె.కేశవరావు ‘దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు కోసం ఉద్యమం’పేరుతో మొదటి తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని ఎంపీ వినోద్‌తోపాటు టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బండి రమేశ్ బలపరిచారు. సంక్షేమంపై ఎమ్మెల్యే రసమయి రెండో తీర్మానాన్ని ప్రతిపాదించగా.. టీఆర్ఎస్ నేత గట్టు రామచందర్‌రావు బలపరిచారు. ఈ సందర్భం గా రసమయి మాట్లాడుతూ.. ‘‘గత ప్రభుత్వాల మేనిఫెస్టోలు చూశాం. ఆ మేనిఫెస్టోల్లో పెట్టిన అంశాలు కేవలం కాగితాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. కానీ టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేసి చూపిస్తున్నాం. రూ.40 వేల కోట్లతో 40 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వమిది. ఎవరికీ ఆలోచన రాని విధంగా.. మానవీయ కోణంలో ఆలోచించి అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు’’అని పేర్కొన్నారు. ఆ ఘనత కేసీఆర్‌దే.. వ్యవసాయ విధానంపై ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మూడో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ బలపరిచారు. రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యవ సాయాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారన్నారు. ఈ ఏడాది నుంచి ఎకరాకు రూ.8 వేలు పంట పెట్టుబడి ఇస్తున్నట్లు తెలిపారు. రైతులకు పం ట రుణాలను మాఫీ చేసిన ఘనత కేసీఆర్‌దేన్నారు. ప్రభు త్వం రైతులకు 24 గంటల కరెం ట్ ఇస్తోందని, పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసిందని కొనియాడారు. మైనార్టీల సంక్షేమంపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ నాలుగో తీర్మానం ప్రతిపాదించగా.. ఇంతియాజ్ అహ్మ ద్ బలపరిచారు. షకీల్ మాట్లాడుతూ.. గత ప్ర భుత్వాలు ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడు కున్నాయని, కానీ సీఎం కేసీఆర్ వారికోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని తెలిపారు. ఆడబిడ్డల గోస తీర్చేందుకు భగీరథ మౌలిక సదుపాయాల కల్పనపై పద్మాదేవేందర్‌రెడ్డి ఐదో తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని ఎమ్మెల్యే వివేకానందగౌడ్ బలపరిచారు. పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఆడబిడ్డల గోస తీర్చేందుకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందించబోతున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ఆడబిడ్డలు ఎప్పుడూ రుణపడి ఉంటారన్నారు. టీఎస్ఐపాస్తో పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. టీ హబ్ ఇంక్యుబేటర్ వల్ల స్టార్టప్ కంపెనీలు ఏర్పాటవుతున్నాయని, ద్వితీయ శ్రేణి నగరాలకూ ఐటీ కంపెనీలను విస్తరిస్తామన్నారు. చివరగా పాలనా సంస్కరణలపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి బలపరిచారు. -
యంగ్ డైరెక్టర్‌తో అజిత్ కొత్త సినిమా
కోలీవుడ్ టాప్ హీరో అజిత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వాసం సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు సాధించిన అజిత్, శివలు విశ్వాసంతో మరో హిట్ మీద కన్నేశారు. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండా అజిత్ తదుపరి చిత్రంపై చర్చ మొదలైంది. కోలీవుడ్ సమాచారం ప్రకారం అజిత్ తన తదుపరి చిత్రాన్ని ఓ యువ దర్శకుడితో చేయనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. శతురంగ వెట్టై, శతురంగ వెట్టై 2, ధీరన్ అధిగరం ఒండ్రు సినిమాలతో సత్తా చాటిన యువ దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వంలో నటించేందుకు అజిత్ అంగీకరించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. వినోద్ తన తొలి సినిమా రిలీజ్ తరువాత అజిత్ తో సినిమా చేసేందుకు ప్రయత్నించినా వర్క్ అవుట్ కాలేదు. ఇప్పుడు మరోసారి అజిత్ తో సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అంతేకాదు విజయ్ 63వ సినిమాకు కూడా వినోద్ దర్శకత్వం వహించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. -
జోడీ కుదిరిందా?
అనతి కాలంలోనే తెలుగులో అగ్ర కథానాయికగా ఎదిగిన రకుల్‌ప్రీత్ సింగ్ తమిళంలోనూ మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఇప్పటివరకూ ఆమె రెండు తమిళ సినిమాలు చేసినా, పెద్ద గుర్తింపు రాలేదు. మహేశ్‌బాబు–మురుగదాస్ సినిమాతో తమిళంలో గ్రాండ్ రీ–ఎంట్రీ ఖాయమని భావిస్తున్నారు. తాజాగా తమిళ నటుడు కార్తీ హీరోగా వినోద్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో హీరోయిన్గా నటించడానికి అంగీకరించారట! కార్తీ సినిమా తెలుగులో అనువాదం కావడం సహజం. అంటే.. రకుల్ తెలుగు, తమిళ ప్రేక్షకులను ఒకేసారి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారన్న మాట! -
మద్యం మత్తులో కిందపడి వ్యక్తి మృతి
హైదరాబాద్: మద్యం మత్తులో ఓ వ్యక్తి కిందపడి తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన కర్మన్‌ఘాట్ క్రాస్ రోడ్డులోని అమరావతి బార్ వద్ద గురువారం చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు బైరామాలగూడకు చెందిన వినోద్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్టేషన్లో ఆగలేదని.. ఎక్స్ ప్రెస్ రైల్లోంచి దూకేశాడు!
తాను దిగాల్సిన స్టేషన్లో ఆగకపోవడంతో ఎక్స్ ప్రెస్ రైళ్లోంచి దూకేసిన యువకుడు చనిపోయాడు. ఈ ఘటన పుదుచ్చేరిలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... వినోద్(20) అనే విద్యార్థి కోంబాక్కం నుంచి సమీపంలోని గ్రామానికి వెళ్లాలనుకున్నాడు. మంగళూరు-పుదుచ్చేరి ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కాడు. అతడు దిగాల్సిన స్టేషన్ విల్లనూర్ కాగా, ఆ స్టేషన్లో రైలు ఆగదట. అయితే, తాను దిగాల్సిన స్టేషన్ వచ్చింది. రైలు ఆగుతుందని చూశాడు. కానీ రైలు ఆగకుండా వెళ్తుండటంతో ఏం చేయాలో అర్థంకాక వినోద్ కంగారులో రైల్లోంచి ప్లాట్ ఫాం పైకి దూకేశాడు. దురదృష్టవశాత్తూ ఆ యువకుడు రైలు చక్రాల కింద పడి నలిగిపోయాడు. దీంతో కొన్ని సెకన్లలో సంఘటన స్థలంలోనే యువకుడు మృతిచెందాడు. వినోద్ శరీరం నుజ్జునుజ్జు అయిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.