జోడీ కుదిరిందా?
అనతి కాలంలోనే తెలుగులో అగ్ర కథానాయికగా ఎదిగిన రకుల్‌ప్రీత్ సింగ్ తమిళంలోనూ మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఇప్పటివరకూ ఆమె రెండు తమిళ సినిమాలు చేసినా, పెద్ద గుర్తింపు రాలేదు. మహేశ్‌బాబు–మురుగదాస్ సినిమాతో తమిళంలో గ్రాండ్ రీ–ఎంట్రీ ఖాయమని భావిస్తున్నారు. తాజాగా తమిళ నటుడు కార్తీ హీరోగా వినోద్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో హీరోయిన్‌గా నటించడానికి అంగీకరించారట! కార్తీ సినిమా తెలుగులో అనువాదం కావడం సహజం. అంటే.. రకుల్ తెలుగు, తమిళ ప్రేక్షకులను ఒకేసారి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారన్న మాట!