Bairamalguda
-
బైరామల్ గూడ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్, మంత్రులు, మేయర్ (ఫొటోలు)
-
‘బైరామల్ గూడ’ ఫ్లై ఓవర్‌తో.. రయ్ రయ్!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో మరో ఫ్లై ఓవర్ త్వరలో అందుబాటులోకి రానుంది. బైరామల్‌గూడ సెకండ్ లెవెల్ ఫ్లై ఓవర్ ఈ నెల 8వ తేదీన ప్రారంభమయ్యే అవకాశముంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్నారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే నాగార్జునసాగర్ రింగ్‌రోడ్, బైరామల్‌గూడ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ చిక్కులు తగ్గుతాయి. త్వరలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని, అది వెలువడేలోగా దాదాపు వారం రోజుల్లో ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత సమాచారం మేరకు ఈ నెల 8న ప్రారంభించాలని తాత్కాలికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ఫ్లైఓవర్ వినియోగంలోకి వచ్చాక శంషాబాద్ విమానాశ్రయం, ఓవైసీ హాస్పిటల్ వైపుల నుంచి విజయవాడ(చింతలకుంట వైపు), నాగార్జునసాగర్ (బీఎన్ రెడ్డి నగర్ వైపు)ల వైపు ఈ ఫ్లై ఓవర్ మీదుగా ట్రాఫిక్ జంజాటం లేకుండా వెళ్లవచ్చు. ఈ ఫ్లై ఓవర్లతోపాటు రెండు లూప్‌లు కూడా అందుబాటులోకి వస్తే ఎడమవైపు లూప్ నుంచి నాగార్జునసాగర్, చింతలకుంట వైపుల నుంచి ఎల్బీనగర్, సికింద్రాబాద్‌ల వైపు వెళ్లే వారికి సదుపాయం కలుగుతుంది. అలాగే కుడివైపు లూప్ అందుబాటులోకి వస్తే ఎల్బీనగర్ నుంచి కర్మాన్‌ఘాట్, ఐఎస్ సదన్ల వైపు వెళ్లే వారికి సౌలభ్యంగా ఉంటుంది. తద్వారా ప్రయాణ సమయం కలిసి రావడంతోపాటు వాహనదారులకు ఇంధన వ్యయం తగ్గుతుంది. వాయు, ధ్వని కాలుష్యాలు తగ్గుతాయి. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంలో క్రాష్ బారియర్స్, ఫ్రిక్షన్ శ్లాబ్స్, శ్లాబ్ ప్యానెల్స్ వంటి వాటికి ఆర్సీసీ ప్రీకాస్ట్ టెక్నాలజీ వినియోగించారు. ఎస్సార్డీపీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఫ్లైఓవర్ల నిర్మాణంతోనే నగరంలో తొలిసారిగా ఈ టెక్నాలజీని వినియోగించడం తెలిసిందే. బైరామల్‌గూడ సెకండ్ లెవెల్ ఫ్లై ఓవర్ ఇలా.. నిర్మాణ వ్యయం: రూ.148.05 కోట్లు, పొడవు: 1.78 కి.మీ, వెడల్పు ఓవైసీ వైపు (ర్యాంప్1): 12 మీటర్లు, 3లేన్. నాగార్జునసాగర్ వైపు(ర్యాంప్2): 8.5మీటర్లు, 2 లేన్. చింతల్‌కుంట వైపు(ర్యాంప్3): 8.5 మీటర్లు, 2 లేన్. ప్రయాణ మార్గం.. ఒకవైపు సిద్ధమైన బైరామల్‌గూడ ఫ్లైఓవర్ బైరామల్‌గూడ జంక్షన్ వద్ద మొదటి, రెండవ లెవెల్ ఫ్లై ఓవర్లు, లూప్స్ వినియోగంలోకి వస్తే బైరామల్‌గూడ జంక్షన్‌వద్ద 95 శాతం, నాగార్జునసాగర్ రింగ్‌రోడ్ వద్ద 43 శాతం ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారం లభించనుందని ఇంజినీర్లు పేర్కొన్నారు. -
హైదరాబాద్: మార్చి నాటికి మరో నాలుగు ప్రాజెక్టులు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో మరో నాలుగు ప్రాజెక్టులు వచ్చే మార్చిలో ప్రారంభం కానున్నాయి. బహదూర్‌పురా ఫ్లై ఓవర్, ఎల్బీనగర్ కుడివైపు అండర్‌పాస్, తుకారాంగేట్ ఆర్‌యూబీలు ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే ప్రకటించిన జీహెచ్ఎంసీ.. తాజాగా బైరామల్‌గూడ ఎడమవైపు ఫ్లై ఓవర్ సైతం మార్చిలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. దీంతో ఎస్సార్డీపీలో భాగంగా నాలుగు అభివృద్ధి ఫలాలతో ప్రజలకు ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గనున్నాయి. బైరామల్‌గూడ కుడివైపు ఫ్లై ఓవర్ 2020 ఆగస్టులో అందుబాటులోకి వచ్చింది. ఎడమవైపు ఫ్లై ఓవర్ వచ్చేనెల రెండో వారంలో అందుబాటులోకి రానున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. వీలును బట్టి మిగతా మూడు ప్రాజెక్టులు కూడా వచ్చే నెలలోనే ప్రారంభించనున్నట్లు తెలిపింది. పనులు తుదిదశలో ఉన్నాయని తెలిపిన అధికారులు వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టారు. చదవండి: వెలుగులోకి ‘వెబ్ సిరీస్ సూరి’ మరో వ్యవహారం బైరామల్‌గూడ కుడివైపు ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే ఒవైసీ జంక్షన్ వైపు నుంచి ఉప్పల్ జంక్షన్ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు, సిగ్నల్ చిక్కులు ఉండవు. ప్రయాణవేగం పెరుగుతుంది. ప్రయాణ సమయం, వాహనాల ఇంధన,నిర్వహణ వ్యయం కూడా తగ్గుతాయని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఎస్సార్డీపీలో భాగంగా ప్రభుత్వం రూ. 25వేల కోట్లకు పైగా ఖర్చయ్యే ఫ్లై ఓవర్లు, మేజర్ కారిడార్లు, స్కైవేలు, అండర్‌పాస్‌లు, మేజర్ కారిడార్లు, ఆర్ఓబీలు,ఆర్‌యూబీలు, తదితరమైన వాటి నిర్మాణం చేపట్టడం తెలిసిందే. వాటిల్లో పూర్తయిన పనులతో ఆయా మార్గాల్లో సాఫీ ప్రయాణంతో ట్రాఫిక్ చిక్కులు తగ్గాయని జీహెచ్ఎంసీ పేర్కొంది. బైరామల్ గూడ ఫ్లై ఓవర్.. అంచనా వ్యయం : రూ. 28.64 కోట్లు ఫ్లై ఓవర్ పొడవు : 780 మీటర్లు వెడల్పు :12.50 మీటర్లు లేన్లు : 3 ప్రయాణం : ఒక వైపు -
హవ్వా! మస్కా కొట్టకు మంత్రీజీ
పట్నా: ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిహార్ మంత్రి సురేష్ కుమార్ శర్మ నవ్వులపాలయ్యారు. అర్బన్ డెవలప్మెంట్, హౌజింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన ముజఫర్‌పూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముజఫర్‌పూర్ అభివృద్ధికి కృషి చేస్తున్నాని చెబుతూ సురేష్ చేసిన ట్వీట్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ముజఫరాపూర్ లైట్ యోజనా’ అంటూ ఓ ఫొటో షేర్ చేసిన ఆయన.. భారీ వ్యయంతో నిర్మించిన రోడ్లపై 17,554 వీధి దీపాలను ఏర్పాటు చేశామని గొప్పగా చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీతో పాటు ఉన్న పోస్టర్ తయారు చేయించి ట్విటర్లో పోస్టు చేశారు. అయితే, మంత్రి షేర్ చేసిన రోడ్డు, స్ట్రీట్ లైట్ల ఫొటో ఫేక్ అని తేలింది. రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా విషయం బయటపడటంతో నెటిజన్లు మంత్రిని ఏకి పారేస్తున్నారు. ఆయన షేర్ చేసింది హైదరాబాద్‌లోని బైరామల్‌గూడ ఫ్లైఓవర్ అని పేర్కొంటూ.. మంత్రి కేటీఆర్ ట్వీట్‌ను సురేష్‌కు ట్యాగ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఫ్లైఓవర్ ఫొటోలతో మస్కా కొట్టిస్తావా అంటూ తిట్టిపోస్తున్నారు. కాగా, బైరామల్‌గూడ జంక్షన్ వద్ద కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ ఆగస్టు 9న ప్రారంభించారు. 780 మీటర్ల వెడల్పైన ఈ ఫ్లైఓవర్ నిర్మాణ వ్యయం 26.5 కోట్లు. Happy to be throwing open yet another flyover in #Hyderabad tomorrow that has been completed as part of #SRDP (Strategic Road Development Plan) RHS flyover at Bairamalguda junction, 780 mt long coating 26.5Cr@bonthurammohan @CommissionrGHMC pic.twitter.com/nb0OLqRYvC — KTR (@KTRTRS) August 9, 2020 -
బైరామల్‌గూడ ఫ్లైఓవర్ ప్రారంభం
-
బైరామల్‌గూడ ఫ్లైఓవర్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బైరామల్‌గూడ ఫ్లైఓవర్‌ను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. జీహెచ్ఎంసీ ఎస్సార్డీపీలో భాగంగా చేపట్టిన పనుల్లో ఈ ఫ్లైఓవర్ ఒకటి. ఎల్బీనగర్ పరిధిలోని బైరామల్‌గూడ జంక్షన్ వద్ద రూ. 26.45 కోట్లతో పూర్తి చేశారు. ఎస్సార్డీపీ ప్యాకేజీ-2లో మొత్తం 14 పనులుండగా, ఇప్పటికే ఐదు వినియోగంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో బైరామల్‌గూడ జంక్షన్, సాగర్‌రోడ్ జంక్షన్ల పరిధిలో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గనుంది. బైరామల్‌గూడ జంక్షన్లో రద్దీ వేళల్లో గంటకు 12 వేల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి ఒవైసీ జంక్షన్‌కు, శ్రీశైలం వైపు వెళ్లే వాహనదారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఫ్లైఓవర్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం : భారీ నష్టం
-
బిస్కెట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
-
మద్యం మత్తులో కిందపడి వ్యక్తి మృతి
హైదరాబాద్: మద్యం మత్తులో ఓ వ్యక్తి కిందపడి తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన కర్మన్‌ఘాట్ క్రాస్ రోడ్డులోని అమరావతి బార్ వద్ద గురువారం చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు బైరామాలగూడకు చెందిన వినోద్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బైరామల్‌గూడలో చైన్‌స్నాచింగ్
ఎల్బీ నగర్ (హైదరాబాద్) : మరోసారి చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. గురువారం సాయంత్రం బైరామల్‌గూడలో రోడ్డు పక్కన నడిచుకుంటూ వెళ్తున్న యాదమ్మ అనే మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసును వెనుక నుంచి బైక్‌పై వచ్చిన దుండగులు లాక్కెళ్లారు. బాధితురాలు తేరుకునేసరికి మాయమయ్యారు. దీనిపై యాదమ్మ ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.