ఉప్పల్‌లో వ్యక్తి హత్య
Published Thu, Dec 15 2016 10:42 AM | Last Updated on Mon, Jul 30 2018 9:16 PM
ఉప్పల్: ఉప్పల్ పరిధిలోని విజయపురి కాలనీలో బుధవారం అర్ధరాత్రి దాటాక ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. కాలనీలో ఉండే రవి అనే వ్యక్తికి ఇంటి పక్కనే ఉండే మరో వ్యక్తితో రాత్రి పెద్ద గొడవ జరిగింది. సదరు వ్యక్తి తీవ్రంగా కొట్టడంతో రవికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. హత్యకు అక్రమ సంబంధమే కారణమని రవి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement