నాశనం తప్ప వికాసం ఎక్కడ?
మోదీ ప్రభుత్వంపై కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ సబ్‌కా వికాస్ నినాదం మాటలకే పరిమితమైందని, వ్యవసాయం సర్వనాశనం అయిందేగానీ వికాసం లేదని కేంద్ర మాజీమంత్రి మణిశంకర్ అయ్యర్ ధ్వజ మెత్తారు. ఓవైపు వ్యవసాయోత్పత్తుల ధరలు తగ్గుతుంటే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తా మంటూ ప్రధాని మోదీ మాయమాటలతో మభ్యపెడుతున్నారన్నారు. ఇందిరాగాంధీ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ‘దేశ వ్యవసాయ రంగంలో ఇందిరాగాంధీ పాత్ర’ అంశంపై టీపీసీసీ సదస్సు నిర్వహించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్, పార్టీ నాయకులు జానారెడ్డి, షబ్బీర్ అలీ, పీసీసీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
మణిశంకర్ మాట్లాడుతూ.. రాజీవ్‌గాంధీ హయాంలో వ్యవ సాయ వృద్ధి 10.76కు పెరిగిందని, జీడీపీలో వ్యవసాయం నుంచి 70–80 శాతం వాటా ఉండేదన్నారు. ఇప్పుడు జీడీపీలో వ్యవసా యం, అనుబంధ రంగాలు కలిపి కూడా 17 శాతం మించడంలేదన్నారు. 1987–88లో తీవ్రౖ మెన కరువుతో ప్రపంచ దేశాలు అల్లాడిపోయిన సందర్భంలో దేశాన్ని కరువు నుంచి కాపాడ టానికి రాజీవ్ ఊరూరూ తిరిగారని గుర్తు చేశారు. రాజస్తాన్‌లోని కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి చర్యలను తీసుకున్నారని వివరించారు. దోమల్లేకుండానే చికున్‌గున్యా వచ్చిందని ప్రచారం చేసినట్టుగా, సమస్య లేకుండా సర్జికల్ స్రైక్ అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని అయ్యర్ ఎద్దేవా చేశారు. దేశంలో జమ్మూ–కశ్మీర్ సమస్యగా ఉండేదని, ఇప్పుడు జమ్మూ, కశ్మీర్ కూడా పరస్పరం సమస్యగా పరిణమించాయన్నారు. భూ సంస్కరణలు, హరితవిప్లవంతో వ్యవసాయ వృద్ధిరేటును పెంచిన ఇందిర స్ఫూర్తిని ఇంటింటికీ ప్రచారం చేయాలని సూచించారు.
రక్తంతో పనిలేకుండా హరిత విప్లవం
భూస్వాముల తలలతో దండలు కట్టిన నక్సల్బ రీ విప్లవానికి ప్రత్యామ్నాయంగా రక్తం చుక్కతో పనిలేకుండా హరిత విప్లవాన్ని ఇందిరాగాంధీ తెచ్చారని కేంద్ర మాజీమంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ అన్నారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో హరితవిప్లవంలో పాల్గొన్నానని, సరైన ఫలితా లు సాధించామని చెప్పారు. సదస్సులో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వి.హను మంతరావు, కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు, టీపీసీసీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.