రాయదుర్గంలోని ఓ ఫర్నిచర్ షాపులో శుక్రవారం వేకువజామున అగ్ని ప్రమాదం సంభవించింది.
రాయదుర్గంలోని ఓ ఫర్నిచర్ షాపులో శుక్రవారం వేకువజామున అగ్ని ప్రమాదం సంభవించింది. సెవెన్ సీజన్స్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో సెక్యూరిటీ సిబ్బంది ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. అరగంట తర్వాత అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పండగల సీజన్ సందర్భంగా దుకాణంలో రూ.4 కోట్లకు పైగా సామగ్రిని అందుబాటులో ఉంచామని, అది పూర్తిగా తగులబడిపోయిందని యజమాని అఖ్తర్ తెలిపారు. అయితే, తమకు 3.15 గంటలకు సమాచారం అందగా 3.30 గంటలకు సంఘటన స్థలానికి చేరుకుని గంటలో అదుపులోకి తెచ్చామని ఫైర్ అధికారి వెంకటేశ్ తెలిపారు. దుకాణంలో ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు లేకపోవటంపై కేసు నమోదు చేయనున్నట్లు వివరించారు.