‘మెట్రో’ను తీర్చిదిద్దాలి
పనుల్లో అంతర్జాతీయ
{పమాణాలు పాటించాలి
మున్సిపల్ పరిపాలన
ముఖ్య కార్యదర్శి గోపాల్
సిటీబ్యూరో: నాగోల్, ఉప్పల్ మెట్రో స్టేషన్లు, రహదారి జంక్షన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్ హెచ్‌ఎంఆర్, ఎల్‌అండ్‌టీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాగోల్-మెట్టుగూడ రూట్లో మెట్రో రైళ్ల పనితీరు, జంక్షన్ల అభివృద్ధి, స్టేషన్లలో భద్రతా ఏర్పాట్లు ,పనులు జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు.
నాగో ల్, ఉప్పల్ జంక్షన్ల వద్ద పాదచారులు నడిచేందుకు ప్రత్యేక మార్గాలు, బస్‌బే, ఆటోబేలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సూచించారు. నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు ప్రతి మెట్రో స్టేషన్ వద్ద ఇలాంటి ఏర్పాట్లు చేసేందుకు హెచ్‌ఎంఆర్, ఆర్‌అండ్‌బీ, జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మెట్రో స్టేషన్లలో చేపట్టనున్న భద్రతా ఏర్పాట్లపై సమగ్ర నివేదికను రూపొందించి త్వరలో జరగనున్న టాస్క్‌ఫోర్స్ కమిటీకి నివేదించాలని ఆదేశించారు. ఆయన వెంట హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, ఇతర పోలీసు, ట్రాఫిక్ విభాగాల ఉన్నతాధికారులు, ఎల్‌అండ్‌టీ అధికారులు పాల్గొన్నారు.