ఆచరణయోగ్యంగా లేని జీఎస్‌టీ
- మంత్రి ఈటల రాజేందర్
- ప్రజలకు ఇబ్బంది లేకుండా పొరపాట్లు సరిదిద్దాలి
- కేంద్రానికి రాష్ట్రం తరఫున అయిదు డిమాండ్లు
- జీఎస్‌టీ కౌన్సిల్ భేటీలో నివేదిస్తామన్న మంత్రి
సాక్షి, హైదరాబాద్: జీఎస్‌టీ పన్నుల విధానం ఆచరణ యోగ్యంగా లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కొన్ని వస్తువులు, కొన్ని రంగాలపై అశాస్త్రీయంగా పన్నుల భారం పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జూలై ఒకటి నుంచి దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని అమలు చేయాలనే ఆదరాబాదరాగా కేంద్రం విధించిన స్లాబ్ రేట్లు కొన్ని రంగాలను తీవ్రంగా ప్రభావితం చేశాయన్నారు. స్లాబ్‌లు వెల్లడవ టంతో దేశవ్యాప్తంగా అశాంతి చెలరేగు తోందని, హోటళ్లు, కళ్లద్దాలు, ఫ్యాన్ల తయారీ కంపె నీలు, గ్రానైట్ వ్యాపారులు ఆందోళన చేపట్టారన్నారు.
ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా పొరపాట్లు సరిదిద్దాలని ఈటల, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి విజ్ఞప్తి చేశారు. పన్ను చెల్లించే వారి సంఖ్యను విస్తరిం చేలా, సామాన్యులపై ధరల భారం పడ కుండా జీఎస్‌టీ ఉండాలనేది తెలంగాణ ప్రభుత్వ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. సామా న్యులపై భారం పడకుండా కొన్ని మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5 డిమాం డ్లను కేంద్రానికి నివేదిస్తామన్నారు. పన్ను ఎగవేతకు ఆస్కారం లేని ఆచరణయోగ్యమైన పన్ను విధానం ఉండాలని మరోమారు స్పష్టం చేస్తామన్నారు. జీఎస్‌టీ భారమవు తుందని ఆందోళన చేస్తున్న వ్యాపార వర్గాలు, సంస్థల బాధను ఆలకించాలని సూచించారు. పకడ్బందీ విధానం అనుసరించేంత వరకు అవసరమైతే జీఎస్‌టీ అమలు తేదీని మరో నెల పాటు వాయిదా వేయాలన్నారు. సామా న్యులు ఉపయోగించే వస్తువులపై పన్నులను సమీక్షించాలని, ముడి సరుకులు, పరికరాలకు విడివిడిగా పన్నులు కాకుండా తయారైన వస్తువుపై ఒకే పన్ను ఉండేలా చూడాలన్నారు. జూన్3న జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాలను ప్రస్తావిస్తామన్నారు.
రామానందతీర్థ ఇన్‌స్టిట్యూట్‌కు 10 కోట్లు
నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణను అందించే స్వామి రామా నంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్‌కు రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ఈటల ప్రకటించారు. భూదాన్ పోచంపల్లిలోని ఈ సంస్థ సేవలను సమైక్య రాష్ట్రంలో పాలకులు పట్టించుకోలేదని, కనీసం ఉద్యోగులకు జీతా లివ్వలేదని ఆరోపించారు. ప్రస్తుతం ఏటా 1,400 మంది యువతకు హాస్టల్ వసతితో పాటు వివిధ నైపుణ్య కోర్సులు అందిస్తున్న ఈ సంస్థను 5,000 మందికి శిక్షణ ఇచ్చే స్థాయికి మారుస్తామన్నారు.