Slab rates
-
కనిష్ట శ్లాబు వారికి ఐటీ ఊరట కల్పించాలి
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న నేపథ్యంలో తక్కువ స్థాయి శ్లాబ్‌లో ఉన్న ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఊరట కలి్పంచే అంశాన్ని బడ్జెట్లో పరిశీలించాలని పరిశ్రమల సమాఖ్య సీఐఐకి కొత్త ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సంజీవ్ పురి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. భూ, కారి్మక, విద్యుత్, వ్యవసాయ రంగ సంస్కరణలన్నింటిని అమలు చేసేందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధన కోసం సంస్థాగత వేదికను ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ మూడో దఫా ప్రభుత్వం సంస్కరణలను అమలు చేయడానికి సంకీర్ణ రాజకీయాలనేవి అడ్డంకులు కాబోవని భావిస్తున్నట్లు పురి చెప్పారు. ఇప్పటికే రెండు విడతల్లో విధానాలను విజయవంతంగా అమలు చేయడం, దేశ ఎకానమీ మెరుగ్గా రాణిస్తుండటం వంటి అంశాలు తదుపరి సంస్కరణలను వేగవంతం చేసేందుకు దన్నుగా ఉండగలవని ఆయన పేర్కొన్నారు. -
పన్ను మినహాయింపు పరిమితి పెంచాలి
న్యూఢిల్లీ: ప్రత్యామ్నాయ పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కేంద్రం పన్ను మినహాయింపు పరిమితిని, గరిష్ట పన్ను శ్లాబులోకి వచ్చే ఆదాయ పరిమితిని పెంచాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. అలాగే కొన్ని మినహాయింపులను కూడా 2023–24 బడ్జెట్లో అనుమతించాలని వారు సూచించారు. 2020–21 బడ్జెట్లో కేంద్రం .. సాంప్రదాయ ట్యాక్స్ శ్లాబ్‌లకు ప్రత్యామ్నాయంగా ఐచ్ఛిక ఆదాయ పన్ను విధానాన్ని కూడా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విధానంలో హెచ్ఆర్ఏ, గృహ రుణంపై వడ్డీలు, ఇతరత్రా కొన్ని పెట్టుబడులకు మినహాయింపులను క్లెయిమ్ చేసుకోకుండా ఉంటే పన్ను భారం తక్కువగా ఉండేలా ప్రతిపాదనలు చేసింది. దీని ప్రకారం రూ. 2.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదు. రూ. 15 లక్షలు దాటితే గరిష్టంగా 30 శాతం పన్ను ఉంటుంది. అయితే దీనివల్ల పన్ను భారం అధికంగా ఉంటోందని ఎవరూ ఈ ప్రత్యామ్నాయ విధానంపై ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలోనే దీన్ని ఆకర్షణీయంగా మార్చేందుకు కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని నిపుణులు చెబుతున్నారు. వారి సూచనలు ఏమిటంటే .. ► నాంగియా అండర్సన్ ఇండియా చైర్మన్ రాకేశ్ నాంగియా: పెట్టుబడులు, సామాజిక భద్రత సంబంధ డిడక్షన్లను ప్రత్యామ్నాయ పన్ను విధానంలోనూ అందుబాటులో ఉంచాలి. అలాగే పన్ను రేట్లను మరింతగా క్రమబద్ధీకరించాలి. ► డెలాయిట్ ఇండియా పార్ట్నర్ సుధాకర్ సేతురామన్: జీవిత బీమా ప్రీమియంలు, గృహ రుణ రీపేమెంట్, గృహ రుణాలపై వడ్డీ చెల్లింపుల్లాంటి మినహాయింపులను అనుమతించాలి. సింగపూర్, హాంకాంగ్ తదితర దేశాల తరహాలో గరిష్ట ట్యాక్స్ రేటును 30 శాతంగా కాకుండా 25 శాతానికి తగ్గించాలి. ► ఈవై ట్యాక్స్ పార్ట్నర్ అమర్‌పాల్ ఎస్ చడ్ఢా: రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్, రూ. 2.5 లక్షల వరకు ఇతరత్రా మినహాయింపులను అనుమతించాలి. ప్రాథమిక ఎగ్జెంప్షన్ పరిమితిని ప్రస్తుతమున్న రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలి. 30 శాతం ట్యాక్స్ రేటును రూ. 15 లక్షలు కాకుండా రూ. 20 లక్షలపైన ఆదాయానికి వర్తింపచేయాలి. ► ఏకేఎం గ్లోబల్ పార్ట్నర్ సందీప్ సెహ్గల్: 30 శాతం ట్యాక్స్ రేటును రూ. 20 లక్షల పైగా ఆదాయానికే వర్తింపచేయాలి. రూ. 5 లక్షల లోపు ఆదాయం గల వారికి రిబేటు ఇవ్వాలి. ఆలస్యంగా రిటర్ను వేసే వారికి కూడా ప్రత్యామ్నాయ పన్ను విధానం అందుబాటులో ఉంచాలి. -
పన్ను ఉపశమనం కల్పించాలి
న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపన్ను శ్లాబులలో మార్పులు చేయాలని, భారత కంపెనీలు విదేశాల్లో లిస్టింగ్ ప్రక్రియను సులభతరం చేయాలని, టీడీఎస్/టీసీఎస్ నిబంధనలను క్రమబద్ధీకరించాలని కేంద్ర ప్రభుత్వానికి కేపీఎంజీ సూచించింది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కంపెనీలు అందించిన కోవిడ్ టీకాలు, వైద్య సరఫరాలపై పన్నుల్లేకపోవడంపై స్పష్టత ఇవ్వాలని కోరింది. 2022–23 బడ్జెట్‌కు ముందు కీలక సూచనలు చేసింది. ఆర్థిక శాఖకు కేపీఎంజీ సూచనలు ► కరోనా చికిత్సలకు భారీ మొత్తం ఖర్చయినందున ప్రత్యేక పన్ను మినహాయింపు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ► భారత కంపెనీలు నేరుగా విదేశాల్లో లిస్ట్ అయ్యేందుకు లేదా స్పెషల్ పర్పస్ యాక్విజిషన్ కంపెనీ మార్గంలో లిస్ట్ అయ్యేందుకు, పన్ను మినహాయింపులకు సంబంధించి నియంత్రణపరమైన కార్యాచరణను ప్రకటించాలి. ► విదేశీ కంపెనీలకు, విదేశీ బ్యాంకు శాఖలకు కార్పొరేట్ పన్నును తగ్గించాలి. దేశీ కంపెనీలకు మాదిరే రేట్లను అమలు చేయాలి. ► టీడీఎస్, టీసీఎస్‌కు సంబంధించి నిబంధనలను సరళీకరించాలి. అన్ని రకాల సెక్యూరిటీలను (డెరివేటివ్స్ సైతం) టీడీఎస్/టీసీఎస్ నుంచి మినహాయించాలి. ► బ్యాంకుల మాదిరే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ (ఎన్బీఎఫ్సీ) కంపెనీలకు నిబంధనల పరంగా వెసులుబాటు కల్పించాలి. ముఖ్యంగా ఎన్పీఏలకు సంబంధించి మినహాయింపును పెంచాలి. వడ్డీ ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు ఇవ్వాలి. ► దేశంలో నూతన ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానాల ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు.. ముఖ్యంగా ఫార్మా, హెల్త్‌కేర్ రంగంలో పరిశోధన, అభివృద్ధిపై (ఆర్అండ్డీ) కంపెనీలు చేసే వ్యయాలకు వెయిటెడ్ డిడక్షన్ ఇవ్వాలి. ► జీఎస్టీ కిందకు పెట్రోలియం ఉత్పత్తులను తీసుకురావడాన్ని పరిశీలించాలి. ► కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కరోనా మహమ్మారి సమయంలో కంపెనీలు వినియోగించిన ఉత్పత్తులు, సేవలకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సదుపాయం కల్పించాలి. -
బీమా రంగం.. 80సీ పరిమితి పెంచాలి
న్యూఢిల్లీ: బీమా పథకాలను మరింత మందికి చేరువ చేయడానికి వీలుగా పరిశ్రమ కీలకమైన సూచనలను కేంద్రానికి తెలియజేసింది. సెక్షన్ 80సీ కింద బీమా ప్రీమియంకు ప్రత్యేకంగా రూ.లక్ష పరిమితిని ఏర్పాటు చేయాలని కోరింది. హెల్త్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులపై జీఎస్టీ రేటు ప్రస్తుతం 18 శాతంగా అమలవుతోందని, ఇవి మరింత అందుబాటు ధరలకు దిగిరావడానికి 5 శాతం శ్లాబులోకి మార్చాలని పరిశ్రమ డిమాండ్ చేసింది. 2022–23 బడ్జెట్లో ఇందుకు సంబంధించి ప్రతిపాదనలకు చోటు కల్పించాలని కోరింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనుండడం తెలిసిందే. ప్రజలను ప్రోత్సహించేందుకు సెక్షన్ 80సీ కింద అదనంగా రూ.లక్ష పన్ను మినహాయింపు పరిమితిని బీమా ప్రీమియం చెల్లింపులకు కల్పించాలని పరిశ్రమ ఎప్పటి నుంచో కోరుతోందని కెనరా హెచ్ఎస్బీసీ ఓబీసీ లైఫ్ ఇన్సూరెన్స్ సీఎఫ్‌వో తరుణ్ రస్తోగి తెలిపారు. జీవిత బీమా ప్రీమియం చెల్లింపులకు పన్ను మినహాయింపు కోసం ప్రత్యేకంగా ఒక సెక్షన్ ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నట్టు ఎడెల్వీజ్ టోకియో లైఫ్ ఇన్సూరెన్స్ ఈడీ సుబ్రజిత్ ముఖోపాధ్యాయ పేర్కొన్నారు. అప్పుడు కస్టమర్ల డబ్బులు దీర్ఘకాల సాధనాల్లోకి వెళతాయన్నారు. ప్రత్యేక ప్రోత్సాహకం ‘‘సెక్షన్ 80సీ ఇప్పుడు ఎన్నో సాధనాలతో కలసి ఉంది. పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ఎన్ఎస్సీ అన్నీ ఇందులోనే ఉన్నాయి. కనీసం టర్మ్ పాలసీలకు అయినా ప్రత్యేక సెక్షన్ పేరుతో మినహాయింపు కల్పించాలి. అది దేశ ప్రజలకు బీమా రక్షణ పరంగా ఉన్న అంతరాన్ని కొంత పూడ్చడానికి సాయపడుతుంది’’ అని ఏజిస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో విఘ్నేష్ సహానే చెప్పారు. ‘‘జీవిత బీమా అన్నది సామాజిక భద్రత కల్పించే సాధనం. కనుక సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల మినహాయింపును పెంచాలి’’అని ఫ్యూచర్ జనరాలి లైఫ్ ఇన్సూరెన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ప్రొడక్ట్స్ హెడ్ చిన్మయ్ బదే పేర్కొన్నారు. 2020–21 సంవత్సరానికి సంబంధించి బీమా రంగం నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) నివేదిక ప్రకారం జీడీపీలో బీమా వ్యాప్తి రేటు 4.2 శాతంగా ఉందని తెలుస్తోంది. అంతర్జాతీయ సగటు 7.4 శాతంగా ఉండడం గమనార్హం. 2021 మార్చి నాటికి నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ విస్తరణ రేటు 1 శాతంగానే ఉంది. ఇది కూడా నిత్యావసరమే.. కరోనా మహమ్మారి కల్పించిన అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం ఏర్పడినట్టు లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ సీఈవో రూపమ్ ఆస్తానా తెలిపారు. ‘‘హెల్త్ ప్లాన్లపై జీఎస్టీ రేటును గణనీయంగా తగ్గించడాన్ని ప్రభుత్వం పరిశీలించాలి. దీంతో హెల్త్ ప్లాన్లను, అదనపు రైడర్లను తీసుకునే దిశగా ప్రజలను ప్రోత్సహించినట్టు అవుతుంది’’అని ఆస్తానా చెప్పారు. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో తపన్ సింఘెల్ స్పందిస్తూ.. బీమా ప్లాన్ కొనుగోలులో ప్రీమియం ముఖ్య పాత్ర పోషిస్తుందని, తగినంత కవరేజీని ఎంపిక చేసుకుంటే దానిపై 18 శాతం జీఎస్టీ రేటు వల్ల భారం పెరిగిపోతున్నట్టు తెలిపారు. హెల్త్ ఇన్సూరెన్స్‌ను నిత్యావసర వస్తువు మాదిరిగా పరిగణించాలని ఎడెల్వీజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఈడీ, సీఈవో స్నానయ్ ఘోష్ కోరారు. అధిక వైద్య ఖర్చుల నేపథ్యంలో సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపు పరిమితిని రూ.50,000కు పెంచాలని నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో, ఎండీ కృష్ణన్ రామచంద్రన్ సూచించారు. -
జీఎస్టీ శ్లాబ్ రేట్లలో మార్పులు?
న్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సిల్ ఈ నెల 31న భేటీ కానుంది. పలు వస్తు, సేవల రేట్ల కమ్రబద్ధీకరణపై సమావేశం చర్చించనుంది. భౌతికంగా ఈ సమావేశం జరగనుంది. పలు ఉత్పత్తుల సుంకాల్లో దిద్దుబాటుపైనా దృష్టి సారించనుంది. జీఎస్టీ మండలికి ఇది 46వ భేటీ అవుతుంది. రేట్ల క్రమబద్ధీకరణపై మంత్రుల గ్రూపు (జీవోఎం) కౌన్సిల్‌కు నివేదికను సమర్పించనుంది. శ్లాబు, రేట్ల పరంగా చేయాల్సిన మా ర్పులు, మినహాయింపుల విభాగం నుంచి తొలగించాల్సిన వస్తువుల వివరాలను పన్ను అధికారులు మంత్రుల బృందానికి సిఫారసు చేయ డం గమనార్హం. ప్రస్తుతంజీఎస్టీలో 5, 12, 18, 28% రేట్లు అమల్లో ఉన్నాయి. నిత్యావసర వస్తువులు కొన్నింటికి పన్ను మినహాయింపు ఉండగా, మరికొన్ని చాలా తక్కువ రేట్లలో ఉన్నాయి. లగ్జరీ ఉత్పత్తులకు గరిష్ట రేట్లు అమల్లో ఉన్నాయి. 12, 18% రేట్లను కలిపేసి ఒకటే రేటును అమలు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇలా తగ్గే ఆదాయాన్ని.. మినహాయింపుల జాబితా నుంచి కొన్ని వస్తువులను పన్ను పరిధిలోకి చేర్చడం ద్వారా సర్దుబాటు చేసుకోవచ్చన్న సూచనలు ఉన్నాయి. చదవండి:జనవరి నుంచి జీఎస్టీలో కొత్త మార్పులు అమల్లోకి.. -
ఐటీ శ్లాబ్స్ హేతుబద్ధీకరించాలి..
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిసెంబర్ 15 నుంచి 21వ తేదీ వరకూ వివిధ వర్గాలతో జరిపిన 2022–23 బడ్జెట్ ముందస్తు సమావేశాల్లో ఆదాయపు పన్ను (ఐటీ) శ్లాబ్‌ల హేతుబద్దీకరణ నుంచి డిజిటల్ సేవలకు మౌలిక రంగం హోదా కల్పన వరకూ వివిధ వినతులు అందాయి. ఆర్థికశాఖ బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. హైడ్రోజన్ నిల్వకు ప్రోత్సాహకాలు, ఫ్యూయెల్ సెల్ డెవలప్మెంట్పై ప్రత్యేక దృష్టి, ఆన్లైన్ రక్షణ చర్యలపై పెట్టుబడుల వంటి అంశాలూ పారిశ్రామిక వర్గాల విజ్ఞప్తుల్లో ఉన్నట్లు ప్రకటన వెల్లడించింది. ప్రకటనలోని ముఖ్యాంశాలు.. ► డిసెంబర్ 15 నుంచి 21వ తేదీ వరకూ వర్చువల్‌గా జరిగిన ఎనిమిది సమావేశాలలో ఏడు రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 120 మందికి ప్రతినిధులు పాల్గొన్నారు. వీరిలో వ్యవసాయం–వ్యవసాయ ప్రాసెసింగ్ పరిశ్రమ–మౌలిక సదుపాయాలు, వాతావరణ మార్పు, ఆర్థిక రంగం–మూలధన మార్కెట్లు, సేవలు–వాణిజ్యం, సామాజిక రంగం, కార్మిక సంఘాలకు చెందిన ప్రతినిధులుసహా పలువురు ఆర్థిక వేత్తలు ఉన్నారు. ► ప్రధాని నరేంద్ర మోడీ 2.0 ప్రభుత్వానికి అలాగే సీతారామన్‌కు నాల్గవ బడ్జెట్. కోవిడ్–19 మహమ్మారి దెబ్బకు కుదేలయిన భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటున్న నేపథ్యంలో రూపొందుతున్న బడ్జెట్ ఇది. ► ఈ ఆర్థిక సంవత్సరం 8.3–10% వరకూ వృద్ధి ఉండొచ్చని అంచనా. ఆర్బీఐ అంచనాలు 9.5%. ప్రభుత్వ ఆదాయాలు– వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు అంచనా (జీడీపీలో) 6.8%గా ఉంది. 2021–22కి వివిధ వర్గాల అంచనా 7–7.5 శాతం వరకూ ఉంది. -
కరెంట్ బిల్లు తగ్గాలా.. ఇలా చేయండి!
సాక్షి, అమరావతి : మన ఇంట్లో ఉన్న విద్యుత్ ఉపకరణాలను సరైన విధానంలో వాడితే జేబుకు చిల్లు పెట్టే కరెంటు బిల్లులను కొంత తగ్గించుకోవచ్చని విద్యుత్ అధికారులు అంటున్నారు. గత నెలలో వచ్చిన కరెంటు బిల్లు కంటే ఈ నెల ఎక్కువ ఎందుకు వచ్చిందని తలపట్టుకునే ముందు ఇంట్లో ఉన్న ఏసీ, రిఫ్రిజ్రేటర్, గీజర్, ఒవెన్ తదితర విద్యుత్ ఉపకరణాలను మనం వాడే తీరుపై ఒకసారి దృష్టి సారించాలని సూచిస్తున్నారు. వాడకం పెరిగి యూనిట్లు పెరిగేకొద్దీ శ్లాబు మారి బిల్లు పెరుగుతుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే విద్యుత్ మీటర్లను గిరగిరా తిప్పే వస్తువులను క్రమపద్దతిలో వాడితే అధిక బిల్లులను నివారించుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. నిపుణులు చేసిన కొన్ని సూచనలను మీడియాకు వివరించారు. గీజర్‌తో జాగ్రత్త ఇంట్లో గీజర్ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఆన్ చెయ్యకుండా.. కుటుంబ సభ్యులంతా ఒకరి తర్వాత మరొకరు స్నానాలు చేస్తే మంచిది. థెర్మోస్టాట్ 50–60 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండేలా చూసుకోవాలి. రెండు స్నానాల గదులుంటే ఒకటే గీజర్ నీటిని వాడేలా పైపులు ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేస్తే బిల్లులో నెలకు కనీసం రూ.400 వరకూ ఆదా చెయ్యొచ్చు. ఏసీని అదుపు చెయ్యాల్సిందే ఏసీ ఎలా వాడాలో చాలామందికి తెలియదు. ముందుగా గదిలో చల్లదనాన్ని గ్రహించే వస్తువులు లేకుండా చూసుకోవాలి. గాలి బయటకు వెళ్లే అవకాశం లేకుండా గది త్వరగా చల్లబడుతుంది. వెంటనే చల్లబడాలని 18 డిగ్రీలు పెట్టేస్తుంటారు. కానీ ఎప్పుడు ఆన్ చేసినా 24 నుంచి 26 మధ్య ఉంచితే రూ.300 వరకు బిల్లు తగ్గుతుంది. పాత ఫ్రిజ్‌తో జేబుకు చిల్లు ఫ్రిజ్ ఉంచే ప్రదేశానికి, గోడకు మధ్య వేడి తగ్గించేలా కొంత ఖాళీ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా మీరు వాడే ఫ్రిజ్ పాతదైతే నెలకు 160 యూనిట్లకు పైనే కరెంట్ కాలుతుంది. అదే స్మార్ట్ ఫ్రిజ్ అయితే అవసరమైనప్పుడే ఆన్ అవుతాయి. లేకుంటే ఆగిపోతాయి. వీటివల్ల మీ బిల్లు రూ.300 వరకు తగ్గే వీలుంది. తడవకో జత ఉతక్కూడదు ఎప్పుడూ లోడ్‌కు తగ్గట్టుగా దుస్తులు వేయాలి. లోడ్‌కు మించి వేయకూడదు. అలాగని తడవకో జత దుస్తులను ఉతక కూడదు. ఏంచేసినా విద్యుత్ వినియోగం పెరుగుతుంది. అన్నింటికీ మించి మిషన్ పని విధానాన్ని కనీసం మూడు నెలలకోసారైనా మెకానిక్ చేత పరీక్షించాలి. మోటర్ స్లో అయితే విద్యుత్ వాడకం ఎక్కువవుతుంది. జాగ్రత్తలు పాటిస్తే రూ.60 ఆదా చెయ్యొచ్చు. ఒవెన్ ఊరికే తెరిచి చూడొద్దు వంటకానికి వాడే పదార్థాన్ని బట్టి టైం సెట్ చేయాలి. ఒకసారి ఆన్ చేశాక తరచూ తెరిచి చూస్తే టెంపరేచర్ పడిపోతుంది. అది మళ్ళీ వేడెక్కాలంటే ఎక్కువ కరెంట్ తీసుకుంటుంది. చిన్నా చితక వంటలకు ఓవెన్ వాడకపోవడమే మంచిది. ఇలాచేస్తే రూ.150 వరకు బిల్లు ఆదా అవుతుంది. -
కార్పొరేట్ ట్యాక్స్‌ను హేతుబద్ధీకరించాలి
న్యూఢిల్లీ: వివిధ కార్పొరేట్ ట్యాక్స్ రేట్లన్నింటినీ ఎటువంటి మినహాయింపులు లేకుండా 15 శాతం స్థాయికి హేతుబద్ధీకరించాలని కేంద్రాన్ని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కోరింది. 2023 ఏప్రిల్ నాటికల్లా దీన్ని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసింది. పెట్టుబడుల నిర్ణయాలు తీసుకునేందుకు అనువుగా రాబోయే బడ్జెట్లోనే ఇందుకు సంబంధించిన ప్రకటన చేయాలని సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ పేర్కొన్నారు. కార్పొరేట్ ట్యాక్స్ రేటును తగ్గించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో చూసినప్పుడు ఇంకా ఆశించిన స్థాయిలో తగ్గుదల లేదని తెలిపారు. తయారీ, సేవా రంగాల పన్ను రేట్లలో అసమానతలు నెలకొనడమే ఇందుకు కారణమని వివరించారు. తగ్గుతున్న శాతాలు... 1991–92లో 45 శాతంగా ఉన్న కార్పొరేట్ ట్యాక్స్ రేటు క్రమంగా తగ్గి ప్రస్తుతం 22 శాతానికి చేరింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం దీన్ని ఈ స్థాయికి తగ్గించింది. అయితే, కంపెనీలు దీన్ని వినియోగించుకోవాలంటే పన్ను మినహాయింపులు, ఇతరత్రా ప్రోత్సాహకాలను వదులుకోవాల్సి ఉంటుంది. 2023 మార్చి 31లోగా ఉత్పత్తి ప్రారంభించే తయారీ సంస్థలు, 2019 అక్టోబర్ 1 తర్వాత ఏర్పాటైన సంస్థలకు కార్పొరేట్ ట్యాక్స్ రేటు 15 శాతమే ఉంటుంది. సర్‌చార్జీ, సెస్సు దీనికి అదనం. పలు దేశాలకు దీటుగా పోటీపడేందుకు దేశీ సంస్థలకు .. తాజా రేట్ల కోత తోడ్పడనుంది. క్రమేపీ పెట్టుబడుల వ్యయాన్ని తగ్గించుకునేందుకు, ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఊతమిచ్చేందుకు తక్కువ స్థాయి కార్పొరేట్ ట్యాక్స్ రేట్లు దోహదపడనున్నాయి. కార్పొరేట్ ట్యాక్స్ రేటును కంపెనీలకు 30 శాతం నుంచి 22 శాతానికి, కొన్ని కొత్త తయారీ సంస్థలకు 25 శాతం నుంచి 15 శాతానికి కేంద్రం సెప్టెంబర్‌లో తగ్గించింది. -
ఆదాయపు పన్నులు నాలుగు శ్లాబ్‌లలో ఉండాలి
న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపు పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి ఎస్సీ గర్గ్ అభిప్రాయపడ్డారు. సెస్సులు, సర్‌చార్జీలు లేకుండా దీన్ని నాలుగు రేట్లకు పరిమితం చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్ ట్యాక్స్ విధానాన్ని ఇప్పటికే సముచిత స్థాయిలో హేతుబద్ధీకరించినందున.. ఇక ఆ విషయంలో తదుపరి చర్యలేమీ ఆశించడానికి లేదని గర్గ్ చెప్పారు. అయితే, వ్యక్తిగత ఆదాయపు పన్నుల విషయంలో కొన్ని కీలకమైన సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆదాయపు పన్నుకు సంబంధించి ఎనిమిది శ్లాబ్‌లు ఉన్నాయి. గరిష్టంగా 40% రేటు ఉంటోంది. రూ. 5 లక్షలకు లోపు ఆదాయం ఉన్న వారికి ఎలాంటి పన్ను విధించరాదని గర్గ్ ప్రతిపాదించారు. రూ. 5–10 లక్షల మధ్య ఆదాయ వర్గాలపై 5 శాతం, రూ. 10–25 లక్షల ఆదాయాలపై 15 శాతం, రూ. 25–50 లక్షలపై 25 శాతం, రూ. 50 లక్షల పైబడిన ఆదాయంపై 35% రేటు విధిస్తే సముచితంగా ఉండగలదని ఆయన పేర్కొన్నారు. -
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ @ రూ.1
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ వినియోగంలో బీపీఎల్ కింద ఉన్న పేదలకు ఊరట కలిగించే నిర్ణయాన్ని బల్దియా తీసుకుంది. కేవలం ఒక్క రూపాయి డొనేషన్‌తో దారిద్రరేఖకు దిగువన ఉన్న గృహ యజమానులకు యూజీడీ సేవలందించాలని సంకల్పించింది. మరోవైపు యూజీడీ నిర్వహణ భారం బల్దియాపై పడకుండా నూతనంగా గృహ, దుకాణ సముదాయాలను నిర్మించే యాజమానులకు స్లాబ్ పద్ధతిలో డొనేషన్ చెల్లించాలనే నిర్ణయాన్ని కౌన్సిల్ సభ్యులు గురువారం కౌన్సిల్ హాల్లో చైర్మన్ రాజనర్సు అధ్యక్షతన నిర్వహించిన స్థానిక మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. బీపీఎల్(దారిద్ర రేఖకు ఎగువ ఉన్న)వర్గాలకు చెందిన వారి నుంచి, వ్యాపారసంస్థలు, అపార్ట్‌మెంటులు, ప్రైవేటు విద్యాసంస్థలు, జూనియర్ కళాశాలలు, బహుళ అంతస్తుల భవనాలకు యూజీడీని ఏ, బీ, సీ, డీ వర్గాలుగా విభజించి వెయ్యి నుంచి పది వేల వరకు ఆయా విభాగాలకు అనుగుణంగా డిపాజిట్‌ను ఒకేసారి స్వీకరించాలని కౌన్సిల్ నిర్ణయించింది. నెలవారీ టారీఫ్ రూపంలో చెల్లింపు యూజీడీని వినియోగించినందుకు గాను నూతనంగా నిర్మించే బహుళ అంతస్తుల భవన నిర్మాణ యాజమానులు నెలవారి రుసుము టారీఫ్ రూపంలో చెల్లించాలని తీర్మానించారు. మొదటగా యూజీడీ వినియోగ నిర్వహణ టారీఫ్‌పై సభ్యుల్లో చర్చ కొనసాగింది. బల్దియాకు భారం పడకుండా పేదలకు ఇబ్బంది కలుగకుండా సంపన్న వర్గాలకే నామమాత్ర రుసుముతో మురికి నీటి శుద్ధీకరణ సేవలను అందించాలని కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. సిద్దిపేట పట్టణంలో 400 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను అమలవుతోందని, ప్రతి నెలా యూజీడీ నిర్వహణకు రూ.10 లక్షలు వెచ్చించాల్సి ఉంటుందని, ఇది మున్సిపల్‌కు అదనపు భారంగా మారనున్న క్రమంలో కౌన్సిల్ ఆమోదంతో డిపాజిట్లను సేకరించాలని నిర్ణయించారు. స్లాబుల పద్ధతిలో.. కౌన్సిలర్ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ పూర్తిస్థాయి విధి విధానాలతో ప్రజలపై భారం పడకుండా చూడాలని కోరారు. దారిద్రరేఖకు ఎగువ ఉన్న గృహాలకు రూ.2 వేలు, అపార్ట్మెంట్లకు, వ్యాపార సంస్థలకు రూ.10 వేలు, విద్యాసంస్థలకు రూ.5 వేలు, జూనియర్, డిగ్రీ కళాశాలలకు రూ.10 వేలు, బహుళ అంతస్తులకు రూ.15 వేలు, ప్రైవేటు ఆస్పత్రులు, కాంప్లెక్స్‌లు, థియేటర్లు, భారీ హోటళ్లకు రూ.20 వేల చొప్పున ఒకేసారి డిపాజిట్‌ను స్వీకరించాలని నిర్ణయించినట్లు చైర్మన్ రాజనర్సు పేర్కొన్నారు. మరో సభ్యుడు బర్ల మల్లికార్జున్ ఏ, బీ, సీ, డీ వర్గాలుగా విభజించి స్థాయిని ప్రామాణికంగా తీసుకుని డిపాజిట్లు స్వీకరించాలని కోరారు. నల్లా కనెక్షన్లను క్రమబద్ధీకరించాలి టారీఫ్‌ల ప్రకారం డిపాజిట్లను నిర్ణయించామని, నూతన గృహాలు, అపార్ట్మెంట్లు నిర్మించే వారు డిపాజిట్ల చెల్లించాల్సి ఉంటుందని, పాత నిర్మాణాలకు వర్తించదని చైర్మన్ రాజనర్సు తెలిపారు. అపార్ట్మెంట్ల నుంచి నల్లా బిల్లులో సగ భాగాన్ని ప్రతి నెలా మురికి నీటి శుద్ధీకరణ చార్జిగా వసూలు చేసేందుకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలుపాలని కోరారు. కౌన్సిలర్ వెంకట్‌గౌడ్ మాట్లాడుతూ పట్టణంలో అనేక అక్రమ నల్లాల కనెక్షన్లు ఉన్నాయని వాటిని క్రమబద్ధీకరించి బల్దియాకు ఆదాయం తీసుకురావాలని కోరారు. మరో సభ్యుడు మల్లికార్జున్ నల్లా బిల్లుల బకాయిలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పలు సమస్యలపై సభ్యులు ప్రవీణ్, గ్యాదరి రవి, వజీర్, ఉమారాణి, నర్సయ్యలు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈ లక్ష్మణ్, పబ్లిక్ హెల్త్ డీఈ గోపాల్, ఆర్ఐ కృష్ణ, వైస్ చైర్మన్ అత్తర్, కౌన్సిలర్లు చిప్ప ప్రభాకర్, మోహీజ్, ప్రశాంత్, బాసంగారి వెంకట్, బూర శ్రీనివాస్, జావేద్, శ్రీనివాస్ యాదవ్, లలిత, స్వప్న, కంటెం లక్ష్మి, నల్ల విజయలక్ష్మి, తాళ్లపల్లి లక్ష్మి, మరుపల్లి భవాని, గురజాడ ఉమరాణి, పూజల లత, మామిండ్ల ఉమారాణి, జంగిటి కవిత, గుడాల సంద్య, సాకి బాల్‌లక్ష్మి, బోనాల మంజుల, ప్రమీల, మంతెన జ్యోతి, శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
21న జీఎస్టీ కౌన్సిల్ కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ సారధ్యంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జీఎస్టీ కౌన్సిల్ ఈనెల 21న భేటీ కానుంది. ఈ సమావేశంలో అధిక శ్లాబ్‌లో ఉన్న పలు వస్తువులు, సేవలను తక్కువ పన్ను శ్లాబుల్లోకి తీసుకురావడంపై చర్చించనున్నారు. మరోవైపు కేంద్ర బడ్జెట్ సమర్పించే రెండు వారాల ముందు ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం 28 శాతం శ్లాబ్‌లో ఉన్న పలు వస్తువులపై పన్ను శ్లాబును తగ్గించాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆటో, ఉత్పాదక, నిర్మాణ రంగాల్లో స్ధబ్ధత నెలకొన్న కారణంగా ఆయా రంగాల్లో ఉత్తేజం పెంచేందుకు జీఎస్టీ పన్ను రేట్లను తగ్గించాలని పారిశ్రామిక వర్గాల నుంచి సైతం ఒత్తిడి ఎదురవుతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే జీఎస్టీ కౌన్సిల్ భేటీ ఈ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటుందని భావిస్తున్నారు. ఇక బడా కంపెనీల పన్ను ఎగవేతలకు చెక్ పెట్టేందుకు రూ 50 కోట్లు పైబడిన లావాదేవీలకు విధిగా ఈ-ఇన్వాయిసింగ్ను అనివార్యం చేయడంపైనా ఈ భేటీలో చర్చిస్తారు. కాగా సార్వత్రిక ఎన్నికలకు ముందు గత ఏడాది డిసెంబర్ 22న మూవీ టికెట్లు, టీవీ, మానిటర్ స్ర్కీన్లు, పవర్ బ్యాంక్స్, నిల్వచేసే కూరగయాలు సహా 23 వస్తువులు, సేవలపై పన్ను రేట్లను తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది. -
ఆచరణయోగ్యంగా లేని జీఎస్టీ
- మంత్రి ఈటల రాజేందర్ - ప్రజలకు ఇబ్బంది లేకుండా పొరపాట్లు సరిదిద్దాలి - కేంద్రానికి రాష్ట్రం తరఫున అయిదు డిమాండ్లు - జీఎస్టీ కౌన్సిల్ భేటీలో నివేదిస్తామన్న మంత్రి సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ పన్నుల విధానం ఆచరణ యోగ్యంగా లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కొన్ని వస్తువులు, కొన్ని రంగాలపై అశాస్త్రీయంగా పన్నుల భారం పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జూలై ఒకటి నుంచి దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని అమలు చేయాలనే ఆదరాబాదరాగా కేంద్రం విధించిన స్లాబ్ రేట్లు కొన్ని రంగాలను తీవ్రంగా ప్రభావితం చేశాయన్నారు. స్లాబ్‌లు వెల్లడవ టంతో దేశవ్యాప్తంగా అశాంతి చెలరేగు తోందని, హోటళ్లు, కళ్లద్దాలు, ఫ్యాన్ల తయారీ కంపె నీలు, గ్రానైట్ వ్యాపారులు ఆందోళన చేపట్టారన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా పొరపాట్లు సరిదిద్దాలని ఈటల, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి విజ్ఞప్తి చేశారు. పన్ను చెల్లించే వారి సంఖ్యను విస్తరిం చేలా, సామాన్యులపై ధరల భారం పడ కుండా జీఎస్టీ ఉండాలనేది తెలంగాణ ప్రభుత్వ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. సామా న్యులపై భారం పడకుండా కొన్ని మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5 డిమాం డ్లను కేంద్రానికి నివేదిస్తామన్నారు. పన్ను ఎగవేతకు ఆస్కారం లేని ఆచరణయోగ్యమైన పన్ను విధానం ఉండాలని మరోమారు స్పష్టం చేస్తామన్నారు. జీఎస్టీ భారమవు తుందని ఆందోళన చేస్తున్న వ్యాపార వర్గాలు, సంస్థల బాధను ఆలకించాలని సూచించారు. పకడ్బందీ విధానం అనుసరించేంత వరకు అవసరమైతే జీఎస్టీ అమలు తేదీని మరో నెల పాటు వాయిదా వేయాలన్నారు. సామా న్యులు ఉపయోగించే వస్తువులపై పన్నులను సమీక్షించాలని, ముడి సరుకులు, పరికరాలకు విడివిడిగా పన్నులు కాకుండా తయారైన వస్తువుపై ఒకే పన్ను ఉండేలా చూడాలన్నారు. జూన్3న జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాలను ప్రస్తావిస్తామన్నారు. రామానందతీర్థ ఇన్స్టిట్యూట్కు 10 కోట్లు నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణను అందించే స్వామి రామా నంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్కు రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ఈటల ప్రకటించారు. భూదాన్ పోచంపల్లిలోని ఈ సంస్థ సేవలను సమైక్య రాష్ట్రంలో పాలకులు పట్టించుకోలేదని, కనీసం ఉద్యోగులకు జీతా లివ్వలేదని ఆరోపించారు. ప్రస్తుతం ఏటా 1,400 మంది యువతకు హాస్టల్ వసతితో పాటు వివిధ నైపుణ్య కోర్సులు అందిస్తున్న ఈ సంస్థను 5,000 మందికి శిక్షణ ఇచ్చే స్థాయికి మారుస్తామన్నారు.