న్యూఢిల్లీ: జీఎస్‌టీ కౌన్సిల్ ఈ నెల 31న భేటీ కానుంది. పలు వస్తు, సేవల రేట్ల కమ్రబద్ధీకరణపై సమావేశం చర్చించనుంది. భౌతికంగా ఈ సమావేశం జరగనుంది. పలు ఉత్పత్తుల సుంకాల్లో దిద్దుబాటుపైనా దృష్టి సారించనుంది. జీఎస్‌టీ మండలికి ఇది 46వ భేటీ అవుతుంది. రేట్ల క్రమబద్ధీకరణపై మంత్రుల గ్రూపు (జీవోఎం) కౌన్సిల్‌కు నివేదికను సమర్పించనుంది. శ్లాబు, రేట్ల పరంగా చేయాల్సిన మా ర్పులు, మినహాయింపుల విభాగం నుంచి తొలగించాల్సిన వస్తువుల వివరాలను పన్ను అధికారులు మంత్రుల బృందానికి సిఫారసు చేయ డం గమనార్హం.
ప్రస్తుతంజీఎస్‌టీలో 5, 12, 18, 28% రేట్లు అమల్లో ఉన్నాయి. నిత్యావసర వస్తువులు కొన్నింటికి పన్ను మినహాయింపు ఉండగా, మరికొన్ని చాలా తక్కువ రేట్లలో ఉన్నాయి. లగ్జరీ ఉత్పత్తులకు గరిష్ట రేట్లు అమల్లో ఉన్నాయి. 12, 18% రేట్లను కలిపేసి ఒకటే రేటును అమలు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇలా తగ్గే ఆదాయాన్ని.. మినహాయింపుల జాబితా నుంచి కొన్ని వస్తువులను పన్ను పరిధిలోకి చేర్చడం ద్వారా సర్దుబాటు చేసుకోవచ్చన్న సూచనలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment