
పార్టీ మారంది ఎవరు?
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల గురించి ప్రతిపక్ష నాయకులు గురివింద చందంగా మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న నాయకుల్లో చాలా మంది పార్టీలు మారిన వారు ఉన్నారని గుర్తు చేశారు. ఈ రాష్ట్రంలో పార్టీ మారంది ఎవరు అంటూ ప్రశ్నించారు.
మాజీ మంత్రి విజయరామారావును కలిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపుల గురించి విలేకరులు ప్రశ్నించగా... జానారెడ్డి, చంద్రబాబు పార్టీ మారలేదా అని ఎదురు ప్రశ్నించారు. వీరు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
విజయరామారావును తమ పార్టీలోకి ఆహ్వానించామని చెప్పారు. ఆయన తీసుకునే నిర్ణయం ప్రజాస్వామ్య బలోపేతానికి తోడ్పడుతుందని తాము విశ్వసిస్తున్నట్టు చెప్పారు. ఉన్నత విద్యావంతులు రాజకీయాల్లోని రావాలని పిలుపునిచ్చారు. విద్యాధికుల మౌనం సమాజానికి మంచిది కాదన్నారు.