మైనర్ బాలికపై తండ్రీ కొడుకుల అఘాయిత్యం
చైతన్యపురి: బాలికను పనిలో పెట్టుకుని వెట్టిచాకిరీ చేరుుంచడమే కాకుండా కొన్నాళ్లుగా లైంగికదాడికి పాల్పడ్డారు ఓ న్యాయవాది, అతని కుమారుడు. విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు బాలికను కాపాడి పోలీసులను ఆశ్రరుుంచారు. చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి సీఐ గురురాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం... గ్రీన్‌హిల్స్‌కాలనీ రోడ్ నెం.4డీలోని గ్రీన్‌హిల్స్ అపార్ట్‌మెంటులో సుధాకర్‌రెడ్డి అనే న్యాయవాది నివసిస్తున్నాడు. ఇతనికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 9 నెలల క్రితం మల్లమ్మ అనే మధ్యవర్తి ద్వారా సూర్యాపేట సుందరయ్యనగర్‌కు చెందిన మైనర్ బాలిక(17)ను తీసుకొచ్చి పనిలో పెట్టుకున్నారు.
కొన్నాళ్లుగా న్యాయవాది సుధాకర్‌రెడ్డి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు అతని చిన్న కుమారుడు భరత్‌కుమార్‌రెడ్డి లైంగిక దాడికి పాల్పడుతున్నారు. అదే ఇంట్లో ఎలక్ట్రిక్ పనులు చేయడానికి వచ్చిన ఓ వ్యక్తికి ఆ బాలిక తన గోడు చెప్పడంతో అతడు తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం మహిళా అధ్యక్షురాలు మహేశ్వరిగౌడ్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె బాలికను ఆ ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చి ఆసుపత్రిలో పరీక్షలు చేరుుంచగా బాలిక గర్భిణి అని తేలింది. మంగళవారం సాయంత్రం చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో బాలికను అప్పగించి న్యాయవాది సుధాకర్‌రెడ్డి కుటుంబంపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశామని, వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఉస్మానియా ఆసుపత్రికి పంపనున్నట్లు సీఐ తెలిపారు.
అపార్ట్‌మెంట్‌వాసిపై దాడి...
విషయం బయట తెలియడానికి నువ్వే కారణం అంటూ అపార్ట్‌మెంట్‌వాసి ఉప్పల వెంకటేశ్‌పై సుధాకర్‌రెడ్డి రెండో కుమారుడు దాడి చేసి గాయపర్చాడు. దీంతో వెంకటేశ్ చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
కఠిన చర్యలు తీసుకోవాలి...
బాల కాార్మికురాలిని పనిలో పెట్టుకోవడంతో పాటు మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడిన న్యాయవాది సుధాకర్‌రెడ్డి, అతని కుమారుడు భరత్‌కుమార్‌రెడ్డిలపై ఫోక్సో చట్టం, జువైనల్ జస్టిస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనూరాధరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. న్యాయవాదులైన తండ్రి, కొడుకులను బార్ కౌన్సిల్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
బాలికపై లైంగికదాడికి యత్నం
మొరుునాబాద్: సరస్వతీ నిలయంలోనే ఓ చిన్నారికి రక్షణ లేకుండా పోరుుంది. వెకిలి చేష్టలకు పాల్పడుత్ను వ్యక్తిపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఘటన మొరుునాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ శ్రీనివాస్, ఎస్సై నయీమొద్దీన్ వివరాల ప్రకారం బెంగుళూరుకు చెందిన నారాయణదాస్(51) రంగారెడ్డి జిల్లా మొరుునాబాద్ మండలంలోని నాగిరెడ్డిగూడ రెవెన్యూలో ఉన్న ఓ కార్పొరేట్ పాఠశాలలో క్యాంటిన్ ఇన్‌చార్జిగా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న 9 ఏళ్ల బాలికకు నెల రోజులుగా సెల్‌ఫోన్‌లో అశ్లీల దృశ్యాలు చూపిస్తూ వెకిలి చేష్టలకు పాల్పడుతున్నాడు. దీంతో ఆ బాలిక విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లింది. కానీ అతడు పట్టించుకోలేదు. దీంతో బాలిక విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులు మొరుునాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అరుుతే నిందితుడు ఇక్కడి నుంచి తప్పించుకుని బెంగుళూరుకు పారిపోరుునట్లు తెలుస్తోంది. పాఠశాల యాజమాన్యం పట్టించుకోకపోవడంతో విద్యార్థులకు రక్షణలేకుండా పోరుుందని పలువురు ఆరోపిస్తున్నారు. బాధ్యులైనవారిని, నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.