సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 31 మంది అభ్యర్థులు పోటీ పడుతున్న ఈ ఎన్నికల్లో మొత్తం 2.86 లక్షల గ్రాడ్యుయేట్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 1,33,003 మంది, హైదరాబాద్‌లో 87,208 మంది, మహబూబ్‌నగర్ జిల్లాలో 66,100 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో 1,92,110 మంది పురుషులు కాగా, 94,188 మంది మహిళలు, మరో 13 మంది ఇతరులు ఉన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో 97, రంగారెడ్డిలో 165, హైదరాబాద్ జిల్లాలో 151 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు హైదరాబాద్ జిల్లాలో 894 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు.
వీరిలో 182 మంది ప్రిసైడింగ్ అధికారులు, 182 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 364 మంది పోలింగ్ సిబ్బందితోపాటు 166 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. మిగతా జిల్లాల్లోనూ ఇదే స్థాయిలో పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఓటర్లకు అభ్యర్థులెవరూ నచ్చని పక్షంలో ‘నోటా’ను వినియోగించుకునే వీలు కల్పించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ రాజేంద్రనగర్‌లోని ఎంపీ ప్రభుత్వ పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
గుర్తింపు కార్డు తప్పనిసరి
ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్) లేని వారు పాస్‌పోర్టు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లెసైన్స్, పాన్‌కార్డు, విద్యాసంస్థల్లో పనిచేసేవారి సర్వీసు ఐడీ కార్డు, యూనివర్సిటీ డిగ్రీ/డిప్లొమా (ఒరిజినల్), అంగవైకల్య సర్టిఫికెట్ (ఒరిజినల్), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రైవేట్ పారిశ్రామిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల సర్వీసు ఐడీ కార్డు, ఎంపీలు, ఎమ్మెలే ్యలు, ఎమ్మెల్సీల అధికారిక ఐడీ కార్డులను చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
పట్టభద్రులు ఎన్నికల సంఘం వెబ్‌సైట్ నుంచి కానీ, ఇంటి నెంబరు లేదా ఓటరు పేరు ద్వారా కానీ తమ పోలింగ్ స్టేషన్‌ను వివరాలను ఇంటర్‌నెట్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉందన్నారు. ఓట్ అని టైపు చేసి స్పేస్ ఇచ్చి ఎపిక్ నెంబరు వేసి 87904 99899 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్,లేదా టోల్‌ఫ్రీ నెంబరు 1950కు ఫోన్ చేసి కూడా తెలుసుకోవచ్చు.
అభ్యర్థులు వీరే..
1. ఆగిరు రవికుమార్ గుప్తా (కాంగ్రెస్)
2. జి.దేవీప్రసాద్‌రావు(టీఆర్‌ఎస్)
3. ఎన్.రామచంద్రరావు(బీజేపీ)
4. జాజుల భాస్కర్ ఆఫీసర్(శ్రమజీవి పార్టీ)
5. ఎ.సునీల్ కుమార్ అలిచాల
(తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా)
6. బి.సుశీల్‌కుమార్
(ఆల్ ఇండియా బీసీ, ఓబీసీ పార్టీ)
ఇండిపెండెంట్లు
7. అరకల కృష్ణగౌడ్
8.కుందేటి రవి
9.కూరపాటి జాకోబ్ రాజు
10.కె. కృపాచారి
11.ఎం.కృష్ణ
12. గంగుల నరసింహారెడ్డి(జి.ఎన్.ఆర్.)
13. గౌరీశంకర్‌ప్రసాద్.ఎల్
14. టి.నర్సింలు
15. పిట్ల నగేశ్ ముదిరాజ్
16. పిల్లి రాజమౌళి
17.ఎ. భాస్కర్‌రెడ్డి
18.మహమ్మద్ అబ్దుల్ అజీజ్‌ఖాన్
19. మీసాల గోపాల్ సాయిబాబా
20. ముకుంద నాగేశ్వర్
21.రవీందర్ మాల
22.రాకొండ సుభాష్‌రెడ్డి
23.ఎస్.రాజేందర్
24.డి.వి.రావు
25.కె.వి.శర్మ
26.శాంత్‌కుమార్ గోయెల్
27.ఎ.శివకుమార్
28.షేక్ షబ్బీర్ అలీ
29.సయ్యద్ హైదర్‌అలీ
30.సిద్ధి లక్ష్మణ్‌గౌడ్
31.సిల్వేరి శ్రీశైలం
25న లెక్కింపు
ఈ నెల 25న ఉదయం 8 గంటలకు చాదర్‌ఘాట్ విక్టరీ ప్లేగ్రౌండ్‌లో ఓట్లు లెక్కించనున్నారు. కౌంటింగ్‌కు 28 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం
Published Sun, Mar 22 2015 1:20 AM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM
Advertisement
Advertisement