కార్యక్రమంలో మాట్లాడుతున్న సాగరికా ఘోష్. చిత్రంలో సునీతారెడ్డి
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఇప్పటివరకు పనిచేసిన ప్రధానుల్లో ఇందిరాగాంధీ అత్యం త శక్తివంతమైన నాయకురాలని.. ప్రధాని నరేంద్రమోదీ పలు అంశాల్లో ఆమెను అనుకరిస్తున్నారని ప్రముఖ జర్నలిస్ట్, ‘ఇందిరా.. ఇండియాస్ మోస్ట్ పవర్‌ఫుల్ ప్రైమ్‌మినిస్టర్’పుస్తక రచయిత్రి సాగరికా ఘోష్ అన్నారు. సంఘ్ పరివార్ సైతం నెహ్రూ, సోనియా, రాహుల్‌గాంధీ విధానాలను లక్ష్యంగా చేసుకుంది కానీ.. ఇందిరను ఎప్పుడూ టార్గెట్ చేయలేదన్నారు.
ఈ పుస్తక పరిచయ కార్యక్రమానికి ప్రముఖ రచయిత్రి సునీతారెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సాగరిక మాట్లాడుతూ.. ఇందిరాగాంధీపై 120 జీవిత చరిత్ర పుస్తకాలు అచ్చయ్యాయని.. వాటిలో 80 పుస్తకాలను చదివిన తర్వాత అందులో స్పృశించని పలు కోణాలను ఈ పుస్తకంలో ప్రస్తావించినట్లు తెలిపారు. భిన్న వైరుధ్యాలున్న మహిళ ఇందిర అని, ఆమె హయాంలో ప్రజాస్వామ్యం కంటే వ్యక్తిస్వామ్యానికే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఇందిర స్ఫూర్తివంతమైన నాయకురాలు, మానవతావాది, గొప్ప పాలకురాలు అని, బ్యాంకుల జాతీయికరణ, బంగ్లాదేశ్ ఆవిర్భావం, పాకిస్తాన్‌తో యుద్ధం, అమెరికాతో దౌత్యం వంటి అంశాల్లో ఆమె అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శిం చారన్నారు. కోటరీ రాజకీయాలు, అవినీతి, కొన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, రాజనీతి, వ్యక్తిగత, కుటుంబ జీవితంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లను ఈ పుస్తకంలో ఆవిష్కరించే యత్నం చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment