హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజల చెవ్వుల్లో పువ్వులు పెడుతున్నారని బచావో తెలంగాణ మిషన్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్లో నాగం జనార్దన్రెడ్డి మాట్లాడుతూ... రూ. 35 వేల కోట్లకు టెండర్లు పిలిచి.... ఇప్పుడు రూ. 60 వేల కోట్లు అవుతాయని చెబుతున్నారని గుర్తు చేశారు. టెండర్లలో కాంపిటేషన్ లేదని చెప్పారు. ఈ టెండర్లు సీఎం క్యాంపు కాఆఫీసులో కూర్చుని పంచినట్లుగా ఉందని తెలిపారు. ఓ వేళ నాది తప్పని నిరూపిస్తే రాజకీయాలు నుంచి తప్పుకుంటానని.. కేసీఆర్కి నాగం జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు.