
సాక్షి, హైదరాబాద్: రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులు గతంలో ఏనాడూ లేవని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. పార్టీ నేతలు ప్రేమేందర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, పుష్పలీలతో కలసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతుల సమస్యలు తెలుసుకోవడానికి పార్టీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించాయని వెల్లడించారు. పుస్తెలు కుదువబెట్టి వ్యవసాయంలో పెట్టుబడికోసం అప్పులు చేశారని, ఇప్పుడేమో పంట అమ్మితే వచ్చిన ఆదాయం కూలీలకు కూడా సరిపోవడంలేదన్నారు.
రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. కాగా, పదవులకోసం పార్టీ మారే స్థాయి తనది కాదని, పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవమని నాగం స్పష్టం చేశారు. మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ సమస్య పరిష్కారంకోసం మంగళవారం తమ పార్టీ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టామన్నారు. పుష్పలీల మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధిలేదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment