Bachao Telangana Mission
-
'క్యాంపు ఆఫీసులో కూర్చుని పంచినట్లుంది'
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజల చెవ్వుల్లో పువ్వులు పెడుతున్నారని బచావో తెలంగాణ మిషన్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ... రూ. 35 వేల కోట్లకు టెండర్లు పిలిచి.... ఇప్పుడు రూ. 60 వేల కోట్లు అవుతాయని చెబుతున్నారని గుర్తు చేశారు. టెండర్లలో కాంపిటేషన్ లేదని చెప్పారు. ఈ టెండర్లు సీఎం క్యాంపు కాఆఫీసులో కూర్చుని పంచినట్లుగా ఉందని తెలిపారు. ఓ వేళ నాది తప్పని నిరూపిస్తే రాజకీయాలు నుంచి తప్పుకుంటానని.. కేసీఆర్‌కి నాగం జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు. -
ఒకేసారి రుణమాఫీ చేయాలి
బచావో తెలంగాణ మిషన్ అధ్యక్షుడు నాగం హైదరాబాద్: రైతుల రుణాలను ఒకేమారు మాఫీ చేసి ఆత్మహత్యలను ఆపాలని, కరువు మండలాలను ప్రకటించాలని బచావో తెలంగాణ మిషన్ అధ్యక్షుడు నాగం జనార్దన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరువు భాదిత రైతు కుటుంబాలకు 3 వేల రూపాయల కరువు భత్యం చెల్లించాలని, ఇప్పటికే పూర్తి కావస్తున్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని, మద్దతు ధర కాకుండా గిట్టుబాటు ధర కల్పించి అన్నదాతను ఆదుకోవాలని బచావో తెలంగాణ మిషన్ తీర్మానించింది. రైతుల సమస్యలపై మిషన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ఆదివారం మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి కిసాన్ బచావో దీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో జరిగిన చర్చకు మూడు గంటల పాటు ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతులకు భరోసా ఇచ్చేవిధంగా ప్రకటన చేయకపోవడం శోచనీయమని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలే బంగారు తెలంగాణనా? అని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రం అని చెప్పుకొనే కేసీఆర్ రైతుల రుణాల మాఫీకి రూ. 17 వేల కోట్లు చెల్లించలేరా అంటూ నిలదీశారు. ఉభయ సభల్లో సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం సమావేశంలో పాల్గొనాలని కోరడానికి గవర్నర్‌కు నాలుగు గంటల సమయం కేటాయించిన సీఎంకు.. రైతుల కోసం గంట సమయం దొరకడం లేదని, రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల కంటే పెద్ద సమస్య ఉందా అని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ పార్టీలకతీతంగా రైతుల కోసం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తే ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని ప్రభుత్వం బురద చల్లుతుందని అన్నారు. ఏకకాలంలో రైతు రుణాలను మాఫీ చేయాలన్నారు. మాజీమంత్రి డీకే అరుణ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయేనాటికి రూ. 16 వేల 500 కోట్ల మిగులు బడ్జెట్ ఉందని, ధనిక రాష్ట్రంలో రైతులకు సంబంధించిన రూ. 17 వేల 500 కోట్ల రుణాలను మాఫీ చేయలేకపోతున్నారని అన్నారు. ఫాంహౌజ్‌లో ఎకరాకు కోటి రూపాయలు సంపాదిస్తున్నానంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ విధమైన వ్యవసాయంపై రైతుకు అవగాహన కల్పిం చడం, కనీసం చనిపోయిన రైతుల కుటుంబాలను పలకరించిన పాపాన పోవడం లేదన్నారు. కార్యక్రమంలో సాక్షి ఈడీ రామచంద్రమూర్తి, టీటీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరకు సుధాకర్, నాయకులు రమేష్‌రెడ్డి, చెంగారెడ్డి, జంగారెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. -
కేసీఆర్ ప్రభుత్వం దారి తప్పింది : నాగం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం దారితప్పిందని, ప్రభుత్వాన్ని సరిచేయడంలో ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యాయని బచావో తెలంగాణ మిషన్ వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ తీరుపై ప్రజలను సమీకరించి, ప్రజల కోసం ప్రభుత్వాన్ని పని చేయించడమే బచావో తెలంగాణ మిషన్ లక్ష్యమని చెప్పారు. రాజకీయాల్లో తన 30 ఏళ్ల అనుభవాన్ని వినియోగించుకున్న పాపాన పోలేదని బీజేపీనీ విమర్శించారు. హైదరాబాద్‌లో బుధవారం ‘బచావో తెలంగాణ మిషన్’ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కొమ్మూరి ప్రతాపరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగం మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టులపై ఉద్యమంతో ప్రారంభమైన బచావో తెలంగాణ మిషన్ భవిష్యత్తులో విద్య, వైద్యం, యువజన సమస్యలపై పోరాడుతుందన్నారు. అవగాహనలేని నిర్ణయాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నారని ఆరోపించారు. తమ మిషన్ బీజేపీకి వ్యతిరేకం కాదని, ప్రస్తుతానికి ఆ పార్టీలోనే కొనసాగుతానని తెలిపారు. -
ప్రతిపక్షాలను సీఎం భయపెడుతున్నారు
కవాడిగూడ (హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ప్రతిపక్ష పార్టీలు భయపడుతున్నాయి.. అసలు ప్రతిపక్షమేదో తెలియడం లేదు.. పత్రికలు సైతం సర్కారంటే జంకుతున్నాయి.. అని బచావో తెలంగాణ మిషన్ వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. బచావో తెలంగాణ మిషన్ కార్యాలయాన్ని తన అనుచరులతో కలసి బుధవారం బషీర్‌బాగ్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ.. అవగాహన రాహిత్యంతో పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. వాటిని తిప్పికొట్టి ప్రజల పక్షాన నిలవడంలో ప్రతిపక్షాలు విఫలమవడంతోనే బచావో తెలంగాణ మిషన్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. త్వరలోనే గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేస్తామన్నారు. రాజకీయాలకతీతంగా పని చేయనున్నామని తెలిపారు. సచివాలయం, ఛాతీ ఆస్పత్రి, ఉస్మానియా ఆస్పత్రులను తరలిస్తాం, కూల్చేస్తాం అనే విధ్వంసకర మాటలు కేసీఆర్ వాడుతున్నా ప్రతిపక్ష నాయకులు ఏ ఒక్కరూ తీవ్ర స్థాయిలో వ్యతిరేకించడం లేదని మండిపడ్డారు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. ఆకాశహర్మ్యాల నిర్మాణం వంటి కల్లబొల్లి కబుర్లకే సీఎం కేసీఆర్ పరిమితం అయ్యారని ధ్వజమెత్తారు. అధికారమంతా ఆయన కుమారుడు, అల్లుడు చేతుల్లోనే ఉందనీ, మిగతా మంత్రులంతా డమ్మీలుగా ఉన్నారని విమర్శించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్, రెడ్డి, కొమ్మూరి ప్రతాపరెడ్డి, బచావో తెలంగాణ మిషన్ నాయకులు వెదిరే యోగీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. -
ఆ మంత్రులంతా డమ్మీలే: నాగం
హైదరాబాద్ : తెలంగాణను కాపాడాలనేదే నా సంకల్పమని బీజేపీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. అందరం ఒక్కటై రాష్ట్రాన్ని కాపాడుకుందామని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లో బచావో తెలంగాణ మిషన్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చీప్ లిక్కర్ ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని భవనాలు కూల్చివేస్తానంటున్న మీరు రైతుల ఆత్మహత్యలు పట్టించుకోరా అంటూ కేసీఆర్‌ను ప్రశ్నించారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య, కరువు, ఆత్మహత్యలపై తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఓ విధంగా చెప్పాలంటే టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై బచావో తెలంగాణ మిషన్ పోరాటం చేస్తుందని నాగం స్పష్టం చేశారు. ప్రజాధనాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ చేర్చుకోవడం తప్పుకాదా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులంతా డమ్మీలయ్యారని నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. -
బచావో తెలంగాణ మిషన్ పేరుతో కొత్త ఉద్యమం