ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో అడ్డగోలుగా సాగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపేయాలని ఆదేశించింది.
పర్యావరణ అనుమతులు లేకుండా జరిపే ఇసుక తవ్వకాలు అక్రమం అని తెలిపిన గ్రీన్ ట్రిబ్యునల్.. ఈ అంశంపై రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని తెలుగు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. నదీ తీర ప్రాంతాల్లో యంత్రాలతో ఇసుక తవ్వడంపై గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై తదుపరి విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది.