ఫ్యాషన్‌కు క్రేజ్
భారత్‌లోని అతిపెద్ద డిజైన్ స్కూల్స్ చెయిన్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ (ఐఎన్‌ఐఎఫ్‌డీ) క్యాంపస్, ఐఎన్‌ఐఎఫ్‌డీ అకాడమీ ఆఫ్ ఇంటీరియర్స్ మాదాపూర్‌లో ప్రారంభమయ్యాయి. బాలీవుడ్ స్టార్ ఫ్యాషన్ డిజైనర్ ఆష్లే రెబెల్లో, సెలబ్రిటీ ఇంటీరియర్ డిజైనర్ ట్వింకిల్‌ఖన్నా వీటిని ప్రారంభించారు.
కొత్తగా ప్రారంభమైన ఈ హైటెక్ క్యాంపస్ ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థుల్లో సృజనాత్మకతకు పదునుపెట్టడమే కాకుండా, వారి ప్రతిభకు తగిన అవకాశాలు కల్పిస్తుందని ఐఎన్‌ఐఎఫ్‌డీ హైదరాబాద్ సెంటర్ డెరైక్టర్ మంజూష అన్నారు. ఈ సందర్భంగా ఆష్లేతో ‘సిటీ ప్లస్’ ముచ్చటించింది.
‘ఫ్యాషన్ డిజైనింగ్‌పై యువతలో క్రేజ్ పెరుగుతోంది. ఇది డిజైనింగ్ ఇండస్ట్రీకి శుభపరిణామం. బాలీవుడ్‌లో 21 ఏళ్లుగా కొనసాగుతున్నాను. నమ్రత నాకు మంచి స్నేహితురాలు. మహేష్‌బాబు సినిమాలకు కూడా పనిచేయాలని ఉంది. ఇక తమన్నాకు కూడా డిజైనింగ్ చేయాలని ఉంది. ఆమెకు ఎలాంటి డ్రెస్సయినా ఇట్టే అమరిపోతుంది. అంత పర్‌ఫెక్ట్ పర్సనాలిటీ ఆమెది. ఇప్పటి వరకు ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, కత్రినా కైఫ్, నమ్రతా శిరోద్కర్, టబు వంటి తారలకు డిజైనింగ్ చేశాను. నేను డిజైనింగ్ చేసిన వాటిలో జైహో, దబాంగ్-2, ఏక్ థా టైగర్, బాడీగార్డ్, రెడీ, బిగ్‌బాస్ సీజన్-7 సక్సెస్ అయ్యాయి’ అని చెప్పుకొచ్చాడు ఆష్లే.