టీఆర్‌ఎస్ అధ్యక్ష పదవికి కేసీఆర్ తరఫున నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధ్యక్ష పదవికి సీఎం కేసీఆర్ తరఫున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు విడతల వారీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌కు వచ్చిన వీరు.. పార్టీ అధ్యక్ష ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి నామినేషన్ పత్రాలు అంద జేశారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ.. ఉదయం నామినేషన్ పత్రాలు అంద జేశారు. ఆయన వెంట మంత్రులు కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారు.
మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి వేర్వేరుగా నామినేషన్ల సెట్లు అందజేశారు. జగదీశ్‌రెడ్డి వెంట మంత్రి చందూలాల్, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తదితరులు ఉన్నారు. ఎంపీ జితేందర్‌రెడ్డి నేతృత్వంలో ఎంపీల బృందం మరో సెట్‌ను దాఖలు చేసింది. జితేందర్‌రెడ్డి వెంట ఎంపీలు బాల్క సుమ న్, సీతారాం నాయక్, మల్లారెడ్డి ఉన్నారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లు అందరూ కలసి ఒక సెట్ వేశారు. ప్రభుత్వ విప్‌లు కొప్పుల ఈశ్వర్, గొంగిడి సునీత, గంప గోవర్ధన్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు కూడా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. సీఎం తరఫున మొత్తంగా 6 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి.