ఎన్‌ఆర్‌ఐ పాలసీ అత్యుత్తమంగా ఉండాలి
మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రూపొందించే ఎన్‌ఆర్‌ఐ పాలసీ దేశంలోనే ఉత్తమ పాలసీగా ఉండాలని ఎన్‌ఆర్‌ఐ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఎన్‌ఆర్‌ఐ పాలసీ రూపకల్పనపై సోమవారం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఎన్‌ఆర్‌ఐల కోసం వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను తెలంగాణలో సైతం అమలు చేసేందుకు గల అవకాశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఎన్‌ఆర్‌ఐల కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో బుధవారం నగరంలోని హరితప్లాజాలో రాష్ట్ర ప్రభుత్వం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఆయా సంస్థల ద్వారా ఎన్‌ఆర్ పాలసీ తయారీకి అవసరమైన సలహాలు, సూచనలను స్వీకరించనుంది. ఈ సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు.