సాక్షి, హైదరాబాద్: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్–2018లో తెలంగాణ నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి స్థానం దక్కింది. 801–1,000 లోపు ర్యాంకింగ్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నిలిచింది. బోధన, పరిశోధన, ఇండస్ట్రీ ఇన్‌కమ్, ఇంటర్నేషనల్ ఔట్‌లుక్ తదితర అంశాల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా చేసిన ఈ సర్వేలో టాప్ 1,000 యూనివర్సిటీలకు ర్యాంకింగ్‌లను ఇచ్చింది.
ఇందులో టాప్–100లో దేశంలోని విద్యా సంస్థలేవీ లేవు. అయితే 251–800 వరకు ఉన్న స్థానాల్లో ఐఐటీలు నిలిచాయి. ఇక 801 నుంచి 1,000లోపు స్థానాల్లో ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలు నిలిచాయి. ఈ ర్యాంకులను టైమ్స్ సంస్థ ఇటీవల ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment