తమిళనాడుకు మన ‘నల్ల బంగారం’
- టాన్ జెన్‌కోతో 10 లక్షల టన్నుల బొగ్గు ఒప్పందం
- వచ్చే ఏడాది 30 లక్షల టన్నుల కొనుగోళ్లకు టాన్‌జెన్‌కో సంసిద్ధత
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 4 నెలల కాలంలో సిం గరేణి బొగ్గు గనుల సంస్థ నుంచి 10 లక్షల టన్నుల బొగ్గును కొనుగోలు చేసేందుకు తమిళనాడు విద్యుద్పుత్తి సంస్థ(టాన్ జెన్‌కో) ముందుకు వచ్చింది. సింగరేణి సంస్థ సీఎండీ ఇ.శ్రీధర్ సమక్షంలో టాన్ జెన్‌కో సీఈ సత్యశీలన్, సింగరేణి జీఎం బి.కిషన్‌రావు బుధవారం ఇక్కడ సింగరేణి భవన్‌లో ఒప్పం దపత్రాలపై సంతకాలు చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 30 లక్షల టన్నుల బొగ్గు కొనుగోలు చేసేందుకు తమిళనాడు జెన్‌కో ఉన్నతాధికారులు సింగరేణి యాజమాన్యం తో చర్చలు జరిపారు.
ఇప్పటి వరకు తమిళ నాడులోని సిమెంట్, సిరామిక్స్ వంటి చిన్న పరిశ్రమలకు సింగరేణి కొద్ది మొత్తంలో బొగ్గు అమ్ముతున్నప్పటికీ ప్రభుత్వ అధీనంలోని విద్యుత్ రంగానికి భారీ మొత్తంలో బొగ్గును విక్రరుుంచడం ఇదే తొలిసారి. ఈ ఒప్పందం వల్ల రెండు సం స్థలకు ప్రయోజనం చేకూరనుం దని సింగరేణి యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. సిం గరేణికి ఈ ఏడాది నిర్దిష్టమైన మార్కెట్ లభించడం ఓ శుభ పరి ణామం కాగా, ఈ ఒప్పం దాల వల్ల సగటున తమిళనాడు జెన్ కోకు టన్నుకు రూ.1000 వరకు ఆదా కానుందని పేర్కొంది. ఒప్పందం ప్రకారం మణు గూరు, భూపాలపల్లి గనుల నుం చి తమిళనాడుకు బొగ్గు సరఫరా జరగ నుం ది. ఈ బొగ్గును తమిళనాడులోని మెట్టూర్ 1400 మెగావాట్ల పవర్ ప్లాంటులో విద్యుదు త్పత్తి కోసం వినియోగించనున్నారు.
సింగ రేణి బొగ్గు వల్ల తమ సంస్థకు బొగ్గు రవాణా ఖర్చులు తగ్గుతాయని, ధర కూడా తక్కువగా ఉందని టాన్‌జెన్‌కో సీఈ సత్య శీలన్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు సుదూర ప్రాం తాల్లోని కోల్ ఇండియా కంపెనీల నుంచి, విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుం టున్నామని తెలిపారు. వచ్చేఏడాది 30 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి నుంచి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తాజాగా టాన్ జెన్‌కోతో ఒప్పందం పాటు కర్ణాటకలో కొత్త విద్యుత్ ప్రాజెక్టులకు 7 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా చేసేందుకు ఇప్పటికే సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్టీపీసీ, తెలంగాణ జెన్‌కో కొత్త ప్రాజెక్టులకు సింగరేణి బొగ్గు కేటారుుంపులు జరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది 70 మిలియన్ టన్నుల బొగ్గు విక్రరుుంచే అవకా శాలున్నా యని అధికారులు అంచనా వేస్తున్నారు. టాన్ జెన్‌కోతో జరిగిన ఒప్పందంలో సింగరేణి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(కోల్ మూమెంట్) ఎన్.శ్రీనివాస్ పాల్గొన్నారు.