
భాగ్యనగరికి పచ్చలహారం
రాజధానికి హరితహారం ఔటర్
ఔటర్ రింగ్ రోడ్డు రాజధానికి హరిత హారంలా ఉంటుందని ఓఆర్‌ఆర్ ప్రాజెక్ట్ డెరైక్టర్ శ్వేత మహంతి అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గచ్చిబౌలిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల రోజుల్లో ఔటర్ రింగ్ రోడ్డుపై లక్షన్నర మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించాయన్నారు.
-గచ్చిబౌలి
సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో...
రాష్ట్రవ్యాప్తంగా మొదలైన హరిత హారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని సిటీ పోలీసు ట్రైనింగ్ సెంటర్‌లో శుక్రవారం సాయంత్రం మొక్కలు నాటి నీళ్లు పోస్తున్న జాయింట్ పోలీసు కమిషనర్(హెడ్‌క్వార్టర్స్) ఎం.శివప్రసాద్, ఇతర సిబ్బంది, శిక్షకులు.
అమీర్‌పేటలో అసదుద్దీన్ ఓవైసీ
హరిత హారం కార్యక్రమంలో భాగంగా ఎంఐఎం పార్టీ అధ్యక్షులు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎస్‌ఆర్‌నగర్ పోలీసులతో కలిసి శుక్రవారం అమీర్‌పేటలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో స్థానిక నాయకులతోపాటు ఎస్సైలు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి
రవాణాశాఖలో శుక్రవారం హరితహారం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయ ఆవరణలో కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా మొక్కలు నాటారు. కార్యక్రమంలో అధికారులు టి.రఘునాథ్, పాండురంగారావు, ప్రసాద్ పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వర్‌రావు అన్నారు. శుక్రవారం గోషామహల్ డివిజన్‌లోని షాహినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో డీసీపీ మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏసీపీ కొలన్‌పాక రాంభూపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.
అపార్డ్‌లో...
రాజేంద్రన గర్‌ని అపార్డ్‌లో శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపార్డ్‌లో లక్ష మొక్కలను నాటనున్నట్లు తెలిపారు.