కుత్బుల్లాపూర్ పరిధిలోని షాపూర్‌నగర్‌లో శనివారం ముగ్గురు జలమండలి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు వాటర్ ట్యాంకెక్కారు. వేతనాలు సక్రమంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం రూ.15 వేలు చెల్లించాలని చెప్పినా మధ్యలో ఏజెన్సీలు రూ.5 వేలు చెల్లిస్తున్నాయని ఉద్యోగులు తెలిపారు. అదేమని ప్రశ్నిస్తే బయటి వారిని పెట్టుకుని తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. తమకు న్యాయం జరగకపోతే ట్యాంక్‌పై నుంచి దూకుతామని హెచ్చరిస్తున్నారు.