పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో నిందితుడు, ఇంజినీరింగ్ విద్యార్థి శ్రావెల్ను రెండు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది.
హైదరాబాద్: పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో నిందితుడు, ఇంజినీరింగ్ విద్యార్థి శ్రావెల్ను రెండు రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. కారు నడిపిన శ్రావెల్ను పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం కోర్టులో హాజరుపర్చారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు పోలీసులు అతన్ని విచారించనున్నారు.
ఈ నెల ఒకటో తేదీన ఇంజినీరింగ్ విద్యార్థులు తప్పతాగి కారు నడపడంతో పంజాగుట్ట ఫ్లైఓవర్పై నుంచి వాహనం కిందపడింది. ఫ్లైఓవర్ కింద కారులో ప్రయాణిస్తున్న రమ్య కుటుంబసభ్యులపై కారు పడింది. ఈ ప్రమాదంలో రమ్య, ఆమె బాబాయి రాజేష్ మృతిచెందగా.. ఆమె తల్లి ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే.