హైదరాబాద్ : భూసేకరణ అంశంపై టీడీపీ, జనసేన అధ్యక్షుడు సినీనటుడు అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మధ్య దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా పవన్ కల్యాణ్ మరో ట్విట్ చేశారు. దేశ ప్రయోజనాలను పరిరక్షించే పార్టీకి మద్దతు పలకడం ధర్మమని, ఎప్పుడైతే ఆ పార్టీ విధానాలు, చర్యలు, దేశానికి నష్టం కలిగిస్తాయో వారికి మద్దతు తెలపడం నేరంతో సమానమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మాలాని మాటలను పవన్... పై విధంగా తన ట్విట్లో ప్రస్తావించారు. రాజకీయాల్లో దేశ ప్రయోజనమే అత్యున్నతమని జెఠ్మాలానీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
మరోవైపు రాజధాని భూసేకరణ విషయంలో ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్న పవన్ కల్యాణ్ వద్దకు మంత్రుల బృందాన్ని పంపాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు సమాచారం. అవసరమైతే స్వయంగా తాను కూడా పవన్తో భేటీ కావాలని అనుకుంటున్నారట. రెండురోజుల్లో ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం.
— Pawan Kalyan (@PawanKalyan) August 22, 2015