హైదరాబాద్: ఇంజనీరింగ్ పీజీ కోర్సులు ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 26, 27వ తేదీల్లో రెండో విడత కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నట్లు సెట్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ రమేశ్ బాబు తెలిపారు.
పీజీఈసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఓయూ క్యాంపస్‌లోని పీజీఈసెట్ అడ్మిషన్స్ కార్యాలయంలో సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలని అన్నారు. మొదటి విడత కన్వీనర్ కోటా సీట్లలో 6 వేల సీట్లు భర్తీ అయ్యాయని, కేవలం 1000 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ప్రతి ఏడాది ఇంజనీరింగ్‌లో పీజీ సీట్ల సంఖ్య తగ్గుతుందని తెలిపారు.