
రాజకీయ జోక్యాన్ని సహించం
హైదరాబాద్: మా శవాలు కూడా కుల దృవీకరణ పత్రాలు సమర్పించాల్సి వస్తోంది. సెంట్రల్ యూనివర్సిటీలో హిందూత్వ రాజకీయ జోక్యం నశించేంత వరకు నిరాహార దీక్షను ఆపేది లేదు. వివక్షతో చావడం కన్నా, పోరాడి వీరమర ణం పొందడం మేలు. అని హెచ్‌సీయూలో నిరాహారదీక్ష చేస్తున్న విద్యార్థులు పేర్కొన్నారు. రోహిత్ మరణానికి కార కులపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని, వీసీ అప్పారావును పదవినుంచి తొలగించాలని, రోహిత్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి వర్సిటీలో ఉద్యోగం ఇవ్వాలని, అతని కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, స్కాలర్స్‌పై కేసులను ఎత్తివేయాలన్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి
సిటీబ్యూరో: హెచ్‌సీయూలో పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై సమగ్ర వి చారణ చేపట్టి, నిందితులను కఠినంగా శిక్షించాలని టీఎస్‌యూటీఎఫ్ నాయకులు పేర్కొన్నారు. రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా గురువారం హై దరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో దోమలగూడలోని కార్యాలయం నుంచి ఇందిరాపార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అ ద్యక్షులు నర్సిరెడ్డి మాట్లాడు తూ.. విజ్ఞాన కేంద్రాలుగా భాసిల్లాల్సిన వర్సిటీలు.. కులమత బేధాలకు నిలయాలుగా మార డం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండల్‌రావు, సంజీవరా వు, రేణు, శారద, సింహాచలం, రామకృష్ణ, నాగరాజు, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు జేఎన్‌టీయూహెచ్ బంద్
కేపీహెచ్‌బికాలనీ: హెచ్‌సీయూ విద్యార్ధి వేముల రోహిత ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించాలని కోరుతూ శుక్రవారం జేఎన్‌టీయూహెచ్ బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు జేఎన్‌టీయూహెచ్ పరిధిలోని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు.
మా శవాలు కూడా దృవీకరణ పత్రాలు ఇవ్వాలా..!
దళితులైనందునే మేం చనిపోతున్నాం. కానీ మా చావు తర్వాత కూడా మా కుల ధ్రువీకరణ పత్రాల్ని సమర్పించుకోవాల్సి వస్తోంది. రోహిత్ మరణానికి కారకులైన కేంద్ర మంత్రి దత్తాత్రేయ సహా అందరిని శిక్షించి, వీసీని తొలగించాలి. వర్సిటీల్లో రాజకీయ జోక్యాన్ని నివారించాలి. ఆర్యత్ వైఖరి, పొలిటికల్ సైన్స్ పీహెచ్‌డీ స్కాలర్.
వివక్షకు కేంద్రబిందువు
సెంట్రల్ యూనివర్సిటీ దళితుల వివక్షకు కేంద్రబిందువు. అంబేడ్కర్ స్టుడెంట్స్ అసోసియేషన్ ఆవిర్భావం నుంచి అనేక పోరాటాలు చేసింది. ఒక మేధావి మరణంతో దేశవ్యాప్తంగా ఉద్యమం వెల్లువెత్తింది. నిన్న రాహుల్ గాంధీ, నేడు కేజ్రీవాల్ అన్ని రాజకీయ పార్టీలూ వస్తున్నాయి మద్దతు పలుకుతున్నాయి. గుమ్మడి ప్రభాకర్, హిస్టరీ పీహెచ్‌డీ స్కాలర్
మాకు విముక్తి కావాలి
బ్రాహ్మణికల్ అగ్రహారాల నుంచి మాకు విముక్తి కావాలి. వారికి మా ఉద్యమం ఓ గుణపాఠం కావాలి. రోహిత్‌లా మరోదళిత మేధావి జీవితం అర్థాంతరంగా ముగియకూడదు. అందుకే జాతీయ స్థాయిలో రోహిత్ చట్టం చేయాలి.
ఉమామహేశ్వర్ రావు, పొలిటికల్ సైన్స్ పీహెచ్‌డీ స్కాలర్.
డిమాండ్లు నెరవేర్చాలి
ఉన్నత విశ్వవిద్యాలయాల్లో దళిత మేధావులను అంతమొందించే హిందూత్వ రాజకీయాలను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.బీజేపీ అధికారంలోకి వచ్చిన తొలినాటి నుంచే దళితులు, మెనారిటీలపై తీవ్రమైన దాడులకు దిగుతోంది. మా డిమాండ్లు నెరవేరినప్పుడే దీక్షను ఉపసంహరించుకుంటాం. మనోజ్.కె.పి. పీహెచ్‌డీ విద్యార్థి.